Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపుర గిరిలను పెళ్లి ఊరేగింపుగా తీసుకొని మండపానికి వెళ్తారు. బాల గిరిని చూసి దొంగ అని బాల సంగతి చెప్తా అనుకుంటాడు. ఇక గాయత్రీని కారు డిక్కీలో కట్టేసి గిరి పెట్టేస్తాడు. పెళ్లి కూతురు కొడుకుకి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తారు. నా కోడలు నా బంగారం అని రత్నమాల పొగిడేస్తుంది. త్రిపుర గాయత్రీ కోసం అడిగితే వెనకాల వస్తుందని రమాదేవి చెప్తుంది. 

పెళ్లి హడావుడి జరుగుతుంది. రత్నమాల అందరినీ పేరు పేరునా పలకరిస్తుంది. త్రిపుర కన్నీరు పెట్టుకుంటుంది. త్రిపురతో గౌరీ పూజ చేయిస్తారు. త్రిపుర గాయత్రీ కోసం మళ్లీ అడుగుతుంది. వస్తుందిలే అని వదిన అంటుంది. రమాదేవి కోడలితో గాయత్రీకి పెళ్లి ఇష్టం లేదు కదా అందుకే రాలేదని అంటుంది. త్రిపుర తన తల్లి గురించి అత్తని అడిగితే గుర్తుంది నా కొడుకు తాళి కట్టగానే మీ అమ్మ వచ్చేస్తుందని అంటుంది. ప్రసాద్, తాతయ్య అందరూ త్రిపుర కోసం బాధ పడతారు. పెద్దమ్మ కోసం త్రిపుర ఇంత ఇబ్బంది పడుతుందని ఈ విషయం గాయత్రీకి తెలుసు అని కానీ సరైన టైంకి ఎక్కడికి వెళ్లిందని అంటాడు. నేనే పెళ్లి ఆపుతానని ప్రసాద్ అంటే రమాదేవి వచ్చి ఆపుతుంది. త్రిపుర, గిరిలు దండలు మార్చుకుంటారు. ఇక టైం అవడంతో రత్నమాల పంతులుతో చెప్పి తాళి కట్టించమని అంటుంది. గిరి తాళి కట్టడానికి సిద్ధమవుతాడు. గిరి సరిగ్గా తాళి కట్టే టైంకి బాలా దొంగ అనుకొని మండపానికి వస్తాడు. గిరి బాలని చూసి షాక్ అయి తాళి కట్టకుండా ఆగుతాడు. బ్యాడ్ బాయ్ సుందరిని ఎందుకు ఏడిపిస్తున్నావ్ అని అంటాడు. బ్యాడ్ బాయ్ అని పిలుస్తాడు. 

బాల వెనక పోలీసులు వస్తారు. అందరూ షాక్ అయిపోతారు. బాల పోలీసులతో వాడే బ్యాంక్‌లో దొంగతనం చేశాడు వాడిని అరెస్ట్ చేయండి అని అంటాడు. పెళ్లి అవ్వాలి అని రత్నమాల అంటే ముందు అరెస్ట్ చేయాలి అని అంటాడు. తాళి పక్కన పెట్టి రమ్మని గిరి అంటాడు. సాక్ష్యం ఏంటి అని ఆ మతి లేని వాడు చెప్తే ఏంటి అడిగి పోలీసుల్ని బెదిరించి వెళ్లిపోమని అంటారు. దాంతో చిన్నపిల్లడి మనస్తత్వం ఉన్న వాళ్లు కేసు పెడితే పెళ్లి ఆపామని తెలిస్తే మా ఉద్యోగాలు పోతాయని పోలీసులు అంటారు. గిరి మళ్లీ త్రిపురని కూర్చొపెట్టి తాళి కట్టబోతాడు. వద్దు సుందరి అని బాల అంటాడు. ఇంతలో గాయత్రీ వచ్చి గిరి చేతిలో తాళి తీసుకుంటుంది. అందరూ గాయత్రీని తిడగారు. గాయత్రీని పక్కకు లాగిమని అంటారు.

రమాదేవి గాయత్రీ మీద అరిస్తే పిన్ని ఇంకొక్క మాట మాట్లాడితే ఊరుకోను అని అంటుంది. ఇక పోలీస్‌తో బంగారం దొంగతనం చేసింది వీళ్లే. నాకు నిజం తెలిసిందని నన్ను కట్టి పడేశారని అని చెప్పి పోలీసులకు అరెస్ట్ చేయమని అంటుంది. పోలీసులు గిరిని లొంగిపోమని అంటే త్రిపుర ఆపి బావ చేతికి తాళి ఇచ్చి కట్టమని అంటుంది. గాయత్రీ ఎంత చెప్పినా వినదు.

గిరికి తాళి కట్టమని హడావుడి చేస్తుంది. గిరి మళ్లీ తాళి కడుతుంటే గాయత్రీ తాళి విసిరేస్తుంది. బాల బ్యాడ్ బాయ్ అంటే గిరి కొట్టడానికి వెళ్తాడు. మళ్లీ గిరి తాళి కట్టబోతే గాయత్రీ ఆపి అమ్మ గల్ఫ్‌లో ఇరుక్కుపోయింది అనే కదా ఈ పెళ్లికి ఒప్పుకున్నావ్ మనందరం కష్టపడి అమ్మని విడిపిద్దామని అంటుంది. గిరి తాళి కట్టడానికి రెడీ అయితే అందరూ ఆపుతారు. ఇంతలో పెద్దాయన తాళి లాక్కొని రత్నమాలని కొడతాడు. పోలీసులు గిరిని తీసుకెళ్తారు. మీ అందరి సంగతి చూస్తూ అని రత్నమాల ఛాలెంజ్ చేస్తుంది. త్రిపుర ఏడిస్తే గాయత్రీ ఓదార్చుతుంది. అమాయకంగా అక్కడ చూస్తున్న బాల దగ్గరకు గాయత్రీ వెళ్లి థ్యాంక్స్ చెప్తుంది. బాల వెళ్తాను అని అమాయకంగా తన సుందరికి బాయ్ చెప్తాడు. త్రిపుర తలూపుతుంది. 

మరోవైపు గాయత్రీ మోసం చేసిందని అనంత్ మందు తాగుతుంటాడు. అక్కడికి ఊర్వశి వెళ్లి గాయత్రీని ఇంకా దూరం చేస్తా నేను దగ్గరవుతా అనుకుంటుంది. గాయత్రీ గురించి మాట్లాడితే తన పేరు నా ముందు వద్దు తనని మర్చిపోవాలి అనుకుంటున్నా గుర్తు చేయొద్దు అని గాయత్రీ ఒక మోసగత్తె అని మాట్లాడుతాడు. ఊర్వశి నవ్వుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్‌ టెన్షన్!