గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 17 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu September 17 Episode)

Continues below advertisement

ఫర్నిచర్ షాపులో పాత స్టాఫ్ ని ఉద్యోగంలోంచి తీసేసి కొత్తవాళ్లని పెట్టుకుంటాడు. మేం దీన్నే నమ్ముకుని బతుకుతున్నాం అని వాళ్లు చెప్పినా.. నాకు యంగ్ బ్లడ్ కావాలి ముసలి వాళ్లు వద్దంటూ పంపించేస్తాడు. మా అనుభవంతో షాప్ ని ఇంతవరకూ తీసుకొచ్చాం అని చెబుతారు. అయినా మీరు అవసరం లేదంటూ పంపించేస్తాడు. ఉన్నపాటుగా మూడు కుటుంబాలను రోడ్డునపడేశారు..మా ఉసురుమీకు తగిలితీరుతుందని సాపం పెట్టి వెళ్లిపోతారు. వేగంగా ఎదగాలని చూస్తున్నాడు.. వేగమే వాడిని రోడ్డుమీద నిలబెడుతుందంటారు.

Continues below advertisement

ఇంటికొచ్చిన మనోజ్ తెగ బిల్డప్ ఇస్తాడు. షాప్ కి వెళ్లి బోలెడు దిష్టి తగిలింది ఆగండి అంటూ గుమ్మం దగ్గరే ఆపుతుంది ప్రభావతి. అవునమ్మా నీ కొడుకు కుర్చీలు, బెంచీలు మోసి,అమ్మాల్సిన పరుపులపై పడుకుని అలసిపోయాడంటూ సెటైర్స్ వేస్తాడు బాలు. దిష్టి తీస్తుంది ప్రభావతి. సాధించావని అని శ్రుతి సెటైర్ వేస్తుంది. రోజే కదా ఫస్ట్ డే..అప్పుడే మూలుగుతున్నాడని సెటైర్ వేస్తాడు సత్యం. మొదటిరోజే మూలుగుతుంటే మా నాన్నకి ఇవ్వాల్సిన 40 లక్షలు ఎలా ఇస్తావ్..అవి ఇచ్చేవరకూ అయినా షాప్ కి వెళ్లాలని అంటాడు బాలు.

శ్రుతి ఫ్యాన్ వేయి..ఎవరైనా ఒళ్లు నొక్కండి..జ్యూస్ తెచ్చి ఇవ్వండి అంటాడు మనోజ్. అరేయ్ నీ పెళ్లాం పక్కనే ఉంది..అందరకీ పనులు చెబుతావేంటని ఫైర్ అవుతాడు బాలు. ఎవరూ ఏమీ చేయాల్సిన అవసరం లేదంటుంది రోహిణి. ఒక్కరోజేకే ఇలా అయిపోతే ఎలా అని ఫైర్ అవుతాడు సత్యం. బస్సులో ఎవరికి సీట్ ఉన్నా మీకు తప్పకుండా సీట్ ఉంటుంది..మీలా ఒకేచోట కూర్చునే అవకాశం ఎక్కడ కలుగుతుందని క్వశ్చన్ చేస్తుంది ప్రభావతి. మా నాన్న రాత్రి పగలు తేడా లేకుండా లీవ్ లు కూడా తీసుకోకుండా డ్యూటీ చేశారు. పని అయినా మనకు గౌరవాన్ని ఇస్తుంది, మనల్ని నమ్ముకుని వచ్చిన భార్యని ఫోషించడానికి ఆధారమైందని ఇష్టంగా పనిచేస్తే అలసట అనేదే తెలియదని చెబుతాడు సత్యం. నేను నైట్ డ్యూటీలు చేశాక నిద్రలేక తెల్లవారుజామున ఇంటికొస్తే మీ అమ్మ పక్కనే నలుగురు ప్రశాంతంగా నిద్రపోయి కనిపించేవారు..నాన్న ఉన్నాడనే ధైర్యంతో మీరంతా ప్రశాంతంగా కనిపించేవారు. మీకోసమే కదా కష్టపడుతున్నా అని సెకెండ్ షిప్ట్ కి వెళ్లిపోయేవాడిని అంటాడు సత్యం.

మనోజ్ కావాలనే రూమ్ లోకి వెళ్లిపడుకుంటాడు. రోహిణి వాడిని లేపుతావా నన్ను లేపమంటావా అని బాలు గొడవకు దిగుతాడు. ప్రభావతి ఎప్పటిలా మనోజ్ కి సపోర్ట్ చేస్తుంది. రోహిణి మాత్రం సైలెంట్ గా ఆగిపోతుంది కానీ రూమ్ లోంచి మాత్రం బయటకు రాదు. మీరు మా రూమ్ తీసుకోండిరా అని తండ్రి అనడంతో వద్దులే నాన్నా అని మేడపైకి వెళ్లి పడుకుంటారు మీనా బాలు. మనోజ్ కావాలనే ఇదంతా చేశాడు..నిన్న కిందపడుకోబెట్టాల్సి వచ్చిందని బాధపడతాడు బాలు. నాకు ఇక్కడే హాయిగా ఉందంటుంది మీనా.

తెల్లారేసరికి కాఫీ తీసుకొచ్చి సత్యానికి ఇస్తుంది మీనా. వెళ్లి మనోజ్ కి ఇవ్వు అంటుంది. మీ పెద్ద కొడుక్కి పెళ్లికాలేదా? పెళ్లాంలేదా? నా మొగుడికి ఇస్తాను...మావయ్య అత్తయ్యకి ఇస్తాను.. నా కన్నా చిన్నవాళ్లు కాబట్టి శ్రుతి రవికి ఇస్తాను అంటుంది. కోడలిగా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ సరిగ్గా మాట్లాడావ్..ఇలానే ఉండు ఇకపై అని కాంప్లిమెంట్ ఇస్తాడు సత్యం. వాడు ఎప్పుడో రెడీ అయిపోయి ఉంటాడు వస్తాడు అంటుంది ప్రభావతి..ఇంతలో రోహిణి వచ్చి ఇంకా నిద్రలేవలేదని చెబుతుంది. మీనా నవ్వుతుంది..కోపంగా వెళ్లిపోతుంది రోహిణి. వెనుకే వెళ్లిన ప్రభావతి మనోజ్ ని నిద్రలేపేందుకు తంటాలు పడుతుంటే సత్యం వచ్చి క్లాస్ వేస్తాడు.