గుండెనిండా గుడిగంటలు జూలై 17 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu July 17th Episode)
రోహిణి తన డ్రామాకు చెక్ పెట్టేందుకు మటన్ కొట్టు మాణిక్యాన్ని తీసుకొచ్చింది. ఫార్టనర్స్ మోసం చేశారని..ఆ నేరం నీతండ్రిపై నెట్టేసి జైల్లో పెట్టించారని చెబుతాడు మాణిక్యం. నాన్నా అని ప్రేమ పొంగిపోయినట్టు డ్రామా స్టార్ట్ చేసింది రోహిణి. మీ నాన్న నేరం చేయలేదని రుజులు అయ్యేవరకూ ఆయన ఆస్తులు కూడా తిరిగి ఇవ్వరని క్లారిటీ ఇస్తాడు. ఆ మాటలకు ప్రభావతి కళ్లుతిరిగిపడిపోతుంది. భారీగా బంగారం, నోట్ల కట్టలు తీసుకొస్తుండగా మలేషియా ఎయిర్ పోర్టుకి వచ్చిమరీ పోలీసులు అరెస్ట్ చేశారని కవర్ చేసి చెబుతాడు మాణిక్యం. నేను వెంటనే మా నాన్నని చూడాలని రోహిణి అంటే.. మనోజ్ ని వెంట వెళ్లమంటుంది ప్రభావతి. ఆ మాటలు విని రోహిణి షాక్ అవుతుంది. మరోసారి తండ్రి ప్రస్తావన రాకుండా చెక్ పెట్టేద్దామాని తను ప్లాన్ చేసుకుంటే మనోజ్ ని వెంట తీసుకెళ్లమంటోంది ఎందుకు? అదే జరిగితే తన గుట్టు బయటపడుతుందని రోహిణి ఫిక్సవుతుంది. ఆయనకు సంబంధించి మలేషియాకు ఎవరు వచ్చినా పోలీసులు అరెస్ట్ చేస్తారని మాణిక్యం చెప్పడంతో అంతా భయపడి ఆగిపోతారు.
రోహిణి అసలు పేరు కళ్యాణి... ఎప్పుడూ రోహిణి దగ్గర డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తి వచ్చి తాను పెళ్లిచేసుకుంటున్నా డబ్బులు కావాలని అడుగుతాడు. లేవని రోహిణి చెప్పడంతో నేను మరో పెళ్లి చేసుకుంటున్నా కానీ మొదటి భార్య పిల్లల గురించి నేను నిజం చెప్పాను..నువ్వు ఇంట్లో ఏం చెప్పలేదు కదా నేను వచ్చి చెప్తాను అంటాడు. బెదిరిపోయిన రోహిణి డబ్బులు అరెంజ్ చేస్తానని మాటిస్తుంది. అదే టైమ్ కి మనోజ్ అక్కడకు రావడంతో కంగారుగా ఆ వ్యక్తిని పంపించేస్తుంది. నేను కెనడా వెళ్లాలి డబ్బులు అరెంజ్ చేయి అని మనోజ్ అనగానే అందరకీ డబ్బులు నేనే సర్దాలా అని కోప్పడుతుంది. నేను కాకుండా ఇంకెవరు అడిగారని మనోజ్ అనగానే రోహిణి ఫ్రెండ్ కవర్ చేస్తుంది. ఇల్లు ఉందికదా తాకట్టు పెట్టి ఇమ్మని మీ అమ్మని అడుగు..నీకు సపోర్ట్ చేస్తుంది కదా అనే సలహా ఇస్తుంది.
ఇంటికెళ్లిన మనోజ్ తనకు కెనడా ఆపర్ ఉందని అక్కడికే వెళతానని అడుగుతాడు. కెనడా వెళితే లక్షలు సంపాదించవచ్చని చెబుతాడు. ఇంకా 14 లక్షలు అవసరం అవుతుంది దాన్ని సర్దడం నావల్లకాదనేస్తాడు సత్యం. ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా తాకట్టు పెడితే వస్తాయికదా..నేను కెనడా వెళ్లి బాగా సంపాదించిన తర్వాత ఇల్లు తాకట్టునుంచి విడిపించుకుందాం అంటాడు మనోజ్. ఇదంతా విన్న బాలు..స్వాతిముత్యం మొహం వేసుకుని జాతిరత్నం అడుగుతున్నాడు ఇచ్చేయండి అంటాడు. ఎప్పుడూ మనోజ్ ని సపోర్ట్ చేసే ప్రభావతి కూడా రివర్సవుతుంది. ఇల్లు మొత్తం తాకట్టుపెట్టి నీకు డబ్బు ఇచ్చేస్తే మేమమంతా ఎక్కడ ఉండాలి? రోడ్డునపడాలా అని నిలదీస్తుంది. ఆయన నోరు తెరిచి అడుగుతున్నారు కదా అత్తయ్యా ఇవ్వొచ్చుకదా అని భర్తని సపోర్ట్ చేస్తుంది రోహిణి. నీకు నీ భర్తపై అంత ప్రేమ ఉంటే మీనాన్ని అడిగి తీసుకొచ్చి ఇవ్వు..ఈ ఇల్లు మాత్రం తాకట్టుపెట్టేదే లేదని తేల్చి చెబుతుంది. ఆ మాటలకు రోహిణి మళ్లీ తనపై పిడుగుపడిందని షాక్ అవుతుంది
మీనా ఇంట్లో అడుగుపెట్టినప్పటినుంచి అన్నీ ఇలానే జరుగుతున్నాయి... శ్రుతి డబ్బుందని తనుంటే నీ విలువ తగ్గిపోతుందని పంపించేశావ్ , గొడవ కావాలనే చేశావ్ అన నింద వేసేస్తుంది. ఎవరు ఖాలీగా కూర్చుని తింటున్నారు? ఎవర్ని అనాలని ఎవర్ని అంటున్నారని మీనా నిలదీస్తుంది. మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారని రోహిణి ఫైర్ అవుతుంది. వీళ్లు శ్రుతి వేడుకలో గొడవ చేశారు..ఎప్పుడో అప్పుడు మమ్మల్ని కూడా ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేస్తారనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మొత్తం మీనావల్లే అనేస్తుంది ప్రభావతి. నాకు బాధ్యత ఉందికాబట్టే నేను వెళ్లి శ్రుతికి జరిగినదంతా చెప్పి ఇంటికి రమ్మని పిలిచాను అంటుంది. అది బాధ్యత అంటే అని సత్యం సపోర్ట్ చేస్తాడు.