ETV Sankranthi Event 2025 : కొన్ని ఆన్ స్క్రీన్ జంటలను ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తారంటే, వాళ్లు రియల్ లైఫ్ లో కూడా కపుల్ అయిపోవాలని కోరుకుంటారు. బిగ్ స్క్రీన్ పై అనుష్క - ప్రభాస్ జంట ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే స్మాల్ స్క్రీన్ పై తెలుగు ప్రేక్షకులు అమితంగా అభిమానించే జంటలలో సుడిగాలి సుధీర్ - రష్మీ గౌతమ్ ల జోడి కూడా ఒకటి. చాలాకాలంగా ఈ జంటను ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తున్నారు. ఇద్దరి మధ్య ప్రేమా, గిమా లేదు. మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఎన్నిసార్లు చెప్పినా, వీరిద్దరినీ జంటగా చూడడానికే ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తారు. తాజాగా మరోసారి ఈ జంట బుల్లితెరపై సందడి చేయబోతోంది.
కొన్నాళ్ళ నుంచి షోలకు దూరం
ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న హిట్ పెయిర్ లో వీళ్ళిద్దరూ మొదటి స్థానంలో ఉంటారు. జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ బయటకు వెళ్ళిన తర్వాత, ఇద్దరి కాంబోలో షోలు రాకపోవడంతో ప్రేక్షకులు వీళ్ళ రొమాన్స్ ను చాలా మిస్ అవుతున్నారు. ఈ సూపర్ హిట్ జోడి ఇటీవల కాలంలో కలిసి షోలు చేయడం లేదు. అయినప్పటికీ ఈ జంటకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే తాజాగా ప్రేక్షకులకు ఉన్న ఆ లోటు ఈ సంక్రాంతికి తీరబోతోంది. తాజాగా 'ఈ సంక్రాంతికి వస్తున్నాం' అని బుల్లితెర షోకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. అందులో రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ ని గతంలో లాగే చూపించి ఆసక్తిని పెంచేశారు. ఈ షోలో ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నప్పటికీ సుధీర్ రష్మీ హైలెట్ అవుతున్నారు.
'ఈ సంక్రాంతికి వస్తున్నాం'తో రీఎంట్రీ
సంక్రాంతి కోడిపందాలు, ఆటలు పాటలతో 'ఈ సంక్రాంతికి వస్తున్నాం' టీజర్ అదిరిపోయింది. అయితే టీజర్ చివర్లో "ఎ నెవర్ ఎండింగ్" లవ్ స్టోరీ అంటూ మళ్ళీ సుధీర్, రష్మీల ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ ని తెరపైకి తీసుకువచ్చారు. వీరిద్దరూ కలిసి 'బుజ్జి తల్లి' పాటకి డాన్స్ చేయడం అదిరిపోయింది. కాగా 'ఈ సంక్రాంతికి వస్తున్నాం' అనే ఈ బుల్లితెర షో సంక్రాంతి పండుగ రోజు ఉదయం 10 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది.
ఇక కొన్ని రోజుల క్రితమే ఈ జంట 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షో కారణంగా వార్తల్లో నిలిచింది. ఆ షోలో భాగంగా ఓ టాస్క్ ఇచ్చి, ఉన్నఫలంగా ఫోన్ చేసి ఎవరికైనా అర్జెంట్ గా రూ.10,000 పంపమని అడగాల్సి ఉంటుంది. అందులో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ సుడిగాలి సుధీర్ కి ఫోన్ చేసి ఆ రూ. 10,000 అడగమని చెప్పాడు. అతను చెప్పినట్లుగానే రష్మీ ఫోన్ చేయగా, సుధీర్ చాలా స్నేహంగా "రష్మీ బేబ్ చెప్పరా" అంటూ మాట్లాడాడు. అంతేకాకుండా ఆమె ఫోన్ కట్ చేసే లోపే అమౌంట్ ను పంపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఎప్పటిలాగే బుల్లితెరపై వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ మరోసారి సంక్రాంతికి స్పెషల్ ఫీస్ట్ కాబోతోంది ప్రేక్షకులకు.
Read Also : Game Changer: 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?