లాస్య ఆవేశంగా రాజ్యలక్ష్మి దగ్గరకి వచ్చి తులసి తన కొడుకు తన మాట వినకుండా చేస్తుందని వాపోతుంది. ఇక్కడ దివ్య కూడా విక్రమ్ మా అక్క మాట వినకుండా చేస్తుందని బసవయ్య సెటైర్ వేస్తాడు. అయినా తెలిసి తెలిసి నీ కొడుకుని తులసి చేతిలో ఎందుకు పెట్టావని ప్రసన్న దంపతులు వెటకారంగా మాట్లాడతారు. అక్కడ తులసిని, ఇక్కడ దివ్యని ఎదిరించే మార్గం చెప్పమని రాజ్యలక్ష్మి అంటుంది.
లాస్య: నా మాట చెల్లని చోట నేను మాట్లాడను. తులసి సంగతి నేను చూసుకుంటాను. ఇక్కడ దివ్య సంగతి మీరు చూసుకోండి. మీ తమ్ముడు ఉన్నాడుగా అనేసి విసురుగా వెళ్ళిపోతుంది. ఇక ప్రకాశం దగ్గరకి తోడికోడళ్ళు వచ్చి నవ్వుతారు. చాలా ఏళ్ల తర్వాత తనకి నచ్చినట్టుగా ఉంటున్నానని దానికి పెద్ద కోడలే కారణమని ప్రకాశం దివ్యని మెచ్చుకుంటాడు. విక్రమ్ ని మార్చడం చాలా కష్టంగా ఉందని దివ్య ఫీలవుతుంది. తన భర్తకి ఎలాగైనా దగ్గర అవుతానని మావయ్యకి మాట ఇస్తుంది. అత్తయ్య దొంగ ప్రేమ ఎలాగైనా విక్రమ్ తెలుసుకునేలా చేస్తానని హామీ ఇస్తుంది. తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్నా పైకి నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం భయంగానే ఉందని అంటుంది. ఏదైనా విషయం తనకి తానుగా తెలుసుకోవాలని చెప్తుంది.
లాస్య నందుకి కాల్ చేసి మాట్లాడుతుంది. తన వాయిస్ వినేసరికి నందుకి ఆవేశం వచ్చేస్తుంది. కానీ లాస్య మాత్రం ప్రేమగా మాట్లాడుతుంది. తనని ఎందుకు క్షమించలేకపోతున్నావని అడుగుతుంది. కుదురుగా ఉంటావని అనుకున్నా కానీ కుక్కతోక వంకరలాగా నువ్వు మారలేదని తిడతాడు.
Also Read: షాకింగ్ నిర్ణయం తీసుకున్న భవానీ- ముకుందకి నిజం చెప్పిన మురారీ, రేవతి భయమే నిజమవుతుందా?
లాస్య: లక్కీకి దూరంగా ఉండలేకపోతున్నా. వాడు ఎందుకో నాకు దూరం అవుతున్నాడని అనిపిస్తుంది
నందు; అది మీరు మీరు చూసుకోండి
లాస్య; తండ్రిలా దగ్గరకి తీసుకుని ముద్దు చేస్తూ పైకి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్
నందు: నాకు వాడి మీద ప్రేమ ఏమి లేదు
లాస్య: ఈసారి ఎవరితో గొడవ పెట్టుకొను కలిసి మెలిసి ఉంటాను. నన్ను నమ్ము.. నాకోసం కాకపోయినా లక్కీ మొహం చూసి అయినా నీ భార్యగా ఉండటానికి అవకాశం ఇవ్వవచ్చు కదా
నందు: ఇంకొకసారి ఇలా కాల్ చేయకు కోపం వస్తే నా మాట నేనే వినను
ఫోన్ మాట్లాడుతుంటే లక్కీ వచ్చి నందు చెయ్యి పట్టుకుని డాడీ ఆడుకుందాం రా అని గోల గోల చేస్తాడు. దీంతో నందు కోపంగా లక్కీని పక్కకి తోసేస్తాడు. వెళ్ళి గోడకి గుద్దుకుంటాడు. లక్కీ అరుపుకి తులసి కిందకి వచ్చి తిడుతుంది. తలకి దెబ్బ తగలడంతో వాడికి తులసి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇక నుంచి లక్కీని తన రూమ్ లో పడుకోమని తులసి చెప్తుంది. వాడు వెళ్ళిపోయిన తర్వాత తులసి మళ్ళీ నందుకి క్లాస్ పీకుతుంది. ప్రేమ ఉంచుకుని కూడా పైకి మాత్రం దూరం పెడుతున్నట్టు నాటకాలు ఆడుతున్నారని తిడుతుంది. యాక్షన్ చేసేది వాడు తను కాదని ప్రతిసారీ ఇరికిస్తున్నాడని నందు నిజం చెప్పినా కూడా తులసి నమ్మదు. ఎన్ని చెప్పినా కూడా తననే రివర్స్ లో అనుమానిస్తుందని తలబాదుకుంటాడు.
Also Read: రెండు హృదయాలు భారమైన వేళ- వసు నుంచి ఊహించని ప్రశ్న, అయోమయంలో రిషి
దివ్య విక్రమ్ ని బుట్టలో వేసుకోవడానికి చూస్తుంది. బెడ్ కి అడ్డంగా కట్టిన చీర విప్పేస్తుంది. చీర ఎందుకు విప్పావు మాట మీద నిలబడవా అని తిడతాడు. దివ్య మాత్రం వినిపించుకోకుండా మొగుడిని గిల్లే పనిలో ఉంటుంది. ఒకే చీర చూసి చూసి బోర్ కొడుతుందని వేరే చీర కడతానని అంటుంది. కట్టడం రాకపోయేసరికి విక్రమ్ తనని పిలిచి తనే కడతానని అంటాడు.
రేపటి ఎపిసోడ్లో..
దివ్య తన మావయ్యని వీల్ చైర్ లో నుంచి లేపి నడిపించేందుకు ట్రై చేస్తుంది. అటు రాజ్యలక్ష్మి కూడా కుంటుకుంటూ నడుస్తుంది. సరిగ్గా అప్పుడే ప్రియ కావాలని రాజ్యాలక్ష్మికి కాస్త దగ్గరలో పూల కుండీ పడేలా చేస్తుంది. వెంటనే పూజారి వచ్చి రాజ్యలక్ష్మికి మంగళ దోషం మొదలైందని తన కొడుకు పరిహార దోషం చేయాలని చెప్తుంది. అంటే ఎవరు విక్రమ్ కదా అని బసవయ్య సంబరంగా అడుగుతాడు. కాదు ఆమె కొడుకు సంజయ్ అనేసరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి.