తులసి సామ్రాట్ కోరిక తీరుస్తాడు. తను పుట్టిన ఊరికి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేస్తాడు. అక్కడ తులసి స్నేహితులు ఎదురుపడి సామ్రాట్ తులసి భార్యాభర్తలు అనుకుని మాట్లాడతారు. ఆ మాటకి తులసి మౌనంగా వెళ్ళిపోతుంది. భర్తతో విడాకులు తీసుకున్న విషయం వాళ్ళకి చెప్పలేక మౌనంగా ఉన్నానని చెప్తుంది. శ్రుతి తీసుకొచ్చే టీ కోసం పరంధామయ్య ఎదురు చూస్తూ ఉంటాడు. టీ చూసి ఇదేంటి పాలు పోయడం మర్చిపోయావా అని అడుగుతాడు. విషయం చెప్పకుండా శ్రుతి డికాషన్ తాగడమే మంచిదని అంటుంది. అనసూయ వెళ్ళి పాలు పోసుకుని తీసుకొస్తానని అంటుంది. శ్రుతి తనని ఆపడానికి చూస్తుంది. ఫ్రిజ్ లో పాలు ఉన్నాయి, కీ మీ కోడలు లాస్య దగ్గర ఉందని చెప్తుంది. తాళం అడిగాను ఇవ్వనని చెప్పింది రోజుకి రెండు సార్లే టీ, కాఫీ అని చెప్పిందని శ్రుతి అంటుంది.
లాస్య గురించి నందుకి చెప్తానని అనసూయ అంటుంది. కానీ వద్దని పరంధామయ్య వారిస్తాడు. తులసి దగ్గరకి వెళ్లిపోదామని అంటుంది. అలా చేస్తే లాస్య నందుని మరింత రెచ్చగొడుతుందని అంటాడు. చేసేది లేక డికాషన్ ముక్కు మూసుకుని తాగేస్తానని పాపం ఇద్దరు దాన్నే తాగుతారు. తులసి తను పుట్టిన ఊరుకు తీసుకెళ్లినందుకు సంతోషిస్తాడు. ఇక నుంచి తన కోరికలన్నీ ముడుపు కట్టి తీర్చుకుంటానని అనేసరికి సామ్రాట్ బిత్తరపోతాడు. చిన్న చిన్న కోరికలు అంటే వెంటనే తీర్చింది కానీ పెద్దవి అయితే కష్టం కదా అని అంటాడు. తులసిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరొక సర్ ప్రైజ్ ఉందని చెప్తాడు. తులసి ఇంట్లోకి వెళ్ళి తన ఊరిలో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుని మురిసిపోతుంది. వెంటనే ఈ సంతోషం అత్తయ్యతో పంచుకోవాలని అనసూయకి ఫోన్ చేస్తుంది.
Also Read: ఏడిపించేసిన డాక్టర్ బాబు- తల్లిని చూసి ఎమోషనల్ అయిన కార్తీక్, శౌర్యని చేరుకున్న సౌందర్య
తులసి ఫోన్ కోసం అనసూయ ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఫోన్ వచ్చేసరికి ఇక్కడి గొడవలు ఎక్కడ చెప్తుందో అని పరంధామయ్య అనుకుని ఫోన్ తీసుకుంటాడు. తను పుట్టిన ఊరికి సామ్రాట్ తీసుకెళ్లాడని చెప్తుంది. పరంధామయ్య ఆరోగ్య జాగ్రత్తలు గురించి అనసూయకి చెప్తుంది. జరిగింది దాచిపెట్టి సౌకర్యంగానే ఉందని అబద్ధం చెప్తాడు. ఆ మాట విని తులసి ఆనందపడుతుంది. తులసి అలాగే కుర్చీలో కూర్చుని నిద్రపోతుంటే వాళ్ళ అమ్మ వస్తుంది. సామ్రాట్ తులసి తల్లికి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. తల్లిని పంపించినందుకు సామ్రాట్ కి ఫోన్ చేసి థాంక్స్ చెప్తుంది.
పొద్దుని నుంచి తిరిగి అలిసిపోయాను ఇంటికి వచ్చి అలాగే నిద్రపోతుంటే అమ్మ వచ్చింది చాలా సంతోషంగా ఉందని తులసి అంటుంది. అందుకే మీ మనసులో సంతోషాన్ని పంచుకుంటారనే మీ అమ్మకి పంపించాను అని చెప్తాడు. మనసులో విషయం బయటకి చెప్పకపోయినా తెలుసుకుని తీర్చే స్నేహితుడిని ఎప్పటికీ విడిచిపెట్టొద్దని తులసికి చెప్తుంది.
Also Read: చిలిపి అల్లరి చేస్తూ భార్యని ఉడికించిన యష్- బుంగమూతి పెట్టిన వేద
తరువాయి భాగంలో..
మందులు లేవని అనసూయ, పరంధామయ్య అనుకుంటూ ఉంటారు. నందుకి చెప్పడానికి వాడికి ఉద్యోగం లేదు చెప్పొద్దని అనుకుంటారు. అవి తులసి, నందు చూస్తున్నట్టుగా ప్రోమో ఉంది కానీ విన్నారో లేదో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే.