జాహ్నవి ఒంటరిగా కూర్చుని ఉండగా రాజ్యలక్ష్మి వస్తుంది. ఇంటి నుంచి వెళ్లిపోతానని అంటుంది. కానీ రాజ్యలక్ష్మి మాత్రం తనని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. బావ అంటే ఇష్టమని తన మొహంలో సంతోషం వచ్చే దాకా చేస్తానని శపథం చేశావ్ ఇప్పుడు ఏమైంది చెంప దెబ్బ పడేసరికి సైలెంట్ అయ్యావా అంటుంది.


జానూ: ఇప్పుడు బావ దివ్యతో సంతోషంగానే ఉన్నాడు కదా. ఇక నా అవసరం ఏముంది?


రాజ్యలక్ష్మి: సెటిల్ అయ్యిందని ఎవరు చెప్పారు


జానూ: కళ్ల ముందు కనిపిస్తుంది కదా బావ కూడ దివ్య వైపు ఉన్నాడు


రాజ్యలక్ష్మి: దివ్యకి మొగుడు ఎక్కడ చేజారిపోతాడని భయం అందుకే పైకి లేనిపోని ప్రేమ చూపిస్తుంది. తన ఆధిపత్యం చూపించడం కోసం నిన్ను చెంప దెబ్బ కొట్టింది కానీ నువ్వు ఆగిపోయి తప్పు చేశావ్. దివ్య గెలవడం అంటే నేను ఒడిపోయినట్టే అది నీ ఇష్టమేనా. తను ఇప్పుడు మమ్మల్ని చులకనగా చూసి మీ బావని ఆడుకుంటుంది.


Also Read: ఎండీ సీటు దక్కకుండా శైలేంద్రకి ఝలక్ ఇచ్చిన వసు - జగతి జ్ఞాపకాల్లో మహేంద్ర


జానూ: అలా జరగకూడదు ఇది నా కుటుంబం.


రాజ్యలక్ష్మి: అయితే తిరగబడు. విక్రమ్​కి నువ్వంటే ఇష్టం.


జానూ: బావకి దగ్గర అవుతాను నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. నేను ఏంటో తనకి చూపిస్తాను ఇక నుంచి దయ జాలి మంచితనం ఉండవు. అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. బావని దివ్య నుంచి దూరం చేస్తాను.


పరంధామయ్య జాగింగ్ చేస్తూ ఒక చోట నిలబడి ఆగుతాడు. అక్కడ ముగ్గురు రౌడీలు ఉంటారు. ముసలోడికి దెబ్బలు తగిలి ఉంటాయని రత్నప్రభ, లాస్య అనుకుంటూ ఉండగా రౌడీలు వీడియో కాల్ చేసి చూపిస్తారు. వెంటనే అతన్ని కొట్టమని చావకూడదని రత్నప్రభ అంటుంది. రౌడీలు వెళ్లి కావాలని పరంధామయ్యతో గొడవ పెట్టుకుని కొడతారు. విక్రమ్, దివ్య యోగా చేస్తూ ఉండగా జానూ వస్తుంది. ఇద్దరి భామల మధ్య నలిగిపోతూ ఉంటాడు. ఒక వ్యక్తి దెబ్బలు తగిలిన పరంధామయ్యని ఇంటికి తీసుకుని వస్తాడు. తనని చూసి ఇంట్లో అందరూ కంగారుగా ఏం జరిగిందని అడుగుతారు. రోడ్డు మీద ఎవరో ముగ్గురు టైమ్ అడిగారు చెప్పాను కానీ ఏంటో వాళ్లు కొట్టారని చెప్తాడు. కొట్టిన వాళ్ల మీద కేసు పెడదామని తులసి, నందు అంటారు. అప్పుడే నందుకి రత్నప్రభ ఫోన్ చేస్తుంది.


రత్నప్రభ: మీ నాన్నకి దెబ్బలు బాగా తగిలాయా? అందుకు కారణం నేనే కదా. తులసి చేసిన తప్పుకి పెద్దాయనకి శిక్ష పడింది.


నందు: ఎందుకు మా నాన్న జోలికి వచ్చావ్.


రత్నప్రభ: మా ఇంటి మీదకి వచ్చి హనీని లాక్కుని పోతే ఊరుకుంటానా? దెబ్బకి దెబ్బ తీస్తాను. ఈ గొడవ ఇక్కడితో ఆగిపోవాలి అనుకుంటే అది నీ చేతుల్లోనే ఉంది.


నందు: ఏం చేయాలి?


రత్నప్రభ: హనీని తీసుకొచ్చి బుద్ధిగా మాకు అప్పజెప్పు.


నందు: నన్ను ఆలోచించుకొనివ్వండి.


Also Read: కావ్యకి సపోర్ట్​గా మాట్లాడిన అపర్ణ- రాజ్​ని నిలదీసిన కనకం, కళావతి పయనం ఎటువైపు?


రత్నప్రభ: తులసి మొండిది వినదు. ఇంట్లో వాళ్లకి ఏం జరిగిన బాధపడేది నువ్వే. హనీని వెంటనే తీసుకొచ్చి మాకు అప్పగించు అది మా బంగారు బాతు అది ఉండాల్సింది ఆ ఇంట్లో కాదు మా ఇంట్లో.


ఇక ఈ విషయం గురించి నందు, తులసి మధ్య చిచ్చు రాజుకుంటుందని లాస్య నచ్చజెపుతుంది. తమ ప్లాన్ వర్కౌట్ అయ్యిందని సంతోషపడుతూ ఉంటారు.