Gruhalakshmi November 4th : విక్రమ్‌ వాళ్ల ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా జాను అనుమానంగా తులసికి కిడ్నాపర్ల డెన్ ఎలా తెలిసిందని అడుగుతుంది. ఇలాంటి చెత్త డౌట్లు మీకెలా వస్తాయని దివ్య అసహనం వ్యక్తం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ మొదలవుతుంది.


విక్రమ్‌ వాళ్ల మామయ్య, అత్త.. జాను అడిగిన దాంట్లో ఎం తప్పు లేదని నిజం తెలుసుకోవాలనుకోవడం తప్పెలా అవుతుందని అంటారు.


జాను: మీరు ఊరుకోండి మమ్మీ బావ వాళ్లు ఏమ్మన్నా.. సీరియస్‌ గా తీసుకోను. అడగాల్సింది అడిగేస్తాను. నువ్వు అడ్రస్‌ తెలసుకున్నావంటే అర్థం ఉంది. తులసి ఆంటీ దగ్గర క్లూ లేదు కదా ఎలా అడ్రస్‌ తెలుసుకుంది.


దివ్య: ఎంటి విక్రమ్‌ ఇది మారిపోయింది అన్నావ్‌. సారీ చెప్పింది అన్నావ్‌.. ఓదార్చింది అన్నావ్‌..


జాను: ఇవన్నీ అబద్దాలు కాదక్క బావ నిజమే చెప్పారు నీకు


దివ్య: మారిన మనిషివే అయితే ఇలాంటి అనుమానాలు ఎందుకు నీకు


అంటూ ఎవ్వరికీ నేను మా అమ్మ గురించి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి వంకర ప్రశ్నలు నాకు నచ్చవు  అని భోజనం మధ్యలోనే వెళ్లిపోతుంది దివ్య. విక్రమ్ కూడా తులసిని సమర్థిస్తారు.  జాను నిన్ను ఎవరో రెచ్చగొడితే ఈ ప్రశ్నలు అడుగుతున్నావు. అంటూ  వెళ్లిపోతాడు.  


నందు, వాళ్ల అమ్మా నాన్న హాల్లో కూర్చుని ఉంటారు. నందు లాప్‌టాప్‌లో ఏవో చూస్తుంటాడు.


Also Read: కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలి - ఓవైపు రొమాన్స్ మరోవైపు రివెంజ్ - రిషిధారలు అస్సలు తగ్గట్లేదు


తులసి: ఈరోజు ఎవరో కొత్త పార్టీని కలవాలన్నారు. ఇంకా ఇంట్లోనే ఉన్నారు.


నందు: ఈవెనింగ్‌ వెళ్తాను. కాఫే అకౌంట్స్‌ చూస్తున్నాను.


అనగానే కొరియర్‌ వస్తుంది. అది తీసుకుని చూసి కోర్టు నోటీసు అని తెలుసుకుని మనకెవరు పంపిచారని ఓపెన్‌ చేసి చూస్తారు. హనిని కిడ్నాప్‌ చేశారని రత్నప్రభ, తులసిపై కోర్టులో కేసు వేసిందని నంద చెప్తాడు. దీంతో వాళ్ల నోటీసుకు ఏ విధంగా స్పందించాలో చర్చించుకుంటారు నందు, తులసి. మరోవైపు లాస్య, రత్న ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.


రత్న: కూతుర్ని కిడ్నాప్‌ చేస్తేనే భయపడని వాళ్లు లీగల్‌ నోటీసుకు భయపడతారా?


లాస్య: చచ్చినట్టు భయపడాలి. కోర్టు దాకా వెళితే పరిష్కారం ఆలస్యం అవుతుందని బెదిరించి దారిలోకి తెచ్చుకుందామంటే ఎదురు తిరిగారు.


రత్న: లీగల్‌ నోటీసు వెళ్లగానే వాళ్లు హనిని అప్పజెప్పరు కద.. ఆడ్డుపడటానికి ట్రై చేస్తారు కదా


లాస్య: మీరు హనికి బంధువులు అందుకే మీకు ఎలాంటి ప్రాబ్లమ్‌ ఉండదు.


