గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 10 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 December 10 Episode

Continues below advertisement

బాలు-మీనా ఇద్దరూ కలసి..ప్రభావతి సత్యం మధ్య దూరం తగ్గించాలని ప్లాన్ చేసుకుంటారు. నాన్న అలా ఉండడమే కరెక్ట్ అంటాడు బాలు. అత్తయ్యతో మాట్లాడకుండా ఉంటే ఎలా అంటుంది మీనా. ఏదో ఒకటి చేసి ఇద్దర్నీ కలపాలని ఫిక్సవుతారు.

మళ్లీ కథలోకి కల్పన ప్రస్తావన వచ్చింది. అప్పట్లో తండ్రి డబ్బులు 40 లక్షలు మింగేసి కల్పనకు ఇచ్చాడు మనోజ్. ఆమె మోసం చేసి పోయింది.. ఆ తర్వాత ఓ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చి మనోజ్ కి దొరికిపోయింది. రోహిణి-మనోజ్ కలసి దాన్నుంచి ఆ డబ్బు వసూలు చేశారు. అయితే వాటిని తిరిగి తండ్రికి ఇవ్వకుండా వాటిలో కొంతమొత్తంతో బిజినెస్ ప్రారంభించారు. మిగిలిన డబ్బును అవసరానికి బయటకు తీస్తూ అదంతా తన తండ్రి పంపించాడని చెప్పుకుంటోంది రోహిణి. ఇప్పుడు కూడా మీనా బంగారం అమ్మేసుకున్నందుకు బదులుగా ఇవ్వాల్సిన 4 లక్షలు అలానే ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా ముందు 2 లక్షలు ఇచ్చేసి బాలు నోరు మూయించాలని ఫిక్సవుతుంది రోహిణి. వెంటనే ఆ డబ్బు డ్రా చేసుకుని ఇంటికి వెళుతుంది. 

Continues below advertisement

రోహిణి ఇంటికి వెళ్లేసరికి హాల్లో కూర్చుని ఉంటాడు సత్యం...రాగానే మీనాను పిలిచి బాలు ఉన్నాడా అని అడుగుతుంది. పిలువు అని చెబుతుంది. మీనా బాలుని పిలుస్తుంది. డబ్బు తీసి సత్యం చేతిలో పెడుతూ...ఇదిగోండి మావయ్యా బాలు డబ్బులు..వీటికోసం మమ్మల్ని అస్తమానం అవమానానికి గురిచేస్తూనే ఉన్నాడు అంటుంది రోహిణి.  ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని రోహిణిని ప్రశ్నిస్తుంది ప్రభావతి. మా నాన్న పంపించారని ఎప్పటిలా అబద్ధం చెబుతుంది రోహిణి. మీ నాన్న జైల్లో కదా ఉన్నారని సత్యం అంటే.. అవును జైల్లో కూడా బ్యాంకులు ఉంటాయేమో అని సెటైర్ వేస్తాడు బాలు. అంటే ఇక్కడ జరిగినవన్నీ మీ నాన్నకు చెప్పావా? ఈ గొడవంతా అలా చెప్పడం కరెక్టేనా అని క్వశ్చన్ చేస్తుంది ప్రభావతి. ఇంతకీ ఆయన జైల్లో ఉంటే నీతో ఎవరు మాట్లాడారు? డబ్బు ఎవరు పంపించారు? అని అడుగుతాడు. మలేషియా మావయ్య పంపించారని మరో అబద్ధం చెబుతుంది. 

ఆ డబ్బు నాకు వద్దు.. మింగేసింది 4 లక్షలు..ఇచ్చింది 2 లక్షలు అందుకే వద్దంటాడు. అదేంటమ్మా అని సత్యం అడిగితే.. మింగేసింది 4 లక్షలు..ఇస్తున్నది 2... ఇవి నేను తీసుకెళ్లి లోపల పెట్టాక మేం 4 ఇచ్చాం..2 ఏం చేశారో అని నాపై నిందవేస్తే అప్పుడు ఏం సమాధానం చెప్పాలి అంటాడు బాలు. అయినా ఇది మా అన్న దమ్ముల సమస్య మేం తేల్చుకుంటాం అంటాడు బాలు. నేను వేరు మనోజ్ వేరు కాదుకదా తీసుకో అంటుంది. మీరు తీసుకోండి రోహిణి చెబుతోంది కదా అంటుంది మీనా. ఇంక మనోజ్ ని అవమానించవద్దు అంటుంది రోహిణి. ఇంకా 2 బాకీ ఉన్నాయ్..అవి తీర్చేవరకూ వదిలేదే లేదు అంటాడు బాలు. 

ప్రతిసారీ వీళ్లు చేసిన తప్పులకు నువ్వు బాధ్యతపడుతున్నావమ్మా రోహిణి.. అది వాళ్లకు అలవాటు చేయవద్దు..ఇకపై అయినా తప్పులు చేయవద్దని చెప్పు అని వార్నింగ్ ఇస్తాడు. మీనాన్న మొత్తం డబ్బులు ఇచ్చి ఉంటే బావుండేది అంటుంది ప్రభావతి. బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు కదా..ఒక్కసారి ఇవ్వడం కుదర్లేదు అంటుంది రోహిణి. డబ్బులన్నీ ఇచ్చేవరకూ వాడిని భరించాల్సిందే అంటుంది ప్రభావతి. అయినా మనం దాచుకున్న డబ్బులన్నీ అయిపోతున్నాయ్ అంటాడు మనోజ్.. ఇవన్నీ బంగారం దాచేసే ముందు ఉండాలి అని క్లాస్ వేస్తుంది

మనోజ్ గాడు ఇచ్చిన 2 లక్షల రూపాయలతో రేపు వెళ్లి బంగారం కొనుక్కుందాం అంటాడు బాలు. మీరు కొనేవరకూ బంగారం వేసుకోను అన్నా కదా..అయినా అవి తీసి ఇచ్చేశా కదా నాకు వద్దు అంటుంది. మరి ఆ లక్షలు ఇంట్లో ఉంటే మనోజ్ గాడు మింగేస్తాడు అంటాడు బాలు. అయితే ఆ డబ్బులతో సెకెండ్స్ లో మరో కారు కొని తిప్పుదాం...అలా వచ్చిన డబ్బులతో చిట్టీ వేద్దాం..రూమ్ కడదాం అంటుంది. నేను రెండు కార్లు కొంటే మనోజ్ గాడి రెండు కళ్లు భగ్గుమంటాయ్ కదా అంటాడు. మావయ్య సంతోషిస్తారు అంటుంది మీనా. వాళ్లిద్దర్నీ కూడా కలపాలండి అంటుంది. 

హాల్లో పడుకున్న సత్యాన్ని రూమ్ లోపలకు వెళ్లమని అడుగుతాడు బాలు. నేను వెళ్లను అనేస్తాడు సత్యం. వాళ్లు మాకు 2 లక్షలు ఇచ్చారు.. మరో 2 లక్షలు ఇస్తారు. మేం ఆ విషయాన్ని వదిలేశాం..మీరెందుకు సీరియస్ గా తీసుకుంటున్నారని అడుగుతుంది మీనా. డబ్బుల గురించి సమస్య కాదు.. మీ అమ్మ బుద్ధిమారలేదు అందుకే ఇదంతా అంటాడు. నేను కూడా ఇక్కడే పడుకుంటానని వచ్చేస్తుంది ప్రభావతి. మీరు వెళ్లి గదిలో పడుకోండి కాసేపట్లో మావయ్య వస్తారు అంటుంది మీనా. అంతా నన్ను ఆడిపోసుకుంటున్నారు కదా అని మీనాపై ఫైర్ అవుతుంది మళ్లీ. నాన్నా నువ్వు వెళ్లు నాన్నా అని మళ్లీ అడుగుతాడు బాలు. సత్యం రూమ్ లోకి వెళ్లిపోతాడు. అత్తయ్యా మీరు వెళ్లండి అంటే.. నేను ఇక్కడకు వచ్చాకే ఆయన అక్కడకు వెళ్లారు.. అంటే నేను ఉన్నదగ్గర ఉండడం ఇష్టం లేదనే కదా.. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా అని మీనాపై అక్కసు వెళ్లగక్కుతుంది

పొద్దున్నే నువ్వు నిద్రలేచావేంటి అని అడుగుతుంది మీనా. మెలకువ వచ్చేసింది అంటుంది శ్రుతి. నువ్వింత త్వరగా లేచావేంటి..రవి బతిమలాడితే కానీ నిద్రలేవవు కదా అంటుంది రోహిణి. నీకెలా తెలుసు అంటే..మీ బెడ్ రూమ్ మా రూమ్ పక్కనే ఉంది అంటుంది. ముగ్గురూ కాఫీ తాగుతారు. అత్తయ్యకు కాఫీ ఇచ్చావా అని రోహిణి అడిగితే.. ఇచ్చాను అక్కడున్న సింక్ తాగింది అంటుంది మీనా. మావయ్య మాట్లాడకపోతే మీనాపై కోపం ఎందుకు అంటుంది శ్రుతి. అంతా బాలువల్లే కదా అంటుంది రోహిణి. మొత్తం చేసింది మీ ఆయనే కదా కోపం రావాల్సింది మనోజ్ పై కదా అని దులిపేస్తుంది మనోజ్. బాలు వచ్చి మనోజ్ కి చెప్పకుండా ఫర్నిచర్ ఎత్తికెళ్లి అమ్ముకుంటే పర్వాలేదా? అని కడిగేస్తుంది. అత్తయ్య ఇచ్చారు అంటుంది రోహిణి.  మీనా నగలు ఇవ్వడం తప్పు... అమ్ముకోవడం తప్పు... మనోజ్ కి మ్యానర్స్ లేదు ఆంటీకి ఏమైందని గట్టిగానే అంటుంది. అత్తయ్య వింటే బావోదు ‌అంటుంది మీనా. రోహిణి విన్నది కదా చెబుతుందిలే అంటుంది శ్రుతి. నాకేం అవసరం అని రోహిణి అనగానే...అయితే నువ్వు మంచిదానేవే అన్నమాట అంటుంది శ్రుతి.

ఆధ్యాత్మిక రహస్యం: అమ్మవారికి నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతుని బలివ్వండి అంటారు? ఎందుకు? అసలు బలి అంటే ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

దేవతల వాహనాలను ఆధునిక టెక్నాలజీతో ముడిపెడితే! ఆశ్చర్యపరిచే రహస్యాలు! eVTOL, AVATAR ఇంకా...