Gruhalakshmi Telugu Serial Today Episode: నందగోపాల్ ఫుల్లుగా మందు తాగి తులసి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు. ఇప్పుడు తులసి నాకు వేసిన శిక్ష ఇన్నాళ్లు తనను బాధపెట్టినందుకా? వాళ్ల అమ్మ చావుకు కారణమైనందుకా? లేక అన్నింటికీ కలిసి పగ తీర్చుకుంటుందా? కాళ్లు పట్టుకున్నా కరగడం లేదు అని బాధపడతాడు నంద. ఇంతలో అక్కడకు లాస్య వస్తుంది. లాస్యను చూసిన నంద అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటే..


లాస్య:  ఎక్కడికి?


నంద: చెప్పను


లాస్య: ఎందుకు చెప్పవు


నంద: నా వెంటబడి అక్కడికి కూడా వస్తావు. నాకు ప్రశాంతత కావాలి.


లాస్య: అందుకే కదా నేను వచ్చింది.


నంద: లాస్య అసలే చాలా చిరాగ్గా ఉంది విసిగించకు


అనగానే లాస్య వెళ్తాను కానీ కొన్ని నిజాలు మాట్లాడి వెళ్తాను అంటూ తులసి గురించి నందకు బ్యాడ్‌గా చెప్పడంతో నంద కోపంగా లాస్యను తిడుతూ తులసిని ఏమ్మన్నా అంటే బాగుండదని నిద్రలో కూడా నిన్ను నమ్మను నావెంట పడటం మానేయ్‌ అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో లాస్య షాక్‌ అవుతుంది.


తులసి, పరంధామయ్య, అనసూయ హాస్పిటల్‌కు వెళ్తారు. డాక్టర్‌ దగ్గర కూర్చుని పరంధామయ్య గురించి డాక్టర్‌తో మాట్లాడుతుంది తులసి. టెస్టులు చేశాక అన్ని చెప్తానని అంటాడు డాక్టర్‌. టెస్టులన్నీ అయిపోయాక పరంధామయ్యను బయటకు పంపిస్తాడు డాక్టర్‌.


తులసి: డాక్టర్‌ ఏదైనా సీరియస్‌ ప్రాబ్లమా?


డాక్టర్‌: ఒక విధంగా అవుననే చెప్పాలి. ఆయనకు అల్జీమర్‌ వ్యాధి వచ్చింది.


అనసూయ: ఆయనకుంది మతిమరుపే కదా డాక్టర్‌. చిన్న సమస్యే కదా?


డాక్టర్‌: ఇప్పటికి ఇది చిన్న సమస్యే రాను రాను అది తీవ్రం అవుతుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఆయనకు తెలిసిన పనులు కూడా ఎలా చేయాలో గుర్తు ఉండదు.


అంటూ డాక్టర్‌ మెడిసిన్స్‌ రాసిస్తాడు. ఈ వ్యాధి సెకండ్‌ స్టేజ్‌లో ఉంది. జాగ్రత్తగా ఉండాలి ఆయన ప్రాబ్లమ్స్‌ కూడా ఆయనకు తెలియవు.. మీరే తెలుసుకుని సాల్వ్‌ చేయాలి. అని చెప్పి డాక్టర్‌ తులసి వాళ్లను పంపిస్తారు. దివ్య హాల్లో కూర్చుని రాజ్యలక్ష్మీ కొబ్బరిబొండంలో అబార్షన్‌ మెడిసిన్‌ కలిపి ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇంతలో విక్రమ్‌ అక్కడకు వచ్చి దివ్యను ఓదారుస్తాడు. అమ్మ నీకోసం చాలా బాధపడుతుంది. అంటూ అమ్మ నీకోసం టిఫిన్‌ పంపించింది తిను అనగానే వద్దని టిఫిన్‌ ను తోసేస్తుంది.


విక్రమ్: దివ్య నిన్నెప్పుడు ఇలా చూడలేదు. నా దివ్య ఎప్పుడూ ఇలా ఉండదు. ఎం జరిగిందో చెప్పు నీ ముఖంలో ఏదో తెలియని కలవరం, భయం టెన్షన్‌గా కనిపిస్తున్నావు. ఎవరేమన్నారు.  


అని విక్రమ్‌ అడగ్గానే రాజ్యలక్ష్మీ గురించి విక్రమ్‌కు చెప్పినా నమ్మడని ఆ విషయం చెప్పడం కన్నా విక్రమ్‌తో హ్యాపీగా ఉండటమే బెటర్‌ అని మనసులో అనుకుంటుంది దివ్య.


విక్రమ్‌: ఎందుకిలా మౌనంగా ఉన్నావ్‌ మాట్లాడు దివ్య. నీ మనసులో మాటలు పైకి చెప్పు భార్యభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు అది నీకు తెలసు


అది అన్నిసార్లు నిజం కాదు విక్రమ్‌ ఆ విషయం నీకు తెలియదు అని మనసులో అనుకుంటుంది దివ్య.


విక్రమ్‌: ఓపెన్‌గా మాట్లాడు నువ్వేం చెప్పినా వింటాను. నువ్వేం ఏం అడిగినా కాదనను.


దివ్య: విక్రమ్‌ నేను మా అమ్మ దగ్గరకు వెళ్తాను.


విక్రమ్‌: అంటే నా నుంచి దూరంగా వెళ్లిపోతావా?


దివ్య: అలా ఎందుకు అనుకుంటావు?


విక్రమ్‌: నాకు అలాగే అనిపిస్తుంది.


దివ్య: అది కాదు విక్రమ్‌


...అనగానే విక్రమ్‌ ఇంత సడెన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావని అడుగుతాడు. నేనేం అడిగినా కాదనని మాట ఇచ్చావ్‌ విక్రమ్‌ ఇప్పుడు ఎందుకు మళ్లీ ప్రశ్నిస్తావు అంటూ అడుగుతుంది దివ్య. అమ్మను కూడా ఒకమాట అడగాలి కదా అని విక్రమ్‌ అంటే అత్తయ్య కాదంటే అని దివ్య ప్రశ్నిస్తే.. అలాంటిదేం ఉండదని చెప్పి విక్రమ్‌ వెళ్లిపోతాడు. హాస్పిటల్‌ నుంచి ఇంటికి వస్తారు తులసి, అనసూయ, పరంధామయ్య.. పనిమనిషి వచ్చి డాక్టర్‌ ఏం చెప్పారని అడుగుతుంది. ఏం లేదని అంత నార్మల్‌ గానే ఉందని తులసి అబద్దం  చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : కళ్యాణ్‌కు కనకం, కనకానికి కావ్య.. షాకుల మీద షాకులు