అని హనిని ఎలాగైనా త్వరగా తెచ్చుకోవాలని ఆలోచిస్తారు. కోర్టు ద్వారానే కాకుండా మన ప్రయత్నం మనం చేద్దామని నిర్ణయించుకుంటారు.


తులసి అలోచిస్తూ ఉంటుంది.


నంద: లాస్య ఫోన్‌ చేసింది.


తులసి: తనకి చేతనైంది అదొక్కటే


నంద: లాస్యను అంత తేలికగా తీసుకోవద్దు తులసి


Also Read: మల్లెపూల ముచ్చట్లలో మునిగితేలిన రిషిధార , శైలేంద్రని అమాయకంగా చంపేస్తోన్న ధరణి!


తులసి: ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పండి. గంటకోసారి కాల్‌ చేసి బ్రేకింగ్‌ న్యూస్‌ ఇవ్వొద్దని చెప్పండి. అసలు తన నెంబర్‌ను బ్లాక్‌ చేయండి.


నంద: ఎందుకు తనని రెచ్చగొట్టడం.


తులసి: ఇంకా భయపడుతున్నారా?


అని ఎవరెన్ని చెప్పినా వాళ్లతో కోర్టులో ఫైట్‌ చేద్దామని తులసి చెప్తుంది. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని అంటుంది. లాస్య ఇంకా మన వెంట ఎందుకు పడుతుందని తులసి బాధపడుతుంది.  అయితే లాస్య వాళ్లు చాలా డేంజర్‌ అని ఇంకా వాళ్లతో మనం గొడవ పెట్టుకోవడం  మంచిది కాదని ఇంట్లో వాళ్లు చెప్పి.. తులసి ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్టుగా ఉంటామంటారు.


దివ్య ఆలోచిస్తూ గార్డెన్‌లో కూర్చుని ఉంటుంది.


విక్రమ్‌: నువ్వు అలిగితే అందంగా ఉంటావని అన్నానని ప్రతిరోజు అలిగితే ఎలా చెప్పు. సరదాగా జోక్‌ చేశా.


దివ్య: ఇక్కడ నాకు ఒల్లు మండిపోతుంటే నీకు జోక్‌గా ఉందా? అసలు జాను ఏమనుకుంటుంది. మా అమ్మ గురించి మాట్లాడే హక్కు తనకు ఎవరిచ్చారు.


విక్రమ్‌: అదో పిచ్చిది. ఏం మాట్లాడాలో తెలియదు. విని వదిలేయాలి. సీరియస్‌గా తీసుకుంటే ఎలా?


Also Read: మల్లెపూల ముచ్చట్లలో మునిగితేలిన రిషిధార , శైలేంద్రని అమాయకంగా చంపేస్తోన్న ధరణి!


అంటే మా అమ్మను నువ్వు కూడా అనుమానిస్తున్నావా? అని అడుగుతుంది దివ్య. నేనేందుకు అనుమానిస్తాను అని విక్రమ్‌ అనగానే నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అంటూ విక్రమ్‌ వాళ్ల తాతయ్య వస్తారు. ఇంట్లో ఇవన్నీ ఎప్పుడూ ఉండే గొడవలే కానీ మీరు ఎక్కడికైనా నాలుగు రోజులు వెళ్లి రండి అని చెప్తాడు. దీంతో విక్రమ్‌, దివ్య సిగ్గుపడతారు.


రత్న , ధనుంజయ సీరియస్‌ గా ఆలోచిస్తూ ఉంటారు. లాస్య వస్తుంది.


రత్న: ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావ్‌.


లాస్య: సారీ నేను ఆ సీక్రెట్‌ ఎవ్వరికీ చెప్పను. ఎందుకంటే నా అందానికి కారణం అదే కాబట్టి.


అనడంతో వెటకారాలొద్దు లాస్య అంటూ సీరియస్‌గా చూస్తూ రేపు కంపెనీ బోర్డు మీటింగ్‌ ఉంది అదైనా గుర్తుందా? నీకు అంటుంది రత్నప్రభ. ఎందుకు గుర్తులేదు మీటింగ్‌ గుర్తుంది. మీటింగ్‌కు కట్టుకోబోయే శారీ గుర్తుంది. అంటూ మరింత వెటకారంగా లాస్య అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ ముగుస్తుంది.