యష్ కి శిక్ష అనౌన్స్ చేసే టైమ్ కి వేద మాళవికని తీసుకుని కోర్టుకి వస్తుంది. జరిగింది ఏంటో తను చెప్తానని మాళవిక అంటుంది. ఆరోజు రాత్రి ఏం జరిగిందో చూపిస్తారు. మాళవిక యష్ కి ఫోన్ చేసినప్పుడు అభిమన్యు తనని గమనిస్తూనే ఉంటాడు. యష్ రావడం మాళవిక తల పగలగొట్టుకోవడం అంతా చూస్తాడు. తలకి దెబ్బ వల్ల కళ్ళు తిరిగి పడిపోబోతుంటే అభిమన్యు పట్టుకుంటాడు. తనని దగ్గరకి తీసుకుంటుంటే చీదరించుకుంటుంది.


మాళవిక: నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావ్. నన్ను ఇంటి నుంచి గెంటేసి కుక్క కంటే హీనంగా నన్ను చూసి ఎందుకు వచ్చావ్


అభి: వెళ్తాను.. యష్ నీకు గన్ పెట్టాడు అంట కదా. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నిన్ను వెతుకుతున్నా. చివరికి ఇక్కడ కనిపించావు. నన్ను నమ్ము.. ఈక్వేషన్ సెట్ అవక మనం విడిపోయాం కానీ లేకపోతే మన మధ్య బంధం ఎలా ఉండేది అని చెప్పి తలకి అయిన రక్తం తుడిచి గాయానికి కట్టు కడతాడు. ఎక్కడికైనా వెళ్దామా ఇక్కడే ఉందామా?


Also Read: దుగ్గిరాల కుటుంబాన్ని నిలదీసిన కనకం- కావ్యని ఇంట్లోకి రానిచ్చేదే లేదని ఖరాఖండీగా చెప్పిన రాజ్


మాళవిక: రెండు మాటలు చెప్పి తలకి కట్టు కడితే నీ మాటలు నమ్మాలా?


అభి: బంగారం పనికిరాని గతం కావాలా? ఫ్యూచర్ కావాలా? నేను యష్ లాగా ఆవేశపరుడిని కాదు.. భార్యకి దాసుడిని అంతకన్నా కాదు. గతం వదిలేసి ఇప్పుడు నువ్వు సాధించాల్సింది ఎంతో ఉంది. నువ్వు ఇంట్లో నుంచి గెంటేసిన కుటుంబాన్ని ఊరికే వదిలేస్తావా? నీ భర్తని, నీ పిల్లల్ని దూరం చేసిన వేదని వదిలేస్తావా? నీ కాళ్ళ దగ్గర దాసిగా పడి ఉంటానని బతిమలాడినా కానీ వినకుండా వదిలేసి వెళ్ళిన యష్ ని ఊరుకుంటావా? నీలో పగ ప్రతీకారం, కసి అలాంటివి ఏమి లేవా? నీకు నేనున్నాను.. నీకు నేను అన్నీ ఇస్తాను. అప్పుడు ఎప్పుడూ నీకు నాకు ఉమ్మడి శత్రువులు ఎవరో గుర్తు చేయాలా? అనేసరికి మాళవిక సరేనని అంటుంది. నువ్వు చచ్చిపోవాలి


మాళవిక: వాట్


అభి: కంగారుపడకు నిన్ను ఎందుకు చంపుకుంటాను. మాళవిక మర్డర్.. ఆవేశంలో చంపేసి బాడీని పెట్రోల్ పోసి తగాలబెట్టిన యష్.. డీల్ ఒకేనా


మాళవిక: ఒకే


అభి: కొన్ని రోజులు మన సేఫ్టీ కోసం అండర్ గ్రౌండ్ లో ఉండాలి


సీన్ కోర్టులో చూపిస్తారు.


మాళవిక: అభిమన్యుని నమ్మి యశోధర్ పై పగ తీర్చుకోవాలని అనుకున్న నేను వేదపై కూడా నేరుగా రెండు సార్లు హత్యా ప్రయత్నం చేశాను. నేను బతికి ఉంటే తనకి ప్రమాదమని అభిమన్యు చంపాలని చూశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న నన్ను నేను శత్రువు అనుకుంటున్న వేద నన్ను కాపాడింది. కోర్టు వారు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను.


జడ్జి: నిర్దోషిని కాపాడి అసలు నేరస్థుడుని బయట పెట్టినందుకు కోర్టు వేదని అభినందిస్తుంది. కరుడు గట్టిన నేరస్థులకు మించి దారుణంగా ప్రవర్తించిన అభిమన్యుని వెంటనే అరెస్ట్ చేయాలి. చట్టాన్ని వక్రీకరించినందుకు మాళవికని పోలీసులు తమ అధీనంలోకి తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నా


Also Read: షాకింగ్ నిర్ణయం తీసుకున్న భవానీ- ముకుందకి నిజం చెప్పిన మురారీ, రేవతి భయమే నిజమవుతుందా?


యష్ ని విడుదల చేస్తారు. వేదని దగ్గరకి తీసుకుని మురిసిపోతాడు. ఏసీపీ దుర్గ కూడా వేదని మెచ్చుకుంటుంది. అభిమన్యుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ ఇది ఇంతటితో ఆగిపోదని బెదిరిస్తాడు. తను వెళ్ళి తిరిగి వస్తానని అంటాడు. కానీ వేద వాళ్ళు మాత్రం ఏ మాత్రం బెదరకుండా మాట్లాడతారు. యష్ ఇంటికి రాగానే ఖుషి సంతోషంగా ఎదురువచ్చి కౌగలించుకుంటుంది. ఆదిత్య వెల్కం బోర్డు పట్టుకుని యష్, వేదకి స్వాగతం చెప్తాడు. కొడుకు, కూతురిని చూసి యష్ మురిసిపోతాడు. వేద పిల్లలిద్దరినీ దగ్గరకి తీసుకుంటుంది. ఖుషి హారతి ఇచ్చి అమ్మానాన్నకి ఆహ్వానం పలుకుతుంది.


తరువాయి భాగంలో..


వేద తనకి పుల్లటి మామిడి కాయలు తినాలని ఉందని చెప్తే యష్ తనకి కూడా తినాలని అనిపిస్తుందని చెప్తుంది. గుడిలో కళ్ళు తిరిగి పడిపోయానని చెప్తుంది. టెన్షన్ తో కళ్ళు తిరిగి పడిపోయావ్ ఏమో అంటాడు. ఓరి నా మొగుడా నేను అమ్మని కాబోతున్నా అని చెప్పేసరికి యష్ చాలా సంతోషపడతాడు.