గుండెనిండా గుడిగంటలు జూలై 09 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu July 9th Episode)

 ఫంక్షన్లో రచ్చ రచ్చ జరిగింది. ఎక్కడివాళ్లు అక్కడికి చేరుకున్నారు. కానీ శ్రుతి మాత్రం పుట్టింట్లోనే ఉండిపోయింది. తన తండ్రిని బాలు కొట్టాడన్న కోపంలో ఉండిపోయింది శ్రుతి. రవి ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా శ్రుతిమాత్రం వినదు. మీనాపై దొంగ అనే ముద్రవేయడంతో బాలు ఆవేశంలో ఊగిపోయాడని రవి చెప్తాడు. అది మన ఇల్లు కాదు..నేను రాను అనేస్తుంది. మరోవైపు ప్రభావతి అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. సత్యం సర్దిచెప్పినా బాలు ఈ ఇంటి పరువు తీశాడని నోటికి పనిచెబుతుంది. పూలమ్ముకునేది ఇంటి పరువు కూడా అమ్మేసిందని మీనాను టార్గెట్ చేస్తుంది. ఇంతలో బాలు మీనా రావడంతో ఇంట్లో మీరు ఉండేందుకు వీల్లేదు అంటుంది. ఎందుకు వెళ్లాలి, తనేం తప్పుచేశాడని మీనా అడిగినా కానీ వెళ్లమంటున్నది తనని కాదు ఇద్దర్నీ అంటుంది. ఆ మాటకు షాక్ అయిన బాలు మీనా ఇద్దరూ లగేజ్ సర్దుకుని కందకు వస్తారు. ఇదంతా చూసి హమ్మయ్య అనుకుంటారు మనోజ్, రోహిణి. తన తండ్రి మలేషియా హడావుడి దెబ్బకు పక్కకు పోయిందని సంతోషంలో ఉంటుంది రోహిణి. బాలు ఇంట్లోంచి వెళ్లిపోతే ఇక తనకు తిరుగులేదని ఫిక్సవుతాడు మనోజ్. గుండెనిండా గుడింగంటలు జూలై 08 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చాక ప్రభావతి తప్పంతా బాలు, మీనాదే అని తేల్చేస్తుంది. మీవల్లే ఫంక్షన్ మొత్తం నాశనమైంది,ఈ తాగుబోతుని రావొద్దని చెప్పాను అయినా నా మాట వినలేదంటుంది.  వాడు రాకపోతే రాను అని హడావుడి చేశారు ఇప్పుడు తద్దినం తెచ్చిపెట్టారని ప్రభావతి ఫైర్ అవుతుంది. తప్పుచేయని భార్యని దొంగ అని ముద్రవేస్తే ఎవ్వరు మాత్రం ఊరుకుంటారు..ఆ సురేంద్ర కావాలనే రెచ్చగొట్టాడని సత్యం అంటాడు. వయసుకి మర్యాద ఇవ్వాల్సింది కదా అంటుంది రోహిణి..అయినా ఎవరి చేతిలో బంగారం ఉంటే వాళ్లనే దొంగ అంటారని మనోజ్ అంటాడు. లక్షలు మింగినోడిని దొంగ అంటారు, పార్లర్ అమ్మేసుకోవడాన్ని దొంగ అంటారని సెటైర్స్ వేస్తాడు. 

రవి డల్ గా ఉండడం చూసి శోభ, సురేంద్ర ప్రేమగా మాట్లాడినట్టు నటిస్తారు. మొత్తం మీరే చేశారంట కదా.. మీరు నోరు జారకుండా ఉంటే  మా అన్నయ్య చేయి చేసుకునేవాడు కాదుకదా అంటాడు. రవి కూడా గట్టిగానే రిప్లై ఇచ్చేసి వెళ్లిపోతాడు. సురేంద్ర ఆవేశంగా మాట్లాడుతుంటే శోభ సర్దిచెబుతుంది. రవి మంచివాడే..మన అమ్మాయికి మంచి భర్తే దొరికాడు అందుకే శాశ్వతంగా ఇంటికి తెచ్చేసుకుందాం అని చెబుతున్నా అంటుంది. సరే అంటాడు సురేంద్ర

మరోసారి ఆలోచించండి అని మీనా అంటే.. అవసరం లేదు నేను నిన్ను పోషించలేను అనుకుంటున్నావా? మా అమ్మకు ఇద్దరే కొడుకులు నేను ఎప్పటికీ కాదు అంటాడు. ఇలా ఎందుకు చేస్తున్నావని ప్రభావతిని అడిగితే..వాడేం పెళ్లాన్ని పోషించలేనివాడు కాదు, అది కూడాబాగానే చూసుకుంటుంది అంటుంది. ఇంతలో బ్యాగులు తీసుకుని కిందకు వస్తారు బాలు, మీనా. వెళ్లొస్తాం మావయ్య అని మీనా చెబితే..నువ్వేం చెబుతున్నావు ఆయన కూడా మనతో వస్తారని అంటాడు. నా భర్తను తీసుకెళ్లేందుకు నువ్వెవడివి అని ప్రభావతి అంటే.. మానాన్నను నాకు దూరం చేయడానికి నువ్వెవరు అంటాడు బాలు. నాన్న మాతో ఉంటే.. కోడలు సమయానికి తిండి పెడుతుంది. మందులు ఇస్తుంది..ఎప్పుడైనా నాన్నకు కాఫీ ఇచ్చిన మొహాలేనా అంటాడు. సరే మీతోపాటూ నేను వస్తాను అంటాడు సత్యం. భర్త మాటలకు విలువలేని దగ్గర నేను ఉండాల్సిన అవసరం లేదు. నా కొడుకుని ఇంట్లో ఉండొద్దన్నావ్...వాస్తవానిక నేనే ఆ మాట అనాలి..కానీ నేను దుర్మార్గుడిని కాదంటాడు. 

మావయ్య మీరు తొందరపడొద్దని మీనా అంటుంది కానీ..ఇదంతా నువ్వే చేశావ్ అని ఫైర్ అవుతుంది ప్రభావతి. నిన్ను ఎవ్వరూ మార్చలేరని బాలు, మీనా బయలుదేరుతారు. నీ ఇష్టం నీది అయినప్పుడు నా ఇష్టం నాది నేను వెళతాను. మనోజ్ దారి తప్పితే మనతో కలుపుకోలేదా? రవి దారితప్పిదే ఇంటికి తీసుకురాలేదా? ఇంటి బాధ్యతను ప్రేమగా మోసేవాడిని వెళ్లిపొమ్మంటున్నావు...వీడి దారిలో వెళితే చివరి దశలో తులసి తీర్థం అయినా పోస్తాడనే ఆశ అంటాడు సత్యం. రవి-శ్రుతిని వీడివల్లే దూరం చేసుకున్నాం అంటుంది ప్రభావతి. వాళ్లు వీళ్లవల్ల వెళ్లలేదు.. సురేంద్ర పన్నిన ఉచ్చులో పడ్డారు అంటాడు సత్యం. బాలుని బయటకు వెళ్లమంటే నేను వెళ్లిపోతాను నేను ఉండాలో వద్దో తేల్చుకో అంటాడు. చేసేది లేక ప్రబావతి ఉండమనండి అంటుంది ప్రభావతి. మేం ఉండం అంటాడు బాలు.. ఈ వయసులో మా ఇద్దర్నీ విడగొడదాం అని చూస్తున్నావా , నీకు బొట్టుపెట్టి చెప్పాలా అంటుంది. మనింట్లో మనం ఉండడానికి దీని బోడి పర్మిషన్ కావాలా అని బాలు, మీనాను సత్యం లోపలకు తీసుకెళ్తాడు. ఇలా జరిగిందేంటి..బాలు పెద్ద మాయగాడు అనుకుంటారు మనోజ్, రోహిణి..   సంతోషంగా వచ్చిన సంజయ్ ను ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారని అడుగుతుంది మౌనిక. ఎందుకంత సంతోషం అని అడిగితే నీకు బ్యాడ్ న్యూస్ నాకు గుడ్ న్యూస్ అంటాడు. ఇవాళ మీవాళ్లు ఫంక్షన్ కి వెళ్లారు కదా..ఆ ఫంక్షన్ కి మీ బాలుగాడిని పిలిచారు కదా.. ఆసురేంద్ర ముక్కోపి - బాలు శాడిస్ట్ ఇద్దరూ కలసి కొట్టుకున్నారట..అది వినగానే ఎంత హ్యాపీగా ఉందో అంటాడు. మా ఇంట్లో ఫంక్షన్ చెడిపోతే సంతోషంగా ఉందా అని మౌనిక అంటే..వెళ్లి ఉంటే కళ్లారా చూసి ఎంజాయ్ చేసేవాళ్లం అంటాడు. మౌనిక బాధపడుతుంది

నిద్రపోయేముందు బాలుకి ..రోహిణి తండ్రి రాలేదన్న విషయం గుర్తుకువస్తుంది..ఈ విషయం అమ్మకు గుర్తుచేయాలి అనుకుంటాడు. తెల్లారేసరికి టిఫిన్ చేసే టైమ్ లో సేమ్ టాపిక్ రావడంతో.. మీనాన్న ఏరి అని అడుగుతుంది ప్రభావతి.. 

అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ ఎందుకుంటుంది... పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి 

అరుణాచల గిరిప్రదక్షిణ - ఈ 44 ఎనర్జీ పాయింట్స్ మిస్ చేయొద్దు ..ఇదిగో రూట్ మ్యాప్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి!