ధనంజయ్ గారిని ఈ కంపెనీ సీఈవోగా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక రిజల్యూషన్ మాత్రమే పాస్ చేయాల్సి ఉంది. ఇక బయలుదేరుతారా తమరు అంటూ లాస్య వెటకారంగా తులసికి చెప్పగా..
తులసి: లాస్య బయటుదేరాల్సింది నేను కాదు మీరు.
లాస్య: ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు తులసి. పర్మిషన్ లేకుండా కంపెనీ మీటింగ్ లోకి ఎంటర్ అవ్వడమే కాకుండా కంపెనీ సీఈవోని దూషిస్తావా? హౌ డేర్ యూ
తులసి: ఆ డైలాగులు నీవి కాదు నావి
లాస్య: మేనేజర్ బయటి వాళ్లు బోర్డు మీటింగ్‌లో ఏదేదో వాగుతుంటే గుమ్మనకుండా చూస్తావేంటి? డబ్బుకు అమ్ముడుపోయావా? లేదా నీ పాత బాస్ కదా అని మర్యాద చూపిస్తున్నావా? ముందు వీళ్లిద్దరిని మెడపట్టి బయటికి తోయండి.
తులసి: అసలు ఏమనుకుంటున్నారు. మీ గురించి మీరు. ఎవరు పడితే వాళ్లు కూర్చోవడానికి ఇది గార్డెన్ చైర్ కాదు. కంపెనీ సీఈవో చైర్. దీనికో విలువ ఉంది. దీనిలో కూర్చునే వారికి ఒక అర్హత ఉండాలి. వ్యక్తిత్వం ఉండాలి. సామ్రాట్ గారి లాంటి గొప్ప వ్యక్తి కూర్చున్న ఈ చైర్‌లో మీ లాంటి బఫూన్ గాడు కూర్చుంటే చూస్తూ ఎలా ఊరుకుంటా అనుకున్నారు.
అంటూ ఒక ఫైల్ తీసి లాస్య వాళ్లకు చూపిస్తుంది. అందులో ఆ కంపెనీ బాధ్యతలను, హని బాధ్యతను తులసికి ఇస్తున్నట్లు సామ్రాట్ గారు రాసిన వీలునామా ఉంటుంది. అది చూడగానే లాస్య, రత్న, ధనంజయ్ అందరూ షాక్ అవుతారు. బోర్డ్ డైరెక్టర్స్ కూడా తులసిని సీఈవోగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. దీంతో లాస్య, రత్న, ధనంజయ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
లాస్య: మీరేం పట్టించుకోరా? బాధ్యత లేదా? మొత్తం నామీద వేసి కాళ్లు జాపుకుని కూర్చుంటారా? పవర్ ఆఫ్ పట్టాని రెండేళ్ల క్రితమే తులసి పేరు మీద రాస్తున్న విషయం తెలుసుకోకుండా ఎలా ఉన్నారు.
రత్న: అది సీక్రెట్ అగ్రిమెంట్ ఆ పేపర్‌ను తులసి తన దగ్గరే దాచుకుంది. మూడో కంటికి తెలియదు. అలాంటప్పుడు మాకెలా తెలుస్తుంది.
తులసి: పట్టించుకోకు రత్న తను అలాగే అరుస్తుంది. కష్టపడి హని కోసం అడ్డమైన ప్లాన్లు వేసింది. శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యే సరికి ఉక్రోషం అపుకోలేకపోతుంది. మీ మీద అరిచి ప్రస్టేషన్ తగ్గించుకోవాలనుకుంటుంది.
అంటూ లాస్యకు, రత్నకు, ధనంజయ్‌కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది తులసి. మీరు మారకపోతే మిమ్మల్ని వదిలిపెట్టనని బెదిరిస్తుంది. మీరు చేసిన తప్పులన్నీ భయటపెట్టి కోర్టులో మీకు శిక్ష పడేలా చేస్తానని హెచ్చరిస్తుంది. మీరు లాస్యను నమ్ముకుంటే చెడిపోతారని చెప్పి వెళ్లిపోతుంది తులసి.
హనిమూన్‌కి వెళ్లిన దివ్య విక్రమ్‌ల వెనకాలే జాను వాళ్ల డాడీ వస్తారు.
జాను: చూశావా డాడీ దివ్య బావ చేయి ఎలా పట్టుకుందో?
జానుడాడీ: పెళ్లాం కదమ్మా..
జాను: మరి నేను
డాడీ: కాబోయే పెళ్లానివి
జాను: బావ విషయంలో తప్పు చేస్తున్నానేమో అనుకున్నాను. మారిపోయాను కూడా కానీ తులసి ఆంటీ కిడ్నాప్ డ్రామా చూసి మళ్లీ మనసు మార్చుకున్నాను.
దివ్య విక్రమ్‌తో ఈ ప్లేస్ చాలా బాగుందని ఎప్పటికీ ఇక్కడే ఉండి పోదామని చెప్తుంది. దీంతో జాను వాళ్ల డాడీ మిమ్మల్ని విడదీయడానికే మేము ఇక్కడి కొచ్చాము అనుకుంటాడు. దివ్య జానుకు ఫోన్ చేస్తుంది. జాను ఫోన్ స్విచ్చాప్ చేస్తుంది. మనం ఇక్కడికొచ్చింది ఎంజాయ్ చేయడానికి వాళ్ల గురించి ఆలోచించడానికి కాదు కదా అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు.
తాతయ్య, బామ్మ హనితో అడుకుంటూ ఉంటారు. ఇంతలో తులసి, నందగోపాల్ వస్తారు.
హని: ఆంటీ మీ ముఖంలో ఈరోజు ఏదో డిఫరెంట్ కనిపిస్తుంది
బామ్మ: నిజమే అమ్మ నీ ముఖంలో ప్రపంచాన్ని జయించినంత ఆనందం కనిపిస్తుంది.
తులసి: ఒక విధంగా ప్రపంచాన్ని జయించాననిపిస్తుంది.
అనగానే కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉంటారు. నందగోపాల్ కంపెనీ బాధ్యతల్లో నీకు సపోర్టుగా ఉంటానని భరోసా ఇస్తాడు. నాకు నువ్వు ఎన్నో సార్లు సపోర్టుగా నిలబడ్డావు. కానీ నేనెప్పుడూ నీకు హెల్ఫ్ చేయలేదు. ఇప్పటికైనా నీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వు అని అడుగుతాడు. దీంతో తులసి సంతోషంగా సరే అంటుంది.
విక్రమ్, దివ్య రూంలో టీవీ చూస్తుంటారు. ఇంతలో దివ్య టీవీ ఆఫ్ చేస్తుంది. జాను బుర్ఖా వేసుకుని అద్దం ముందు తనను తాను చూసుకుంటుంది. ఇంతటితో ఇవాళ్టి ఏపిసోడ్ ముగుస్తుంది.