నందు తాగేసి లాస్యతో నోటికొచ్చినట్టు వాగుతాడు. తులసితో గొడవ జరిగిన బలహీన క్షణాల్లో తన గురించి చెప్పాను కానీ నువ్వు ఓదారుస్తావని అనుకుంటే మాయ మాటలు చెప్పి నన్ను లొంగదీసుకున్నావని తిడతాడు.
లాస్య: ఇందులో నీ తప్పేం లేదా?
నందు: తప్పు తెలుసుకునే లోపు పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశావ్. పొరపాటున కూడా నీలాంటి దాని వలలో పడకూడదు. నీ వల్ల నా తులసిని దూరం చేసుకున్నా. పిలవకపోయినా కూడా పార్టీకి సిగ్గులేకుండా వచ్చావ్
తులసి: గొడవ పెద్దది కాకముందే ఇంట్లోకి తీసుకెళ్లండి
పరంధామయ్య: ఇక చాలు నందు పద వెళ్దాం
నందు: నాన్న అది మీకు చేసిన దారుణాలు గుర్తు లేవా?
Also Read: తెలివిగా పావులు కదుపుతున్న ముకుంద- భవానీకి నిజం చెప్పేసి కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందా?
పరంధామయ్య: గుర్తు ఉంది. దేవత లాంటి తులసిని ఒంటరిని చేసిన దాని కంటే పెద్ద తప్పు
అనసూయ: నాకు మీ నాన్నకి మధ్య చిచ్చు పెట్టి దూరం చేసింది కూడా ఈ రాక్షసి
ఇలాంటి దాన్ని క్షమించకూడదు ఇప్పుడే దేవుడు కనిపించేలా చేస్తానని కర్ర తీసుకుని వెంట పడుతుంటే పారిపోతుంది. మందు కలిపిన డ్రింక్ దివ్య వాళ్ళు తాగారు, నందు మందు కలిపిన డ్రింక్ కలపడం వల్ల హనీ మూన్ ఆగిపోయిందని ప్లేట్ తిప్పాలని అనుకుంటుంది. వెంటనే రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి తను అనుకున్నట్టు జరిగిందని, మందు మత్తులో ఫ్లైట్ టైమ్ కి లేవరని అంటుంది. దీన్ని అడ్డం పెట్టుకుని దివ్య, తులసిని శాశ్వతంగా విడదీస్తానని రాజ్యలక్ష్మి చెప్తుంది. తులసి కంగారుగా అనసూయ దగ్గరకి వచ్చి పిల్లలు నిద్రలేపినా లేవడం లేడు ఫ్లైట్ కూడా వెళ్ళిపోయి ఉంటుందని అంటుంది. అప్పుడే రాజ్యలక్ష్మి కోపంగా ఎంట్రీ ఇచ్చి దివ్య, విక్రమ్ ని గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. ఆ పిలుపుకి నందు తూగుతూ వస్తాడు. దివ్య, విక్రమ్ కూడా తూలుతూ కిందకి వస్తారు.
రాజ్యలక్ష్మి: ఇంకా మత్తు దిగలేదా? ముచ్చట పడి హనీ మూన్ ట్రిప్ ప్లాన్ చేస్తే సర్వనాశనం చేశారు
దివ్య: టైమ్ చూసి ఫ్లైట్ మిస్ అయ్యిందే అనుకుంటుంది
రాజ్యలక్ష్మి: మిస్ అవడం కాదు కావాలనే మీ వాళ్ళు ఫ్లైట్ మిస్ చేశారు. విక్రమ్ ఈ టైమ్ కి నువ్వు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉన్నావ్
విక్రమ్: సోరి అమ్మా.. తెలియకుండానే నిద్ర పట్టేసింది, దివ్య నువ్వు అయినా లేపవచ్చు కదా
రాజ్యలక్ష్మి: అది కూడా తాగేసి తూలుతూ వచ్చింది
విక్రమ్: మేం తాగామా?
రాజ్యలక్ష్మి: అది తాగలేదు పుట్టింటి వాళ్ళు తాగించారు. వీళ్ళ వాళ్ళే తాగించి కావాలని హనీ మూన్ ఫ్లైట్ మిస్ చేయించారు. ఇంత దిగజారీ ప్రవర్తించారు( బేరర్ కూల్ డ్రింక్స్ సర్వ్ చేసిన విషయం గుర్తు చేసుకుని విక్రమ్ నందు వైపు అనుమానంగా చూస్తాడు)
నందు: అల్లుడు మీ అమ్మ అనుమానంతో నింద వేస్తున్నారు నిజంగా నాకేం తెలియదు
దివ్య: మా నాన్న దిగజారిపోయే వ్యక్తి కాదు. అత్తయ్య తెలిసిఈ తెలియకుండా మాట్లాడుతున్నారు
రాజ్యలక్ష్మి: ఎవరు తాగించకపోతే మీకు మత్తు ఎలా ఎక్కుతుంది. ఒళ్ళు తెలియకుండా ఎలా పడుకుంటారు
Also Read: రుద్రాణి ప్లాన్ అట్టర్ ఫ్లాప్, స్వప్న యాడ్ తీయించేసిన రాజ్ - అక్కా, చెల్లెళ్ల మధ్య వార్
తులసి: మేం అసలు పార్టీలో మందు ఏర్పాటు చేయలేదు. ఇంట్లో అందరం కూడా కూల్ డ్రింక్స్ తాగాము
రాజ్యలక్ష్మి: ఇక్కడ పార్టీ చేసింది ఆ పెద్ద మనిషి, అల్లుడు, కూతురికి కూడా తాగించింది ఆ పెద్ద మనిషే. వేరే ఎవరికీ ఆ అవసరం కూడా లేదు. ఇదంతా నీకు తెలియకుండా జరగదు మీరిద్దరూ కలిసి చేసిన ప్లాన్
తులసి: నిజంగా నాకు తెలియదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది క్షమించండి
రాజ్యలక్ష్మి: పిల్లలు హనీ మూన్ కి వెళ్ళకుండా చేయాలని మీరే ఇలా చేశారు. జీవితంలో మందు మొహం చూడని నా బిడ్డకి మందు తాగించారు. ఎందుకు మా మీద ఇంత కక్ష. నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు. వాడిని నా నుండి దూరం చేయాలని అనుకుంటున్నారు. ఇక వాడిని మీ ఇంటికి రానిస్తే ఎందుకు పనికిరాకుండా చేస్తారు. మీరు నన్ను మోసం చేశారు. ఇక ముందు నా కొడుకు, కోడలు ఈ ఇంటి గడప తొక్కరు
దివ్య: మీరెవరు ఆ మాట అనడానికి
తులసి: నువ్వు నోర్ముయ్
రాజ్యలక్ష్మి: పుట్టింటికి వచ్చిన కూతురికి నువ్వు నేర్పిస్తుంది ఇదేనా. మీరు ఇక నా కోడలు జోలికి రావొద్దు
తులసి: అలా అనొద్దు సోరి చెప్పండి. సరిపోదంటే మీ కాళ్ళు పట్టుకుంటాను
రాజ్యలక్ష్మి: వెయ్యి సార్లు పట్టుకున్నా లాభం లేదు. ఇక నుంచి నువ్వు నీ కూతురితో మాట్లాడటానికి ప్రయత్నం చేయొద్దు అది నీ కూతురికే మంచిది కాదు.
విక్రమ్ దివ్యని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడు.
రాజ్యలక్ష్మి: ఇక నుంచి ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు
దివ్య: అలా ఎప్పటికీ జరగదు నేను ఒప్పుకోను
విక్రమ్: దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం
దివ్య: తర్వాత కాదు తేలిన తర్వాత లోపలికి వెళ్ళేది. ఇది చిన్న విషయం కాదు నీకు నీ పుట్టిల్లు ఎంత ముఖ్యమో నాకు నా పుట్టిల్లు అంత ముఖ్యం. మీరు ఆవేశంలో అన్నారని అనుకున్నా కానీ అదే మాటకి కట్టుబడి ఉంటారని అనుకుంటున్నా
రాజ్యలక్ష్మి: మీ వాళ్ళు చేసింది తప్పని అనిపించడం లేదా అత్తింటి వాళ్ళు చేసిన పనికి నా కొడుకు ఎలా సిగ్గుపడుతున్నాడో
దివ్య: నిజం తెలుసుకోకుండా మాట్లాడొద్దు