Gruhalakshmi September 30th: బసవయ్య వినాయక చవితి పూజ చేయకముందుగానే నిండు చంద్రుడిని చూసేసరికి నీలాపనిందలు మోస్తూనే ఉంటాడు. ఎవరిని కదిలించినా తన మీద నిందలు వేస్తూనే ఉంటాడు. చవితి చంద్రుడు చాలా పవర్ ఫుల్ అనుకుంటాడు. దివ్య వినాయక చవితికి సంబంధించి పనులన్నీ పూర్తి చేస్తుంది. రాములమ్మని దివ్య ఇంటికి పిలిపిస్తుంది. ఆన్ని వంటలు క్యారేజ్ లో పెట్టి రాములమ్మతో పుట్టింటికి పంపించేస్తుంది. రాజ్యలక్ష్మి ప్రసన్నతో కలిసి మరొక ప్లాన్ వేస్తుంది. ఎవరు చూడకుండా దివ్య బెడ్ రూమ్ లో దాచిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎత్తుకు రమ్మని రాజ్యలక్ష్మి చెప్తుంది. అలా చేస్తేనే కదా దివ్య మీద నింద వేసి విక్రమ్ కి కోపం వచ్చేలా చేసి వాళ్ళని వేరు చేయగలిగేదని అంటుంది. ఎత్తుకురావడం అంటే తన వల్ల కాదని ప్రసన్న భయపడుతుంది. ఈ పని చేసేది తన కోసం కాదని జానూ కోసమని అంటుంది. కూతురు కోసమని అనేసరికి ప్రసన్న భయపడుతూనే పని చేస్తానని అంటుంది.
Also Read: ముకుంద తిక్క కుదర్చడానికి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ- దూరం దూరం అంటోన్న కృష్ణ
ప్రసన్న దివ్య గదికి వెళ్ళి డాక్యుమెంట్స్ కోసం వెతుకుతుంది. కనిపించలేదని చెప్పి ప్రసన్న రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి చెప్తుంది. దివ్య వాటిని ఎక్కడ పెట్టిందా అని ఆలోచిస్తుంది. నందు పూజ కోసం వినాయకుడిని తీసుకుని వస్తాడు. ఇక పూజ కోసం అవీ ఇవీ చేయాలని మళ్ళీ చాంతాడంత లిస్ట్ చెప్పేసరికి నందు బిక్క మొహం వేస్తాడు. కష్టమైన పనులు చేస్తాను తులసిని పనిలోకి రాకుండా చేస్తానని అంటాడు. నైవేద్యం పనులు సంగతి చూడమని అనసూయ పురమాయిస్తుంది. రాములమ్మ అవసరం లేదు దివ్య పంపించిందని చెప్తుంది. తన చేత్తో చేసిన నైవేద్యాలు తులసి చేతితో దేవుడి దగ్గర పెట్టాలని దివ్య కోరికని అంటుంది. ఈ సందర్భంగా కూతురు చేతి వంట తినే అదృష్టం దక్కిందని అంటాడు. కూతురు దగ్గర నుంచి క్యారేజ్ వచ్చిందని చిన్నతనంగా ఉందని తులసి అంటుంది. కానీ అత్తింట్లో ఉండి కూడా అమ్మ గురించి ఆలోచించిందంటే తన ప్రేమ వెలకట్టలేనిదని పరంధామయ్య నచ్చ జెపుతాడు.
భాగ్య ఇంట్లో వినాయకుడి పూజ చేసుకుంటుంటే లాస్య మాత్రం ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. మొగుడిని గదిలో కూర్చోబెట్టి ఇక్కడ పూజలు చేయడం ఏంటని లాస్య డౌట్ పడుతుంది. బయటకి రాకుండా ఉన్నాడు ఏంటని లాస్య అడుగుతుంది. కానీ భాగ్య మాత్రం అదేం కాదు నందు బావది మా వారిది ఒకటే రక్తం కదా అందుకే ఎందుకైనా మంచిదని తన జాగ్రత్తలో తాను ఉంటున్నానని చెప్తుంది.
ALso Read: మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - ఇవాళ ఎపిసోడ్ అస్సలు మిస్సవకండి!
లాస్య: అంటే నీకు నా మీద అనుమానమా? అంత చీప్ క్యారెక్టర్ లాగా కనిపిస్తున్నానా?
భాగ్య: ఎంతైనా ఉప్పు కారం తినే మనిషి కదా. నిన్ను చూడగానే ప్రసాదంలాగా కళ్ళకు అద్దుకుంటే నా పని పులిహోర అయిపోతుంది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలి మాదిరిగా కాపురం చేయడం నా వల్ల కాదు. అది తులసక్కకే సాధ్యం
తన ముందు చిల్లర డబ్బుల కోసం ఆశపడే మనిషి ఇలా మాట్లాడుతుందని లాస్య తిట్టుకుంటుంది.
Also Read: రాహుల్-రుద్రాణికి షాక్ ఇచ్చిన రాజ్ , అయ్యో తల్లీకొడుకుల ఆస్కార్ పెర్ఫామెన్స్ వేస్ట్!
హనీ ఆకలిగా ఉందని పెద్దాయనకి చెప్పుకుని బాధపడుతుంది. పిల్ల మాటలకి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అప్పుడే ఇంట్లో పని చేసే కృష్ణవేణి దొంగచాటుగా బిస్కెట్లు కొని తీసుకొస్తుంది. పచ్చి కూరగాయలు తింటుంటే జాలిగా అనిపించి తెచ్చానని చెప్తుంది. అవి పెద్దాయనకి ఇచ్చి వెళ్లబోతుంటే రత్నప్రభ వస్తుంది. పని మనిషి మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. వెంటనే తీసుకొచ్చినవి తిరిగి తీసుకెళ్లమని తిడుతుంది. ఒక నెల రోజుల పాటు జీతం లేకుండా పని చేయాలని, పచ్చి కూరగాయలు తినాలని పనిష్మెంట్ ఇస్తుంది. తప్పు చేస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని మొగుడు పెళ్ళాలు హెచ్చరిస్తారు.