గుండె నిండా గుడి గంటలు నవంబర్ 01 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 1st Episod

Continues below advertisement

నగలు బాలుకంటపడకుండా దాచేసిన ప్రభావతి.. వాటిని తిరిగి మనోజ్ చేతికి ఇస్తుంది. మనోజ్ షాప్ కి వెళ్లి వాటిని తాకట్టుపెట్టాలి అనుకుంటాడు. అయితే కేవలం రెండు లక్షలే వస్తుందని సేఠ్ చెప్పడంతో తనకు నాలుగు లక్షలు కావాలని అడుగుతాడు. వాటని అమ్మస్తే నాలుగు లక్షలు ఇస్తానంటాడు. అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థంకాక ఆ నగలు అమ్మేయాలని నిర్ణయించుకుంటాడు మనోజ్. అప్పటికే ప్రభావతి వీటిని తాకట్టుపెట్టేందుకు ఇస్తున్నా..అమ్మేయకు అని చెప్పిమరీ ఇస్తుంది. ఆ మాటలు గుర్తుచేసుకుంటాడు కానీ ..తను గండం నుంచి గట్టెక్కాలంటే ఇదే మంచిది అని ఆలోచించి అమ్మేస్తాడు.

ఇంట్లో మీనా చేసిన చేపల పులుసు, వేపుడుని ఎంజాయ్ చేస్తారు బాలు, రవి, శ్రుతి, సత్యం. నువ్వుకూడా రా అని సత్యం పిలిచినా మనోజ్ వచ్చేవరకూ రాను అంటుంది. ఇంతలో మనోజ్ ఎంట్రీ ఇస్తాడు. అంతా అనుకున్నట్టే జరిగిందని చెబుతాడు..కానీ నగలు అమ్మేసిన విషయం మాత్రం బయటపెట్టడు. 

Continues below advertisement

షీలా డార్లింగ్ పుట్టినరోజు ఉంది..ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తాడు బాలు. బామ్మ పుట్టినరోజు సందర్భంగా గొలుసు చేయించి ఇస్తే సంతోషిస్తుంది కదా అంటాడు. సరే అయితే మన బంగారం మొత్తం అత్తయ్య చేతిలో పెట్టాం కదా.. ఆ బంగారం తాకట్టు పెట్టి బామ్మకి గొలుసు చేయించండి. ఆ తర్వాత నెమ్మదిగా విడిపిద్దాం అంటుంది మీనా. అదే విషయాన్ని సత్యాన్ని పిలిచి చెబుతారు బాలు-మీనా. మంచి ఆలోచనే వచ్చింది..మీ అమ్మ రాగానే ఆ నగలు అడగండి అంటాడు సత్యం. ఇదంతా మెట్లపై నుంచి విన్న మనోజ్.. వెంటనే తల్లి దగ్గరకు పరిగెత్తుతాడు. 

కామాక్షితో కబుర్లలో మునిగితేలుతుంటుంది ప్రభావతి. పరుగుల అక్కడకు వెళ్లిన మనోజ్.. అమ్మా ఆ బాలుగాడు నగలు ఇమ్మని అడుగుతున్నాడు అనే షాకింగ్ న్యూస్ చెబుతాడు. ఇప్పుడేం చేయాలిరా అంటూ..వెంటనే ఆ నగలు తీసుకుని రా అని మనోజ్ కి వార్నింగ్ ఇస్తుంది. కంగారుగా మనోజ్ సేఠ్ కి కాల్ చేస్తాడు. మొన్న నేను నగలు తాకట్టుపెట్టాను కదా అవి ఉన్నాయా అని అడిగితే..ఇప్పటివరకూ ఎందుకు ఉంటాయ్..వాటిని కరిగించేశాం అంటాడు. షాక్ అయిన మనోజ్..అదే విషయం ప్రభావతికి చెబుతాడు

తాకట్టు పెట్టిన బంగారం ఎలా కరిగిస్తారు అడుగుదాం పద అంటుంది..తాను తాకట్టు పెట్టలేదు అమ్మేశానంటూ అప్పుడు బయటపెడతాడు మనోజ్. ఇప్పుడు ఈ గండం నుంచి గెట్టెక్కడం ఎలా దేవుడా అని తలపట్టుకుంటుంది ప్రభావతి. 

విషయం అర్థం చేసుకున్న కామాక్షి..మనోజ్ పై సెటైర్స్ పేల్చుతుంది. ఓవైపు బాలు మీనా కష్టపడి రూపాయి రూపాయి కూడబెడుతుంటే..ఇంత చదువు చదువుకుని వీడు తగలేస్తున్నాడంటూ దుమ్మెత్తిపోస్తుంది. ప్రభావతి ఎప్పటిలా మనోజ్ ని సపోర్ట్ చేస్తుంది. ఇంటికి వెళ్లి సత్యం నగలిమ్మని అడిగితే ఏం చెబుతుందన్నది ఇప్పుడు సస్పెన్స్... మీనా దొంగిలించి పుట్టింట్లో ఇచ్చేసిందేమో అనే నిందవేసినా వేస్తుంది...

2025 నవంబర్ 02 క్షీరాబ్ధి ద్వాదశి! లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం సులువైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి