Ennallo Vechina Hrudayam Serial Today Episode బాలని పుట్టిన రోజు రోజే గిరి కిడ్నాప్ చేయిస్తాడు. బాలని గిరి రౌడీలు కారులో ఎక్కించి తీసుకెళ్లడం త్రిపుర చూస్తుంది. బాలని అడవిలోకి తీసుకెళ్లడంతో త్రిపుర బాల కోసం అడవిలో పరుగులు పెడుతుంది. రౌడీలు త్రిపుర చూడకుండా బాలని దాచేస్తారు. మరోవైపు బాల కేక్ కటింగ్ కోసం ఫణి కేక్ తీసుకొచ్చి పెడతాడు. అందరూ పార్టీ దగ్గరకు చేరుకుంటారు. బాల కనిపించకపోవడంతో అందరూ కంగారు పడతారు. తలా ఓ వైపు వెతుకుతారు. బాల ఎక్కడా కనిపించకపోవడంతో బయటకు వస్తారు. అక్కడ భర్త్‌డే కోసం ఏర్పాటు చేసిన హ్యాపీ భర్తడే అనే లెటర్స్‌లోని ఒక లెటర్ కనిపించడంతో అనంత్ చూసి అన్నయ్య అడవిలోకి వెళ్లిపోయింటాడని అంటాడు. అందరూ వెళ్దామంటే అనంత్ వద్దని తాను ఒక్కడే వెళ్తాడు.
ఇక త్రిపుర బాల కోసం వెతుకుతూ ఉంటుంది. నాగభూషణం, వాసుకిలు బాల చనిపోతే బాగున్నని మొక్కుకుంటారు. తమ చేతికి మట్టి అంటకుండా బాల చనిపోతే బటర్ అనుకుంటారు. బాలని ఓ రౌడీ కత్తితో పొడిచే టైంకి త్రిపుర వచ్చి వాళ్లని నెట్టేసి రాళ్లు విసిరేసి బాలని తీసుకొని పారిపోతుంది. మరోవైపు గాయత్రీ అక్క ఇంట్లో లేదని చాలా టెన్షన్ పడుతుంటుంది. ఎవరికో ఎమర్జెన్సీ అయి మూలికల కోసం అడవిలోకి వెళ్లుంటుందని అనుకొని త్రిపుర కోసం గాయత్రీ స్కూటీ తీసుకొని అడవికి వెళ్తుంది. టార్చ్ లైట్ వేసుకొని గాయత్రీ ఓ వైపు వెతుకుతుంటే అనంత్ బాల కోసం వెతుకుతుంటాడు. గాయత్రీ, అనంత్ ఒకరిని ఒకరు చూసుకుంటారు. అన్న అడవిలోకి వచ్చేశాడని అనంత్ చెప్తే తన అక్క మూలికల కోసం వచ్చిందని గాయత్రీ చెప్తుంది. అనంత్ అన్నయ్య కోసం కంగారు పడతాడు. ఏం టెన్షన్ పడొద్దని ఇద్దరం వెతుకుదామని అనుకుంటారు.
మరోవైపు గిరి బ్యాచ్‌లర్ పార్టీ ఇస్తాడు. అందరూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అందులో ఒకడు బాల గిరిని కొట్టిన వీడియో చూస్తూ ఎవడో అమాయకుడు నిన్ను కొట్టడం ఏంటి అన్న అంటాడు. దానికి గిరి పులి మీద అప్పుడప్పుడు జింక తిరగబడినా చివరకు జింకని చంపి పులి గెలుస్తుందని అంటాడు. రౌడీలకు కాల్ చేసి వాడిని చంపేశారా అని రౌడీలకు కాల్ చేస్తే చంపే టైంకి వదిన వచ్చి కాపాడిందని చెప్తారు. దాంతో గిరి షాక్ అయిపోతాడు. అక్కడున్న అందరూ గిరితో నీ మరదలు ఆ బుర్ర లేని వాడితో లేచిపోయిందా అని సెటైర్లు వేస్తారు. బాలని త్రిపుర తీసుకొని ఓ సేఫ్ ప్లేస్‌కి వెళ్తుంది. గిరి తన మనుషులతో కలిసి అడవికి వస్తాడు. ఆ ప్లేస్‌ని చూసి బాల భయపడతాడు. ఏం భయం లేదని త్రిపుర ధైర్యం చెప్తుంది.
త్రిపుర ఇప్పుడే వస్తాను అని వెళ్తే బాల వద్దు వద్దు అని అంటారు. అయినా త్రిపుర వెళ్లి కొన్ని చెట్లను కదిపిస్తుంది. దాంతో చాలా మినుగురు పురుగులు బాల చుట్టూ చేరుతాయి. బాలా చాలా సంతోషిస్తాడు. ఇంతలో ఓ సీతాకోక చిలుక రావడంతో త్రిపుర చూసి ఈయనకు సీతా కోక చిలుక అంటే పడదు కదా అనుకొని దాన్ని తరిమేస్తుంది. ఇక బాల దాగుడు మూతలు ఆడుదామని అంటాడు. త్రిపుర సరే అంటుంది. గిరి మినుగురుల్ని చూసి అక్కడే మనుషులు ఉంటారని అనుకుని అటు వెళ్తారు. ఈ సంవత్సరం పుట్టిన రోజుకి కేక్ కట్ చేయలేదని బాల చాలా ఫీలవుతాడు. ఇక త్రిపుర కట్టెలు పేర్చుతుంది. బాల రాళ్లని రాపిడి చేసి అగ్గి వెలిగిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!