గుండెనిండా గుడిగంటలు జూన్ 02 ఎపిసోడ్

 గుండె నిండా గుడి గంటలు సీరియల్ ట్విస్టులతో సాగుతోంది. మే 31 శనివారం ఎపిసోడ్ ఉండదు.. జూన్ 02 ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ముందుగానే మీకోసం

సంజయ్ పెట్టిన బాధలు భరించలేక ఇంట్లోంచి బయటకు వచ్చి గుడిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటుంది. బాలు మీనా మధ్య మాటలు లేకపోవడంతో సత్యం ద్వారా పూల ఆర్డర్ విషయం చెబుతాడు బాలు. వెంటనే పూలు కట్టేందుకు హెల్ప్ చేయమని సుమతిని కలిసి చెప్పేందుకు గుడికి వెళుతుంది. ఆ గుడిలో మౌనికను చూస్తుంది. మీనాను చూడగానే ఏడ్చేసిన మౌనిక..ఏం జరిగిందో మాత్రం చెప్పదు.  

ఆటో సర్వీస్ చేస్తూ మధ్యలో రోడ్డుపక్కన టీ తాగుతుంటాడు బాలు. మౌనికను వెతుకుతూ ఫొటో పట్టుకుని తిరుగుతుంటాడు సంజయ్. వాడిని చూడగానే బాలు సైలెంట్ గా టీ కప్పు పక్కనపెట్టేసి వెళతాడు. సంజయ్ చూసుకోకుండా వెనుకనుంచి నడుచుకుంటూ వచ్చి బాలుని గుద్దేస్తాడు. ఇద్దరూ వాదించుకుంటారు. ఎవరిగురించి వెతుకుతున్నావ్ అంటే అడ్రస్ కోసం అంటాడు. ఏది నాకు చూపించు చెప్తాను అని బాలు అన్నా పట్టించుకోడు. నీ అవసరం నాకు లేదంటాడు. వీడికి అసలు విషయం తెలియకూడదు అనుకుని ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బాలుకి అనుమానం వస్తుంది. సంజయ్ ఎవరి ఫొటో చూపించి వెతుకుతున్నాడని ఆ చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేస్తాడు. తన ఫోన్లో ఉన్న మౌనిక ఫొటో చూపించే ఈ అమ్మాయినేనా చూపించాడని కన్ఫామ్ చేసుకుంటాడు. అప్పుడికి నేరుగా సంజయ్ ఇంటికి బయలుదేరుతాడు

మౌనిక ఎక్కడుందో తెలియలేదని ఇంటికెళ్లి సంజయ్ చెప్పడంతో..అంతా భయపడుతుంటారు. తను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే తమపైకే వస్తుందని టెన్షన్ పడతారు. ఇంతలో నేరుగా మౌనిక అత్తవారింటికి వెళతాడు బాలు. మౌనిక ఎక్కడుందని అత్తను ప్రశ్నిస్తాడు. ఆమె ఏమీ చెప్పలేకపోతుంది. వెనుకనుంచి సంజయ్, తండ్రి బెదిరిస్తారు. ఇలా అడిగితే ఎవరూ చెప్పరు అని కోపంగా పండ్ల దగ్గరున్న కత్తి తీసుకుని సంజయ్ పైకి వెళతాడు బాలు. అందరూ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు..సంజూ వణికిపోతాడు. ఇంతలో మౌనిక ఎంట్రీ ఇస్తుంది

జూన్ 02 ఎపిసోడ్ లో అత్తారింట్లోకి మౌనిక ఎంట్రీ సీన్ హైలెట్ కాబోతోంది. ఎందుకంటే ఇన్నాళ్లుగా సంజయ్ ఎన్ని కష్టాలు పెట్టినా బయటపడలేదు మౌనిక. అన్నలు, వదినలు ఎన్నిసార్లు అడిగినా అక్కడ ఏం జరుగుతోందో చెప్పలేదు మౌనిక. ఇప్పుడు కూడా సంజయ్ గురించి నిజం బయటపెడుతుందో లేదో సందేహమే. అయితే ఏమీ జరగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్లాలంటే వీళ్లెందుకు చెప్పడం లేదు? వాడు నీ ఫొటో పట్టుకుని ఎందుకు వెతుకుతున్నాడు? అసలు ఏం జరుగుతోంది? నువ్వు ఏదో దాస్తున్నావని బాలు అడుగుతాడు. మరోవైపు సంజయ్ భయపడుతుంటాడు. ఇప్పుడు నిజంగా మౌనిక నిజం చెబితే ఈరోజుతో సంజయ్ పని ఔట్. కానీ మౌనిక నిజం చెప్పదు. నేను బాగానే ఉన్నాను ఎందుకు ఆవేశం అని అడుగుతుంది. ఎవరికీ చెప్పకుండా గుడికి వెళ్లాను అందుకే కంగారుపడి ఉంటారని అబద్ధం చెప్పేసి బాలుని కూల్ చేసి పంపించేస్తుంది. వెళుతూ వెళుతూ కూడా తన చెల్లెలుకి ఏదైనా జరిగితే చంపేస్తానని బెదిరించి వెళతాడు బాలు.

 కానీ బాలు వెళ్లిపోయిన మరుక్షణం మళ్లీ తన బుద్ధి చూపిస్తాడు సంజయ్. ఎక్కడికి వెళ్లావ్? నీ అన్న బాలుని నువ్వే కావాలని పంపించావా? మీ ఇద్దరూ కలసి నాటకాలు ఆడుతున్నారా అని మొదలుపెడతాడు. మౌనిక ఏడుస్తూ వెళ్లిపోతుంది. మౌనికను ఇబ్బంది పెడదాం అనుకుంటే ఆమె నన్ను టెన్షన్ పెట్టిందని మండిపడతాడు సంజయ్ 

ఆవేశంగా ఇంటికి చేరుకున్న బాలుకి..మీనా ద్వారా మౌనిక పరిస్థితి గురించి తెలిసే అవకాశం ఉంది. అత్తవారింట్లో మౌనిక ఏదో బాధలు అనుభవిస్తోందని..గుడి దగ్గర ఏడుస్తుంటే చూశానని మీనా చెబితే ..అప్పటి నుంచి బాలు ఫుల్ ఫోకస్ మౌనికపై పెట్టే చాన్సుంది. ఇంట్లో చెబితే సమస్య మరింత పెద్దది అవుతుందని భావిస్తాడు బాలు.అందుకే ఏం జరిగిందో తెలుసుకుని తనే సెట్ చేయాలని ప్లాన్ చేసుకుంటాడు.