Gruhalakshmi Telugu Serial Today Episode:  లాస్య కట్టుకథలు చెప్పి తులసి మీద నందగోపాల్‌కు ధ్వేషం కలిగేలా మాట్లాడుతుంది. నందగోపాల్‌ సీరియస్‌గా లాస్యకు వార్నింగ్‌ ఇస్తాడు. అయినా లాస్య నందగోపాల్‌ను కన్వీన్స్‌ చేసి తన ఇంటికి తీసుకెళ్తుంది.  ప్రియ ఫోన్‌ చూస్తూ బెడ్‌రూంలో ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. అది గమనించిన దివ్య లోపలికి వెళ్లి..


దివ్య: ఎందుకు ఏడుస్తున్నావు..


ప్రియ: ఏం లేదు తలనొప్పిగా ఉంది.


దివ్య: నిజం చెప్పు మొన్న కూడా ఇలాగే ఏడ్చావు. కారణం అడుగుతే బుకాయిస్తూ నిజం దాచావ్‌. సమస్య ఏంటో చెప్పు.


అని బెడ్‌పై ఉన్న రిపోర్ట్స్‌ చూసి ప్రెగ్నెన్సీ ఎలా పోయిందని కోపంగా అడుగుతుంది. సంజయ్‌ చేయించాడని చెప్తుంది ప్రియ. దీంతో కోపంగా హాస్పిటల్‌కు వెళ్లిపోతుంది దివ్య. లాస్య తన ఇంటికి తీసుకెళ్లిన నందకు మందు తాగిస్తుంది.


లాస్య: హాట్‌ డ్రింక్‌లా ఎప్పుడూ కిక్కిచ్చే మూడ్‌లో ఉండేవాడివి.. ఎందుకిలా సాఫ్ట్ డ్రింక్‌లా తయారయ్యావు. ఎందుకు తులసి శాడిజం భరిస్తున్నావు.


నంద: తులసిది శాడిజం అని ఎవరన్నారు.


లాస్య: నేనంటున్నాను కదా


నంద: నేను అనలేదు కదా


  అయినా ఎవరి అభిప్రాయాలు వారివి ఇప్పుడవన్నీ ఎందుకు అంటూ నందగోపాల్‌ ప్రశ్నిస్తాడు. లాస్య స్లోగా నందగోపాల్‌కు పెగ్గుల మీద పెగ్గులు మందు తాగిస్తూ.. తులసి మీద కోపం వచ్చేలా రెచ్చగొడుతుంది. దీంతో కోపంగా నందగోపాల్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.  దివ్య కోపంగా హాస్పిటల్‌కు వస్తుంది. సంజయ్‌, విక్రమ్‌ వాళ్ల అమ్మ ముగ్గురు సీరియస్‌గా ఏదో డిస్కస్‌ చేసుకుంటూ ఉంటారు. లోపలికి వచ్చిన దివ్య కోపంగా సంజయ్‌ని చూస్తూ చెంప పగులగొడుతుంది.  దీంతో విక్రమ్‌, వాళ్ల అమ్మ షాక్‌ అవుతారు. మళ్లీ దివ్య, సంజయ్‌ను కొట్టబోతుంటే.. విక్రమ్‌ అడ్డుపడతాడు.


విక్రమ్‌: ఏంటి నువ్వు చేస్తున్న పని..


దివ్య: వదులు విక్రమ్‌.. నన్ను ఆపకు వీడి రక్తం కళ్ల చూస్తే గానీ నా ఆవేశం చల్లారదు.


విక్రమ్‌ వాళ్ల అమ్మ: ఏంటిరా ఇది రోజురోజుకు నీ పెళ్లాం ఆగడాలు ఎక్కువవుతున్నాయి. నీ ముఖం చూసి దీన్ని భరిస్తున్నాం. తింగరి చేష్టలు ఎక్కువవుతున్నాయి. నా కళ్ల ముందే సంజయ్‌ని కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా?


దివ్య:  చూస్తూ ఊరుకోకండి అత్తయ్య మీ చిన్నకొడుకు పరువు నిలబెట్టే పని చేశాడు. మనమంతా గర్వంగా తల ఎత్తుకునే పని చేశాడు. సన్మానం చేద్దాం.. పూలదండ తెప్పించండి. శాలువా తెప్పించండి. సింహాసనం మీద కూర్చోబెట్టి ఘనంగా సన్మానం చేద్దాం.  


అంటూ ఆవేశంగా దివ్య మాట్లాడుతుంటే విక్రమ్‌, దివ్యను తిట్టి సంజయ్‌ని కొట్టే హక్కు నీకు లేదని కోప్పడతాడు.  ఏదైనా ఉంటే నాకు గానీ మా అమ్మకు గానీ చెప్పాలని అంతే కానీ నువ్వు ఇలా చేయడం పద్దతి కాదని చెప్తాడు విక్రమ్‌. అయితే అసలు నిజం చెప్తాను. చెప్పిన తర్వాత సంజయ్‌ని ఏం చేస్తావని దివ్య అడుగుతుంది. నీకన్నా ఎక్కువే శిక్షిస్తానని విక్రమ్‌ దివ్యతో చెప్పడంతో ప్రియ అబార్షన్‌కు సంజయ్‌ కారణమని చెప్పడంతో విక్రమ్‌ కోపంగా సంజయ్‌ని కొడతాడు. వాళ్ల అమ్మ కూడా సంజయ్‌ని తిట్టి కొడుతుంది. సంజయ్‌ సారీ అడుగుతాడు. నిన్ను క్షమించే ఉద్దేశ్యమే లేదని నీకు శిక్ష పడాల్సిందే అంటూ కోపంగా దివ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.


నందగోపాల్‌ ఇంటికి వచ్చి ఇంట్లోనే మందు తాగుతుంటే హని వచ్చి ఎందుకు మందు తాగుతున్నారు అని  అడుగుతే హనిని తిడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply