Gruhalakshmi telugu Serial today Episode:  అత్తయ్య ఆరోగ్యం కోసం నేను ఎంతైనా కష్టపడతాను అంటూ దివ్య చెప్పడంతో..  ఇలాగే నేను ఇంట్లో కూర్చుంటే అన్ని మర్చిపోతాను. పుల్‌ కాకున్నా ఆఫ్‌ డే ఆయినా హాస్పిటల్‌కు వెళ్తానని విక్రమ్‌ను బతిమాలుతాడు సంజయ్‌.


రాజ్యలక్ష్మీ: అంతలా బతిమాలుతున్నాడు కదా ఒప్పుకోరా..దీక్ష కూడా మానను అంటున్నాడుగా


ఈ పిచ్చి మాలోకం అమ్మ బతిమాలితే చాలు పడిపోతాడు అని దివ్య మనసులో అనుకుంటుంది.


విక్రమ్‌ : సరే అమ్మ ఆఫ్‌ డే వెళ్లమను.


అనగానే బసవయ్య చిన్నల్లుడు ఆట గెలిచావ్‌ అంటాడు. ఆట ఇంకా మిగిలే ఉంది  మామయ్య అంటాడు విక్రమ్‌. దివ్య కూడా అవును ఆట మిగిలే ఉంది నేను ఆడి గెలిపిస్తాను అంటూ విక్రమ్‌ను పక్కకు జరిపి  దివ్య చెస్‌ ఆడి సంజయ్‌కు చెక్‌ చెబుతుంది అందరూ షాక్‌ అవుతారు. 


తులసి ఆఫీసుకు వస్తుంది. ఉద్యోగులందరూ లేచి తులసికి విష్‌ చెప్తారు. వెనకాలే నందగోపాల్‌ వస్తాడు. ఏ ఒక్క ఉద్యోగి కూడా నందగోపాల్‌ ను పట్టించుకోరు. అనుమానంగా నందగోపాల్‌ ప్రతిరోజు అందరూ నన్ను విష్‌ చేసేవాళ్లు ఇవాళ ఎవ్వరూ నన్ను పట్టించుకోవడం లేదేంటి అనుకుంటూ తన చాంబర్‌లోకి వెళ్తాడు. ఇంతలో అక్కడికి లాస్య పురమాయించిన ఉద్యోగి  వచ్చి  తులసి మేడం వాళ్ల అమ్మగారి మరణానికి కారణం మీరేనని ఆఫీసులో అందరికీ తెలిసింది అందుకే మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని చెప్తాడు. దీంతో నందగోపాల్‌ ఆలోచనలో పడిపోతాడు. తులసి ఎందుకిలా చేస్తుందని బాధడతాడు.


బసవయ్య డబ్బులు బెల్ట్‌ లో పెట్టుకుని బెడ్‌రూంలోకి వెళ్లి తన భార్యకు చూపిస్తుంటే.. దివ్య చూస్తుంది. అక్కకు అనుమానం రాకుండా దొంగ లెక్కలు రాసి నొక్కేసిన డబ్బు ఇది అని చెప్తాడు బసవయ్య. జాను వచ్చి దివ్యను ఎంటి మా అమ్మానాన్న రూంలోకి చూస్తున్నావు అని అడిగితే ఏం లేదు మీ అమ్మానాన్న చెమ్మచెక్కా ఆడుకుంటున్నారు చూస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది.


తులసి ఆఫీసులో ఫైల్స్‌ చూస్తుంటుంది. వాళ్ల అమ్మ చనిపోయిన విషయమే తులసికి పదేపదే గుర్తుకు వస్తుంది. ఇంతలో నందగోపాల్‌ తులసి చాంబర్‌లోకి వస్తాడు.


నంద: నేను వచ్చింది ఆఫీసు విషయాలు మాట్లాడటానికి. కొత్త ప్రాజెక్ట్‌ కు సంబంధించి డీటైల్స్‌ రెడీ చేశాను. బ్రీఫ్‌గా వివరిస్తాను.


అనగానే తులసి కోపంగా మేనేజర్‌కు ఫోన్‌ చేసి చాంబర్‌లోకి పిలిచి ఎవ్వరినిబడితే వాళ్లను నా చాంబర్‌లోకి రానివ్వోద్దని.. ఇప్పటి నుంచి ఎవ్వరి హద్దులో వాళ్లను ఉంచండని చెప్తుంది. దీంతో నందగోపాల్ అక్కడి నుంచి బాధగా వెళ్లిపోతాడు.  


లాస్య, భాగ్యం గార్డెన్‌లో టీ తాగుతూ ఉంటారు.


భాగ్యం: ఏంటి నీ మైండ్‌కు పండగ సెలవులు ఇచ్చావా? రిలాక్స్‌ గా ఉన్నావ్‌.


లాస్య: ఇంతకు ముందు డ్రైవింగ్‌ సీట్లో ఉండేదాన్ని. ఇప్పుడు దూరంగా ఉండి కథ నడిపిస్తున్నాను. అందుకే రిలాక్స్‌ డ్‌ గా ఉన్నాను.


ఇంతలో లాస్యకు తులసి ఆఫీసులో పనిచేస్తున్న ఎంప్లాయి ఫోన్‌ చేస్తాడు.


ఎంప్లాయి: మేడం ఆఫీసులో కథ ముదిరి పాకాన పడుతుంది.


లాస్య: నాకు కావాల్సింది మీ డైమండ్‌ రాజు గిలాగిలా కొట్టుకుంటూ శోకాలు పెట్టడం.


ఎంప్లాయి: దాదాపు అదే జరుగుతుంది మేడం నందుగారి కళ్లల్లో కన్నీళ్లు ఒక్కటే తక్కువ మేడం.


లాస్య: ఏదీ తక్కువ కాకూడదు. అనుకున్నవాటికి కన్నా అన్నీ ఎక్కువే జరగాలి.  


భాగ్యం: ఏంటీ అప్పుడే సెలబ్రేషన్‌ మోడ్‌లోకి వెళ్లావ్‌.


లాస్య: తులసి నందుల మధ్య నేను పెట్టిన పొగ నిప్పులు కురిపిస్తుంది.


అంటూ లాస్య, భాగ్యం సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.


నందగోపాల్‌, తులసి కోసం ఇంటిదగ్గర వాళ్ల అమ్మానాన్నలు ఎదురుచూస్తూ ఉంటారు. ఇంకా ఆఫీసు నుంచి ఫోన్‌ రాలేదంటే అక్కడేం గొడవలు జరగలేదని అనిపిస్తుంది అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటారు. ఇంతలో తులసి ఆఫీసు కారులో కంగారు రావడం చూసి షాక్‌ అవుతారు. తులసి వాళ్ల దగ్గరకు వచ్చి నందగోపాల్‌ మధ్యాహ్నం ఆఫీసు నుంచి వెళ్లిపోయాడని ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయడం లేదని కంగారుపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ ముగుస్తుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply