వసు, రిషి అద్దంలో చూసుకుంటూ మాట్లాడుకుంటారు. నువ్వు చేసిన ఒక్క పని వల్ల లైఫ్ లో నువ్వు నేను చాలా కోల్పోయామని రిషి అంటాడు. జీవితంలో అన్ని విలువైన జ్ఞాపకాలే ఉండవు కదా పరిస్థితులు నాతో ఒక పని చేయించాయి మీరు గొప్ప శిక్ష వేశారు. శిక్ష వేశానని అనుకుంటున్నావ్ కానీ నేను ఎంత బాధపడుతున్నానో ఆలోచించావా? వసుధార, రిషి రిషిధార అయ్యారు కానీ నేను మీ భార్యని కాలేకపోయాను. తనని తప్పు పట్టడం లేదు వాస్తవం ఆలోచించడం లేదు. నీ మీద ప్రేమ, కోపం తగ్గకపోవచ్చు. నన్ను నా మనసుని, మాటలని ఎందుకు అర్థం చేసుకోవు అని ఇద్దరూ ఒకరిగురించి మరొకరు బాధపడుతూ ఉంటారు.


Also Read: డబుల్ ట్విస్ట్, రుద్రాణి మోసం బయటపెట్టిన కావ్య- చెంప చెల్లుమనిపించిన అపర్ణ


వసు-జగతి: తాళి చూసుకుంటూ బాధపడుతుంటే జగతి వచ్చి మళ్ళీ ఏమైంది రిషి ఏమైనా అన్నాడా అని అడుగుతుంది. నన్ను అనడం కాదు ఆయన బాధపడుతున్నారు, పది మంది ముందు నాకొక స్థానం ఇచ్చారు గౌరవం నిలబెట్టారు. కానీ భార్య స్థానం ఇంకా అని వసు బాధపడుతుంది. రిషి బంగారుకొండ. తను నిన్ను ఎంత ప్రేమిస్తాడో నీకు తెలియదా? బంగారుకొండ ఇప్పుడు మంచులా గడ్డకట్టిపోయింది ప్రేమతో కరిగించుకో. తన మనసుకి దగ్గరగా వెళ్ళి ఓపికగా ఉండాలి. బంధాలు అద్దల్లాంటివి అపురూపంగా చూసుకోవాలని చెప్తుంది. తాళికి కారణం తనేనని ఒప్పుకుని భార్యని కాదని అంటున్నారు రిషి సర్ బాధే ఎక్కువ బాధిస్తుందని వసు అంటుంది. రిషియే ప్రశ్న, రిషినే సమాధానం. తనకి దగ్గర అవాలని సలహా ఇస్తుంది.


కాలేజ్ కి వెళ్లేందుకు రిషి కారు దగ్గరకి వెళ్తుంటే అప్పుడే వసు కూడా వస్తుంది. లిఫ్ట్ కావాలని అడిగితే ఇస్తానని పిలవొచ్చు కదా అని వసు అనుకుంటూ ఉంటారు. ఇద్దరూ పంతానికి అలాగే ఉంటారు. రిషి వెళ్ళి కారులో కూర్చుంటాడు యూత్ ఐకాన్ కి టెక్కు ఎక్కువే అని కారు హార్న్ కొడతాడు. పొరపాటున చెయ్యి తగిలింది పిలిచానని అనుకుంటుందేమో అని రిషి కోపంగా నేను ఎండీని అని వెళ్ళిపోతాడు. వసు పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుందని రిషి కారులో వెళ్తు అనుకుంటుంటే వెనుకాలే మహేంద్ర, జగతి ఒక బైక్ మీద వసు స్కూటీ మీద వెళ్తూ కావాలని హార్న్ కొడతారు. పక్కకి తప్పుకునేసరికి ఇద్దరూ కలిసి రిషి కారుకి అడ్డంగా ఎదురువెళ్తారు. కాసేపు కామెడీగా ఉంటుంది. రిషి వచ్చి బైక్ మీద ఎందుకు వచ్చారని అడిగితే ఏం చెప్తావని అంటే మహేంద్ర కాసేపు నవ్విస్తాడు. అప్పుడే వసు వచ్చి అలా మధ్యలో వదిలేసి వచ్చారేంటని అంటుంది. రిషి కోపాన్ని భరించలేమని మహేంద్ర, జగతి కాలేజ్ లోపలికి రాకుండా జారుకుంటారు.


Also Read: రామకి నిజం చెప్పిన జానకి- కోడలి క్షమాపణలు అంగీకరించని జ్ఞానంబ


కాలేజ్ లోకి వచ్చిన తర్వాత రిషి, వసు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. వసుతో మాట్లాడకుండా రిషి కోపంగా వెళ్ళిపోతాడు. క్యాబిన్ లోకి వెళ్ళిన ఆఫీసు బాయ్ ని పిలిచి వసుని పిలవమని చెప్తాడు. తర్వాత వసు టూవీలర్ మీద రావడం ఏంటని అనుకుంటాడు. ప్యూన్ వచ్చి వసుకి చెప్తే వెళ్ళకుండా ఫోన్ చేస్తుంది. అయితే నేనే వస్తానని అనేసరికి వసునే క్యాబిన్ కి వెళ్లబోతుంటే జగతి ఎదురుపడుతుంది. దేవయాని పంతుల్ని పిలిచి ఏదో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తుంది.