గుండెనిండా గుడిగంటలు మే 30 ఎపిసోడ్
మౌనిక గురించి సంజూ కంగారు
మౌనికా ఇంట్లోంచి వెళ్లిపోవడంతో సంజూ- తండ్రి కంగారుపడతారు. పుట్టింటికి వెళ్లిపోయిందిలే అని ధీమాగా ఉన్నవాళ్లకి ప్రభావతి కాల్ చేసి మౌనికతో మాట్లాడాలి అని అడిగి షాక్ ఇస్తుంది. దీంతో ఎక్కడికి వెళ్లిందో , ఏమైందో..ఏదైనా లెటర్ పెట్టేసి ఆత్మహత్య చేసుకుంటే మొత్తానికి మునిగిపోతాం అని భయపడతారు. వెంటనే మౌనిక ఎక్కడుందో వెతకాలని ఫిక్సవుతారు. మౌనిక ఫొటో పట్టుకుని అందరికీ చూపిస్తూ రోడ్లపై తిరుగుతుంటాడు సంజయ్.
స్నేహితుడిని కలిసిన బాలు
ఆటో నడిపే బాలు తన స్నేహితుడిని కలుస్తాడు. ఓ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తాడు ఆ వ్యక్తి. కాసేపు మాట్లాడిన తర్వాత బాలును తన పార్టీలో వారి నాయకుడి దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి పెద్ద గొడవ జరుగుతుంటుంది. పార్టీ నేత భారీ సామూహిక వివాహాలను చేయాలని ప్రణాళిక వేసుకుంటాడు.ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని హడావుడి చేస్తుంటాడు. 250 జంటలకు సామూహిక వివాహాలు చేయాలి అనుకుంటే అంతమందిని ఏర్పాటు చేయలేకపోతాడు పార్టీ కార్యకర్త..అందుకే ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. బాలు స్నేహితుడు అశోక్ జోక్యం చేసుకుని తాను చూస్తాను ఆ పనులన్నీ అని చెప్తాడు. ఇంతలో పెళ్లి దండలు రాలేదని అశోక్ కి ఫోన్ కాల్ రావడంతో పార్టీ నాయకుడు అశోక్ పై ఫైర్ అవుతాడు. స్పందించిన బాలు తన భార్యకు పూలకొట్టు ఉంది తీసుకొచ్చి దండలు ఇద్దాం అంటాడు. సరే అని చెప్పి 20 వేలు అడ్వాన్స్ ఇస్తాడు పార్టీ నేత. సమయానికి పెళ్లి దండాలు అందాలని హెచ్చరిస్తాడు.
మీనా పూలకొట్టుకి పెద్ద ఆర్డర్
ఇంటికెళ్లిన బాలు మీనాతో ఈ విషయం చెప్పాలి అనుకుంటాడు కానీ తనతో మాటలు లేకపోవడంతో తండ్రిని పిలిచి చెప్తాడు. మీనాను పిలవండి అని తండ్రితో చెప్పడంతో పక్కనే ఉన్న మీనా వచ్చి ఏంటో చెప్పండి అంటుంది. 500 పెళ్లి దండలు ఆర్డర్ వచ్చిందని చెప్పడంతో మీనా షాక్ అవుతుంది. రెండు రోజుల్లో ఇవ్వాలని చెప్పడంతో సరే అంటుంది..వెంటనే పని ప్రారంభించేస్తుంది. గుడికి వెళ్లి పూలు అల్లేవారిని పిలుచుకుని వస్తానని వెళుతుంది.
మౌనిక కోసం సంజూ
మౌనిక కోసం సంజూ వెతుకుతూ రోడ్డుపై తిరుగుతుంటాడు. బాలు చూస్తాడు. ఎవరి గురించి ఆ వ్యక్తి వెతుకుతున్నాడని ఆరా తీస్తే మౌనిక గురించి అని తెలుస్తుంది.
మౌనికను చూసిన మీనా
గుడిలో మౌనికను చూసి షాక్ అవుతుంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గుడికి వచ్చేసిన మౌనిక ఏడుస్తుంటుంది. మీనాను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైందని అడిగినా సమాధానం చెప్పదు. ఊరికే గుడికివచ్చానని, పుట్టింటికి వెళ్లేందుకు వీలులేక ఇక్కడ కూర్చున్నా అంటాడు. మీనా కూడా పెద్దగా ప్రశ్నలు వేయదు.
సంజూని బెదిరించిన బాలు
మౌనిక ఇంట్లో లేదని తెలిసుకున్న బాలు నేరుగా వెళ్లి సంజూను, అత్త, మామను నిలదీస్తాడు. ఎవ్వరూ ఏమీ మాట్లాడకపోవడంతో సంజూ గొంతుపై కత్తి పెట్టి బెదిరిస్తాడు. ఇంతలో మౌనిక వస్తుంది. ఏమైంది ఎక్కడికి వెళ్లావని బాలు అడుగుతాడు
గుండెనిండా గుడిగంటలు జూన్ 2 ఎపిసోడ్ లో...మౌనిక చెప్పే సమాధానంపై బాలు రియాక్షన్ ఆధారపడి ఉంటుంది..నువ్వెక్కడికి వెళ్లావ్? నీ ఫొటో పట్టుకుని వీడెందుకు వెతుకున్నాడని ప్రశ్నిస్తాడు.
తిరుమల అలిపిరి మెట్లదారిలో ఈ అద్భుతాలను గమనించారా..మీరెన్ని చూశారు
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి