Ennallo Vechina Hrudayam Serial Today Episode బాలని కాపాడినందుకు యశోద ఏడుస్తూ త్రిపురకు కృతజ్ఞతలు చెప్తుంది. ఇక త్రిపుర ఈ రోజు నుంచి బాలకి ఏం కావాలి అన్నా నేనే చూసుకుంటా అని అంటుంది. బామ్మ సరే అంటుంది. కానీ వాసుకి వాళ్లు మాత్రం నువ్వు వచ్చి రెండు రోజులు కాలేదు అప్పుడే ఆధిపత్యం చేస్తున్నావ్ అని అంటారు. బాల మంచి కోసమే ఇదంతా చేస్తున్నా అని త్రిపుర అంటుంది.
ఇంట్లోనే బాలని చంపాలని ఎవరో ప్రయత్నిస్తున్నారని ఇంట్లో పని వాళ్లందరినీ మార్చేయమని యశోద చెప్తుంది. త్రిపుర వాసుకి వాళ్లని ఉద్దేశించి పాపం చేసేవాళ్లు కచ్చితంగా దొరుకుతారు వాళ్ల పాపం పండుతుందని అంటుంది. ఇక ఊర్వశి తల్లితో ఇప్పటి వరకు బాగానే సెట్ చేశాం.. గుడిలో అనంత్ గాయత్రీకి ప్రపోజ్ చేస్తే నాకు చేసినట్లు త్రిపుర ముందు బిల్డప్ ఇచ్చాం అది నమ్మి త్రిపుర పెళ్లి ఫిక్స్ చేసింది కానీ ఇప్పుడు నిజం బయట పడితే ఎలా అని అడుగుతుంది. దానికి రమాదేవి ఏం పర్లేదని రేపు వాళ్ల ఇంటికి వెళ్లి నీతో పెళ్లి జరగాలని మాట దాటకుండా చేసేద్దాం అని అంటుంది. ఏం చేస్తావో చెప్పు అని ఊర్వశి అడిగితే తన ఐడియా చెప్తుంది. కూతురు తల్లిని పొగిడేస్తుంది.
త్రిపుర బాల కోసం వంట చేస్తుంటే బాల సుందరి సుందరి అని త్రిపుర దగ్గరకు వెళ్తాడు. బాల తన చైన్‌లో ఉన్న రింగ్ త్రిపురకు చూపించి నీ గుర్తుగా ఈ రింగ్ దాచుకున్నా నువ్వు లేనప్పుడు కూడా నాతోనే ఉన్నట్లు ఉంటుందని అంటాడు. ఏం చేస్తున్నావ్ అని బాల అడిగితే నీ కోసం ఆలూ కూర చేస్తున్నా అని ఉప్పు చూడమని అంటుంది. బాల ఉప్పు డబ్బా తీసుకొని ఉప్పుగా ఉందని అంటాడు. త్రిపుర నవ్వుకుంటుంది. ఇక ఇంటికి రామాదేవి, ఊర్వశి వస్తారు. ఊర్వశి అందరి కాళ్ల మీద పడిపోతుంది. యశోద వాళ్లకి అత్తయ్యామామయ్య అని పిలవమని రమాదేవి అంటుంది. ఇలా వచ్చావ్ ఏంటి పిన్ని అని త్రిపుర అడిగితే పెద్ద వాళ్లు మేం మాట్లాడలేదు కదా అని రమాదేవి అంటుంది. దానికి బామ్మ ఇద్దరూ ప్రేమించుకుంటే మధ్యలో మాకు ఏముంటుందని అంటుంది. అందరూ మీ అమ్మాయిని బాగా చూసుకుంటాం అనంత్ ఇంకా బాగా చూసుకుంటాడని అంటారు. మా కంగారు అది కాదని రమాదేవి అంటుంది. త్రిపుర మాట్లాడొద్దని చెప్పినా రమాదేవి వాళ్లతో మావి చిన్న బతుకులు చిన్న జీవితాలు మీ లాంటి ధనవంతులతో మేం తూగలేం. మా ఇంట్లో మామయ్య గారికి కొంచెం నమ్మకాలు అనుమానాలు ఎక్కువ అని.. మీ పెద్ద వాళ్లతో వియ్యం అందుకోవాలి అంటే ఎలాంటి పరిస్థితి ఎదుర్కొవాలో అని భయంగా ఉందని అంటుంది.
త్రిపుర అలా కాదు అంటే దానికి రమాదేవి మీ తాతయ్య నాతో మాట్లాడారు ప్రేమలు పెళ్లి ఎందుకు అని మీ అత్తయ్యలానే అవుతుందేమో అని భయపడుతున్నారని అంటుంది. త్రిపుర తాతయ్య గారు తమ ఆచారం ప్రకారం అమ్మవారి గుడికి వెళ్లి తాళి, మెట్టెలు ఇచ్చి హారతి మీద ప్రమాణం వేసి పెళ్లి జరుగుతుందని చెప్పమంటుంది. త్రిపుర ఇది తప్పు అని పిన్నికి చెప్తుంది. దాంతో బామ్మ యశోదని హారతి తీసుకురమ్మని చెప్తుంది. రమాదేవి చేతికి హారతి ఇచ్చి బామ్మ దాని మీద చేయి వేసి నా మనవడిని నీ కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్తుంది. బామ్మ మాటతో అనంత్, గాయత్రీలకు అన్యాయం జరిగినట్లు సాంగ్ ప్లే చేస్తారు. ఇక బామ్మ శ్రీరామనవమి వేడుకలకు రమాదేవిని కూతురిని తీసుకొని రమ్మని చెప్తుంది. పిన్ని చేసిన పనికి త్రిపుర చాలా ఫీలవుతుంది. వాసుకి భర్తని చాటుగా తీసుకెళ్లి రమాదేవి ప్రవర్తనలో ఏదో తేడా ఉందని అంటుంది. దాంతో నాగభూషణం ఆ అనంత్ గాడు మనకు అడ్డు రాడని మాట్లాడుకుంటారు. రామనవమితో బాలకి విషం ఇచ్చి త్రిపురని ఇరికించేయాలని ఫణి ప్లాన్ చేస్తాడు. ఇక త్రిపుర ఇంట్లో ఎవరూ లేనప్పుడు వాళ్ల ఇంటికి వెళ్లి పెన్ వెతుకుతానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: సీఈఓ స్థానం కావాలన్న ఫణి.. బాల ఆస్తులకు సర్వ హక్కులు త్రిపురవే!