Gruhalakshmi October 7th: తులసి హనీని ఇంటికి తీసుకొచ్చేస్తుంది. ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావని పరంధామయ్య వాళ్ళు అంటారు. నందు కూడా రత్నప్రభ వాళ్ళ దగ్గరకి వెళ్ళి సోరి చెప్పి హనీని దింపేసి వస్తానని చెప్తాడు. కానీ తులసి మాత్రం అందుకు ఒప్పుకోదు.


నందు: అడగాల్సింది మనం కాదు ఆ పెద్దాయన


తులసి; అంత ఆస్తి ఉండి కూడ బానిసలాగా బతుకుతుంది


నందు: వాళ్ళకి ఇంకొక అవకాశం ఇద్దాం


తులసి: ఎందుకు హనీని చంపడానికా? వాళ్ళని తలుచుకుంటేనే హనీ ఎంతగా వణికిపోతుందో


నందు: గొడవలు పెంచుకుంటే మంచిది కాదు


తులసి: హనీ ఇప్పుడు ప్రమాదంలో ఉందని తెలిసి కూడా ఏమి పట్టనట్టు ఊరుకోలేను. హనీని వాళ్ళకి అప్పగించే ప్రసక్తే లేదు. ఇక ఈ విషయం గురించి ఎవరూ వాదించొద్దు ప్లీజ్


Also Read: ముకుందకి కృష్ణ అదిరిపోయే ఝలక్- మురారీని అపార్థం చేసుకున్న ప్రభాకర్!


రత్నప్రభ వాళ్ళు టెన్షన్ గా తులసి గురించి ఆలోచిస్తూ ఉంటే స్వీటీ సెటైర్లు వేస్తూ వాళ్ళని మరింత భయపెడుతుంది


స్వీటీ: నిప్పుని తొక్కడం ఎందుకు ఇప్పుడు బాధపడటం ఎందుకు? తులసి ఆంటీ నిప్పు. తాను కొరివి కారం ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో తెలిసింది కదా


రత్నప్రభ: నోర్ముయ్


స్వీటీ; తులసి ఆంటీని ఎదిరించాలంటే దేవుడు దిగి రావాలి


అవసరం లేదని లాస్య ఎంట్రీ ఇస్తుంది. తులసితో నువ్వు చేసే యుద్దంలో నిన్ను గెలిపించడానికి వచ్చాను. మీరు సామ్రాట్ అన్నావదినలు. సామ్రాట్ చనిపోగానే ఆస్తి కొట్టేయడానికి వచ్చారని కూడ తెలుసు. మీరు ఆస్తిని కొట్టేద్దామని అనుకుంటే తులసి హనీని కబ్జా చేసింది. కింద మీద పడిపోతున్నారు


ధనుంజయ్: మా కథ మీకు ఎలా తెలుసు


లాస్య: తులసి నా శత్రువు. నందగోపాల్ కి తులసి మాజీ భార్య అయితే నేను రెండో మాజీ భార్యని. తులసి మీద పగ తీర్చుకోవడానికి టైమ్ చూస్తున్నా


స్వీటీ: అంటే మీకు ఆస్తిలో వాటా కావాలా?


లాస్య: నాకు ఆస్తి వద్దు తులసి మీద పగ తీర్చుకోవడం కావాలి. నేను చెప్పినట్టు చేస్తే హనీ మీ ఇంటికి వస్తుంది ఆస్తి మీ చేతికి వస్తుంది. నందు ఒక ఫ్యామిలీ పిచ్చోడు. ఫ్యామిలీకి ఏదైనా జరుగుతుందని అంటే భయపడిపోతాడు. మొదటి మాజీ భార్య మీద మనసు పడుతున్నాడు. రిలేషన్ కలుపుకోవాలని ఆశపడుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన కథ ఒక ఎత్తు ఇప్పుడు మరొక ఎత్తు. ఆ ఇంటికి భయాన్ని పరిచయం చేస్తాను. హనీని అడ్డం పెట్టుకుని తులసి, నందుని వేరు చేయడం నా ప్లాన్. నేను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశా ఇక నో జాలి నో దయ


దివ్య అలక మీద ఉండేసరికి విక్రమ్ తనని బుజ్జగించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాసేపు తనని ఒంటరిగా వదిలేయమని దివ్య అంటుంది. గది బయట మాత్రం భార్య అంటే లెక్కచెయ్యవు కానీ గదిలోపల మాత్రం వెనుక పడతావని చిరాకుపడుతుంది. గాయం చేసిన జానూని వెనకేసుకొస్తున్నావని దివ్య కస్సుబుస్సులాడుతుంది. కాసేపు ఇద్దరూ వాదులాడుకుని కొట్టుకుని చివరికి ఒక్కటి అవుతారు.


Also Read: ఇంట్లోంచి వెళ్ళిపోయిన కావ్య- కళ్యాణ్ విషయంలో అప్పుని హెచ్చరించిన అన్నపూర్ణ!


తులసి హనీకి అన్నం తినమని తీసుకొస్తుంది. తను తినిపించబోతుంటే హనీ ప్లేట్ తోసుకుని నోటి నిండా గబగబా కుక్కుకుంటుంది. బాగా ఆకలేసిందని అందుకే ప్లేట్ లాగేసుకుని తిన్నానని చెప్తుంది.


తులసి:  నిజం చెప్పు ఆ ఇంట్లో భోజనం పెట్టారా?


హనీ: లేదు హెల్త్ కి మంచిదని పచ్చి కూరగాయలు పెట్టారు. ఆకలితో పడుకునే దాన్ని. ఆకలి వేస్తుందని తాతయ్యకి చెప్తే మంచినీళ్లు తాగమని చెప్పారు


తులసి: మరి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు


హనీ: కొత్త ఆంటీ కోపం మీతో మాట్లాడుతున్నాఅనే కదా మరి మీకు ఈ విషయం ఎలా చెప్తాను


నందు: నీతో మాట్లాడినందుకు హనీకి అన్నం పెట్టడం మానేశారు. ఇప్పుడు హనీని ఇంటికి తీసుకొచ్చి పెట్టావ్. తన పరిస్థితి ఏంటో ఆలోచించు. తనకి మంచి చేయడం కాదు చెడు చేస్తున్నావ్. హనీని తన ఇంటి దగ్గర వదిలేద్దాం


తులసి: తిండి పెట్టడం మానేశారు. స్కూల్ కి పంపించడం లేదు. బయటకి రాకుండా చీకటి గదిలో పడేశారు. వాళ్ళు రాక్షసులు


నందు: అవును రాక్షసులే. మనం జోక్యం చేసుకోవడం వల్ల హనీకి ఈ కష్టాలు


తులసి: ఏం చేస్తున్నాం ప్రేమ చూపిస్తున్నా అంతే కదా అది తప్పా అందుకు తనని ఇంతగా నరకయాతన పెట్టాలా? హనీని తిరిగి పంపేది లేదని తెగేసి చెప్పాను ఏం చేస్తారో నేను చూస్తాను