Ennallo Vechina Hrudayam Serial Today February 3rd: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాల మీద విష ప్రయోగం.. త్రిపురకు డౌట్.. అనంత్, గాయత్రీల ప్రేమ మొదలేనా?
Ennallo Vechina Hrudayam Today Episode జాతరలో బాల పిన్నిబాబాయ్‌లు రౌడీలను బాల మీదకు పంపడం రౌడీలు త్రిపురకు గాయం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ennallo Vechina Hrudayam Serial Today Episode తిరునాళ్లకు అనంత్, గాయత్రీ కూడా వస్తారు. అనంత్ పోతు రాజుల డ్యాన్స్‌కి తాను కూడా గెంతు లేస్తాడు. తర్వాత ఆర్చరీ గేమ్ చూసి వెళ్లి ఆడుతానని అని గురి చూసి బాణంతో కొడతాడు. గాయత్రీ అనంత్‌కి అంత సీన్ లేదు అన్నట్లు ఫేస్ పెట్టి తర్వాత అనంత్ రెండు సార్లు టార్గెట్ రీచ్ అవ్వడంతో గాయత్రీ షాక్ అవుతుంది. అనంత్ తర్వాత గాయత్రీకి బాణం ఇచ్చి గురి చూసి కొట్టమని అంటే గాయత్రీ బాణం విసిరితే అది ఎటో వెళ్లి పడుతుంది. అనంత్ సెటైర్లు వేస్తాడు. తర్వాత తానే నేర్పిస్తాను అని గాయత్రీతో బాణం వేయిస్తాడు.
గాయత్రీ అనంత్ సాయంతో కరెక్ట్‌గా టార్గెట్ రీచ్ అవుతుంది. తర్వాత ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకొని మైమరిచిపోతారు. ఇద్దరూ కలిసి గుడిలోకి బయల్దేరుతారు. ఇక బాల చిన్న పిల్లలతో కలిసి బుడగలతో ఆడుకుంటూ ఉంటాడు. త్రిపుర బాల అడ్రస్ కోసం ఎన్ని అడిగినా బాల పట్టించుకోకుండా చిన్న పిల్లాడిలా ఆడుకుంటాడు. ఇక త్రిపుర బావ గిరి కూడా అక్కడే ఉంటాడు. గిరి ఫ్రెండ్స్ గిరిని వదినతో రావాల్సింది త్వరగా పెళ్లి చేసుకో అని అంటారు. ఇక గుడిలో గంట సౌండ్ రావడంతో బాల ప్రసాదం పంచుతారని పిల్లల్ని తీసుకొని వెళ్తారు. బాల పిన్ని, బాబాయ్‌లు తిరునాళ్లకి చేరుకొని ఇక్కడైతే బాల ఒంటరిగా దొరుకుతాడని కచ్చితంగా చంపేయాలి అని అనుకుంటారు.
మరోవైపు బామ్మ బాల గురించి టెన్షన్ పడుతూ ఎవరికి కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయరు. ఇంతలో అప్పుడే కొడుకు కోడలు వస్తే బాల ఇంట్లో లేని విషయం చెప్తుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. బామ్మ కన్నయ్య కన్నయ్య అని ఏడుస్తుంది. త్రిపుర, బాల, పిల్లలు దేవుడిని దర్శించుకుంటారు. పిల్లలు గంట కొడతామంటే త్రిపుర ఎత్తుకొని గంట కొట్టిస్తుంది. అది చూసిన బాల మరో నాలుగురి పిల్లల్ని ఒకేసారి భుజం మీద ఎక్కించుకొని గంట కొట్టించడానికి తీసుకొస్తాడు. త్రిపుర చూసి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అప్పుడే బాల మెడలో త్రిపుర రింగ్ బయటకు వస్తుంది. కానీ త్రిపుర చూసుకోదు. బాల పిన్నిబాబాయ్‌లు రౌడీలను కలిసి వాళ్ల చేతిలో పులిగోళ్లు ఉన్న గ్లౌజ్‌లు ఇచ్చి వాటికి విషం ఉందని పులి వేషం వేసుకొని బాలని కేవలం పట్టుకుంటే చాలా విషం ఎక్కి చనిపోతాడని చెప్తారు. ఊర్వశి మేడ మీద మంచం వేసుకొని కొత్త ల్యాప్‌ట్యాప్‌లో పాటలు వింటుంది.
ఇంతలో తల్లి వచ్చి తినడానికి కిందకి పిలిస్తే ల్యాప్ టాప్ వదిలేసి వెళ్తుంది. మరోవైపు త్రిపుర, బాలలు ప్రసాదం తింటూ ఉంటారు. గాయత్రీ, అనంత్ అటుగా వెళ్తారు కానీ ఒకర్ని ఒకరు చూసుకోరు. ఇక పోతురాజుల డ్యాన్స్ వేస్తుంటే బాల అక్కడికి పరుగులు తీస్తాడు. త్రిపుర కూడా వెళ్తుంది. రౌడీలు కూడా పులి వేషం వేసుకొని వస్తారు. బాలని పులి గోళ్లతో గీకబోతే త్రిపుర చూసి బాలని తప్పించడంతో ఆ గాటు త్రిపుర మీద పడుతుంది. దాంతో బాల కంగారు పడి పక్కనున్న ఓకావిడ చీర చింపేసి త్రిపురకు కట్టు కడతాడు. బాల మంచితనానికి త్రిపుర ఫిదా అవుతుంది. ఇక త్రిపురకు అనుమానం వచ్చి మొత్తం వెతుకుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానించిన సంధ్య.. సంజయ్, బిగ్‌డాడీల కొత్త ఆట షురూ!