కూతురు కడుపుతో ఉందని సులోచన సున్నిఉండలు చేసి తీసుకొచ్చి తినిపిస్తుంది. అప్పుడే ఖుషి వచ్చి స్కూల్ బస్ మిస్ అయ్యిందని డుమ్మా కొట్టేస్తానని చెప్తుంది. దీంతో వేద డుమ్మా లేదు తనే డ్రాప్ చేస్తానని చెప్పి కారులో ఎక్కించుకుని తీసుకెళ్తుంది. కారు వెళ్ళగానే వెనుక ఖైలాష్ ఉంటాడు. మీరు వెళ్ళండి రావాలని అనుకున్నా రాలేరని అంటాడు. అప్పుడే అభిమన్యు ఫోన్ చేసి ఏమైందని అడుగుతాడు. అంతా అయిపోయిందని ఒకేసారి ముగ్గురు కాటికి పోతున్నారు. కారు బ్రేక్ బోల్టులు, హ్యాండ్ బ్రేక్ కనెక్షన్ తీసేసినట్టు చెప్తాడు. దీంతో అభి మంచిపని చేశావని అంటాడు. ముగ్గురు కారులో వెళ్తూ పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అభిమన్యు టెన్షన్ గా ఉంటే నీలాంబరి వచ్చి మందు తాగుతారా? అని ప్రేమగా అడుగుతుంది. తనే దగ్గరుండి కలిపి మరీ ఇస్తుంది. ఇవాళ మీకు స్పెషల్ ఫుడ్ ఆరెంజ్ చేశానని చెప్తుంది. ఇక నీలాంబరి సిగ్గుపడుతూ మొగుడ్ని తెగ ఊరిస్తుంది. ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసిందని తెగ మురిసిపోతాడు.
Also Read: లాస్యకి అదిరే ఝలక్ ఇచ్చిన లక్కీ- నందు ఆవేదన, తులసి ఆక్రోశం
కారు బ్రేకస్ పని చేయడం లేదని వేదకి అర్థం అవుతుంది. కాసేపు కారు స్పీడ్ గా అటూ ఇటూ తిప్పుతూ పిల్లలని కాపాడాలని అనుకుంటుంది. వెంటనే యష్ కి ఫోన్ చేసి కారు బ్రేక్ పని చేయడం లేదని కంగారుపడుతూ విషయం చెప్తుంది. తను వెంటనే బయల్దేరుతున్నానని టెన్షన్ పడొద్దని ధైర్యం చెప్తాడు. అభిమన్యు మందు తాగుతుంటే నీలాంబరి ఫుడ్ తినిపిస్తుంది. తాగిన మత్తులో బంగారం అని పిలుస్తాడు. తనని ఆ పేరుతో కాదు అంబరం అని పిలవమని చెప్తుంది. బాగా తాగించి కడుపు నిండా తినిపిస్తుంది. కాసేపటికి అభిమన్యు మత్తులోకి జారుకుంటాడు. అటు వేద కారు స్పీడ్ కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తుంది. పిల్లలని కాపాడాలని వాళ్ళని రోడ్డు పక్కన గడ్డిలోకి తోసేస్తుంది. ఆ తర్వాత వేద కిందకి దూకడంతో పొట్టకి దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోతుంది. పిల్లలు కంగారుగా వచ్చి వేదని లేపడానికి చూస్తారు కానీ కళ్ళు తెరవలేకపోతుంది. ఖుషి కూడా కళ్ళు తిరిగిపడిపోతుంది.
వేదని హాస్పిటల్ కి తీసుకొస్తారు. కాసేపటికి స్పృహలోకి వస్తుంది. యష్ చాలా డల్ గా కనిపిస్తాడు. వేద జరిగిన యాక్సిడెంట్ గుర్తు చేసుకుని పిల్లలకు ఎలా ఉందని డాక్టర్ ని అడుగుతుంది.
Also Read: కృష్ణకి సర్‌ప్రైజ్, ముకుందకి షాక్ - రేవతినా మజాకా!
డాక్టర్: మీకు జరిగిన ప్రమాదం, దెబ్బలు చూస్తుంటే మీకు ఆ అవకాశం లేదని అనిపిస్తుంది అనగానే వేద పొట్ట మీద చెయ్యి వేసుకుని ఎమోషనల్ అవుతుంది. అటు యష్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఈ విషయం మీ ఫ్యామిలీకి కూడ చెప్పాము.
తరువాయి భాగంలో..
డాక్టర్ పిల్లల పుట్టే అవకాశం లేదని హింట్ ఇస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే వేదకి ఘనంగా సీమంతం చేస్తారు.