Extra Jabardasth Latest Promo: ప్రతి శుక్రవారం తెలుగు టీవీ ప్రేక్షకులను అలరించే కామెడీ షో ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’. వారం వారం సరికొత్త స్కిట్లతో నవ్వుల్లో ముంచెత్తుతుంది. మార్చి 22న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అదిరిపోయే పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


ఆకట్టుకున్న ఇమ్మాన్యుయేల్ పంచులు  


ఎప్పటిలాగే యాంకర్ రష్మి అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇస్తుంది. కృష్ణభగవాన్, కుష్బూ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఇమ్మాన్యుయేల్ పంచులతో ప్రోమో షురూ అవుతుంది. “రాత్రి నేను నిద్రపోయాక లేచి చూశా.. పక్కలో నువ్వు లేవేంటి?” అంటాడు ఇమ్మాన్యుయేల్. వాష్ రూమ్ కు వెళ్లానంటోంది వర్ష. “నీ మీద డౌట్ వచ్చే చేతికి స్మార్ట్ వాచ్ పెట్టాను. అందులో 15 స్టెప్స్ ఉన్నాయి. బాత్ రూమ్ కి వెళ్లడానికి 5, తిరిగి బెడ్ రూమ్ లోకి రావడానికి 5.. మిగతా 5 అడుగులే ఏడికెల్లాయే?” అంటూ నిలదీస్తాడు. “బాత్రూమ్ గ్యాప్ లో నేనేం చస్తానండీ” అంటుంది వర్ష. “చిన్న గ్యాప్ చాలే నువ్వు ప్రపంచ యాత్రికుడికన్నా ఎక్కువ తిరిగేసి వస్తావ్” అని ఇమ్మూ చెప్పడంతో షో అంతా నవ్వుల పువ్వులు పూస్తాయి. “ఒక ఆడపిల్లతో ఇలా మాట్లాడొచ్చా?” అంటూ యాంకర్ రష్మి అడగడంతో.. “ఎక్కువ చేస్తే నీ వాచ్ లో అడుగులు లెక్కపెట్టాల్సి వస్తుంది” అంటాడు ఇమ్మూ. దీంతో జడ్జీలు పడీ పడీ నవ్వుతారు.


లేడీ గెటప్ లో రాకేష్- పక్కింటోకి దూరిన రాం ప్రసాద్


ఇక రాకింగ్ రాకేష్ లేడీ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. బార్ లోకి ఎందుకు వెళ్లావ్ అంటే? “గాజుల సౌండ్ అని వెళ్తే అక్కడ గ్లాసు సౌండ్ వినిపించింది. వెళ్తే వెళ్లాం కదా అని కానిచ్చేశా” అనడంతో ఫుల్ ఫన్ జెనరేట్ అవుతుంది. బుల్లెట్ భాస్కర్ ప్రెసిడెంట్ గా ఆకట్టుకున్నాడు. వీధిలో బల్బ్ రావట్లేదని ఫైమా వచ్చి కంప్లైంట్ చేస్తుంది. “వెంటనే బల్బ్ మార్చాలంటుంది. వెంట వెంటనే మార్చడానికి వాడు బాయ్ ఫ్రెండ్ కాదే, బల్బ్.. కూసింత టైమ్ పడుతుంది” అనడంతో అందరూ నవ్వుతారు.


ఇక ఆటో రాం ప్రసాద్ వేసిన సురేష్, రమేష్ డ్యుయెల్ రోల్ ఆడియెన్స్ ను బాగా నవ్వించింది.  రమేష్ ప్లేస్ లోకి సురేష్ వెళ్లడంతో అతడి భార్య రోహిణి భోజనం తినిపిస్తూ.. ఔను సుజాతను కలిశారా? అని అడుగుతుంది. సుజాత ఎవరో తెలియక ఆ కలిశా అని చెప్తాడు. “నువ్ ఇంటికి రానప్పుడే అనుకున్నార్రా.. ఇంట్లో అందమైన పెళ్లాన్ని పెట్టుకుని, రోజూ ఆ సుజాత దగ్గర ఏడుస్తావేంట్రా?” అని కొడుతుంది. అప్పుడు సుజాత అనే అమ్మాయితో అతడికి ఎఫైర్ ఉందని అర్థం అవుతుంది. “అవును.. లక్ష్మీ దగ్గరికి వెళ్లారా?“ అని రోహిణి అడుగుతుంది.. ఆమెతో కూడా రమేష్ కు ఎఫైర్ ఉందని భావించి.. “ఛీ.. ఛీ.. లక్ష్మీ దగ్గరికి వెళ్లనే వెళ్లలేదు” అంటాడు. “నా చెల్లెలు లక్ష్మీ సర్జరీ కోసం హాస్పిటల్ లో ఉంటే దాని దగ్గరికి వెళ్లకుండా సుజాతతో తిరుగుతున్నావా?” అంటూ మరోసారి చితకబాదుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ఫుల్ ఎపిసోడ్ టెలీకాస్ట్ కానుంది.



Read Also: రేవ్ పార్టీలకు పాము విషం సరఫరా చేస్తున్న ‘బిగ్ బాస్’ విన్నర్ - ఇంతకీ ఆ విషాన్ని ఏం చేస్తారు?