గుప్పెడంతమనసు ఏప్రిల్ 7 ఎపిసోడ్


జయచంద్ర మాటలు, కాలేజీలో ఓటింగ్ గురించి ఆలోచించిన రిషి..వసుధారని బాధ పెట్టడం పద్దతి కాదు. మా మధ్య ఉన్న దూరానికి ముగింపు పలకాలి. ఎస్ నేను వసుధారని నా భార్యగా అంగీకరిస్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు వసుధార జయచంద్ర అన్న మాట తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది. కాలేజీలో నా మాటల్ని వ్యతిరేకించారు...ఆ తర్వాత నా నిర్ణయానికి ఓటేశారు..నేను కూడ అలాగే చేశాను. ఇప్పుడు ఈ తాళిని తీసేసి మళ్లీపెళ్లి చేసుకోవాలా...ఇది మీకు అడ్డం కాకూడదు..ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటుంది.
 
రిషిధార పెళ్లిగురించి దేవయాని-జగతి మధ్య డిస్కషన్ జరుగుతుంది
దేవయాని: మీరు ఎన్నిసార్లు చెప్పినారు ఎన్ని చెప్పినా వసుధారది అసలు పెళ్లే కాదు అనడంతో
జగతి: అదేంటి అక్కయ్య తన భర్తగా ఊహించుకుని  తాళి వేసుకుంది కదా  
దేవయాని:ఎవరు పడితే వాళ్ళు ఎవర్ని పడితే వాళ్ళని ఊహించుకుని మెడలో తాళి వేసుకుంటే పెళ్లి అయిపోయినట్లేనా. అసలు నేను దీనికి అంగీకరించను
జగతి: అంగీకరించాల్సింది మీరు కాదు నేను
దేవయాని: రిషి నా మాటే వింటాడు..త్వరలోనే దాని మెడలో తాళి తెగే రోజు వస్తుంది..
నిద్రపోతున్న వసుధార..వద్దుమేడం నా తాళిని ఏమీ చేయొద్దని అరుస్తుంటుంది...అంటే అదంతా వసుధార కల అన్నమాట...


Also Read: వసు విషయంలో రియలైజ్ అయిన రిషి, ఇద్దరి మధ్యా దూరానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం


దేవయాని
అందరూ ఏదోదో అంటున్నారు జయచంద్ర గారు ఎందుకు వచ్చారో కానీ నాకు ప్రశాంతత లేకుండా చేశారు. ఆ పెద్దమనిషి వీళ్ళ పెళ్లి గురించి ఎందుకు మాట్లాడాలి ఆయన ఏం మాట్లాడారో వీళ్లు ఏం విన్నారో నాకేం అర్థం కావడం లేదు.ఈ విషయంలో రిషి ఏ నిర్ణయం తీసుకుంటాడో...ఈ ఇంట్లో ఇకపై ఏం జరుగుతుందో... రిషి తన పంతం పక్కనపెట్టి వసుధారతో పెళ్లి పీటలెక్కితే నా పరిస్థితి ఏంటి..రిషి తనని భార్యగా అంగీకరిస్తే నాపై పెత్తనం చెలాయిస్తుంది..అమ్మో ఆ ఆలోచనే భరించలేకుండా ఉంది..రిషి కూడా నాకు ఏం చెప్పలేదు. జగతిని అడిగితే చెప్పదు...ఇంకెవర్ని అడగాలి.. వసుధారని రెచ్చగొట్టి విషయం తెలుసుకోవాలి..వాళ్లిద్దరూ ఒక్కటి అవకుండా చేయాలి అనుకుంటుంది.


రిషి
వసుధార తన మెడలో తాళి వేసుకోవడంలో తప్పులేదు..నన్ను భర్తగా ఊహించి వేసుకున్న తాళి అలాగే ఉండాలి అనుకుంటాడు..


దేవయాని
అదే సమయంలో వసుధార రూమ్ కి వెళుతుంది దేవయాని..వసు బాత్ రూమ్ లో ఉంటుంది...అక్కడ వసు తాళి తెగిపోయి కనిపిస్తుంది. దాన్ని అడ్డుపెట్టుకుని ఎలాగైనా వసుతో ఆడుకోవాలని భావించి దాన్ని తీసుకుని వెళ్లిపోతుంది. 


రిషి
ఈ రోజుతో మన మధ్య ఉన్న దూరానికి ముగింపు పలకబోతున్నాను.  నీతో చాలా చెప్పాలి నీతో చాలా మాట్లాడాలి. నీకు సోరీ చెప్పాలి నా దగ్గర ఎలాంటి ప్రశ్నలు లేవు..అన్నింటికి సమాధానాలు దొరికాయి ...నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అనుకుంటాడు.. ఇంతలో అక్కడకు దేవయాని రావడంతో..వసుధార అనుకుని రా వసుధారా నీకోసమే ఎదురుచూస్తున్నాను అంటాడు. అప్పుడు దేవయాని ఏమీ మాట్లాడకుండా తాళిని అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంది. అక్కడ వసుధార లేకపోవడంతో ఆ తాళిని చూసి షాక్ అవుతాడు రిషి. 


మరోవైపు వసుధార ఫ్రెష్ అయ్యి వచ్చి మొబైల్ కోసం గది మొత్తం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు రిషి హాల్లో వసుధార అని గట్టిగా పిలవడంతో అందరూ అక్కడికి వస్తారు. ఏదో మంచి వార్త చెప్తారని అనుకున్నాను ఇదేంటి సార్ గట్టిగా అరుస్తున్నారు అనుకుంటుంది. 
రిషి: నీ నిర్ణయం కరెక్టే అని నేను అనుకున్నాను కానీ నువ్వు దాన్ని తుడిచేసావు అనడంతో అందరూ షాక్ అవుతారు. నా పంతం పక్కనపెట్టి నీ ప్రేమకు విలువ ఇవ్వడానికి సిద్ధపడ్డాను,కానీ నువ్వు నీ పొగరు చూపించావు . మన ప్రేమకి అడ్డుగా ఉన్న దూరాన్ని తగ్గించాలని అనుకున్నాను. కానీ నువ్వు ఆ దూరాన్ని మరింత పెంచావు 
వసు: ఇప్పుడు నేనేం చేశాను సార్ 
రిషి: తన చేతిలో ఉన్న తాళిబొట్టును చూపించడంతో అందరూ షాక్ అవుతారు. మరి ఇదేంటి నాకోసం వేసుకుని తాళినీ ఎందుకు తెంచావు.  ఆడది మెడలో నుంచి తాళి తీసేసింది అంటే అర్థం ఏంటి నువ్వు నన్ను భర్తగా అంగీకరించినప్పుడు నేను బ్రతికుండగానే ఎందుకు తాళి తీసేసావు . చెప్పు వసుధార నామీద నమ్మకం పోయిందా లేకపోతే మన బంధానికి ముగింపు పలకాలనుకున్నావా అంటాడు
వసు: సర్ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటి సార్ ఇది
రిషి: మన మధ్య దాపరికాలు ఉండకూడదు అనుకున్నాం. కానీ ఎన్నో విషయాలు దాచి పెట్టావు. నిన్ను రైట్ అనుకున్నాను ప్రేమ కోసం నా కోసం ఈ ఆడపిల్ల చేయని సాహసం చేసిందని గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ నువ్వు ఇలా మారిపోతావ్ అని ఊహించలేదు .
వసు: ఏం జరిగిందో తెలియకుండా ఏంటి సార్ ఇదంతా అని..మీరు చెప్పేంతవరకూ నా మెడలో నల్లపూసలు లేవనే విషయం నాకు తెలియదు.. రాత్రి ఏదో పీడకల వచ్చింది ఆ పెనుగులాటలో తెగిపడిపోయి ఉండొచ్చు... 
రిషి: మరి తాళి తెగిపోతే నీ గదిలో ఉండాలి కదా మరి నా గదిలోకి ఎందుకు వచ్చింది 
వసు: నాకు తెలియదు సార్.. నేను మీ గదికి రాలేదు
రిషి: వచ్చావు..
జగతి: రాలేదంటుంది కదా 
రిషి: వచ్చంది మేడం..నేను తన అడుగుల చప్పుడు విన్నాను... అక్కడికి వచ్చి ఈ తాళిబొట్టుని అక్కడ పెట్టేసి వెళ్లిపోయింది 
ఫణీంద్ర: దేవయాని ఇందాక నువ్వు రిషి గదికి వెళ్లావు కదా అనగా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నిజం చెప్పు దేవయాని నువ్వు రిషి గదికి వెళ్ళావా లేదా ఆ మంగళసూత్రం నువ్వు అక్కడ పెట్టావు కదా అని గట్టిగా నిలదీయడంతో అవును నేనే ఆ పని చేశాను అని ఒప్పుకుంటుంది.  ఎందుకు అలా చేశావు 


Also Read: ఏప్రిల్ 7 రాశిఫలాలు, ఈ రాశులవారికి ఇంట్లో తలనొప్పులు పెరుగుతాయి, ఆ రాశులవారికి లక్ష్మీ కటాక్షం


దేవయాని: నేను వసుధార గదికి వెళ్లాను అక్కడ వసుధార తాళి పడిపోయి ఉండడంతో అది తీసుకుని వెళ్లి రిషికి ఇచ్చి ఆ తాళి వేస్తే మనస్పూర్తిగా ఉంటుందేమో అని అలా చేశాను అని కవర్ చేస్తుంది. 
దేవయాని మాటలకు అందరూ ఆశ్చర్యపోతారు. జగతి, మహేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటారు. 
వసు: సార్ ఇంత చిన్న విషయంలో ఎంత అపార్థం చేసుకున్నారు 
వెంటనే రిషి...వసుధార చేతులు పట్టుకుంటాడు. ఇది అపార్థం కాదు వసుధార నా బాధ . నువ్వు ఎక్కడ దూరమవుతావేమో అన్న ఆవేదన. ఆ మాటలకు జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. సార్ మీకు వసు దూరమైన ఆ క్షణం అదే వసుధారకి ఆఖరి శ్వాస సార్ అని అంటుంది. ఇప్పటివరకు జరిగింది చాలు ఇప్పటినుంచి ఒకరు విభేదించుకోకండి అంటుంది జగతి. మీ భవిష్యత్తు ఏంటి అనేది మీరే నిర్ణయించుకోండి అనడంతో, మా భవిష్యత్తు ఏంటి అనేది రిషి సార్ నిర్ణయమే మేడం అని అంటుంది వసుధార...
ఎపిసోడ్ ముగిసింది...