Ennallo Vechina Hrudayam Serial Today Episode బాల కోలుకోవడంతో రిజిస్ట్రేషన్ గురించి విన్న త్రిపుర బాలని తీసుకొని వెళ్లి ప్రకృతి వైద్యశాలలోని అడ్మిషన్‌ దగ్గరకు వెళ్లి బాల ఫైల్స్ అడిగి అందులో ఉన్నట్లు సంతకం పెట్టమని అంటుంది. బాల సరిగా పెట్టలేకపోతే అందులో ఉన్నట్లు త్రిపుర బాల చేయి పట్టుకొని నేర్పిస్తుంది. త్రిపుర తన చేయి పట్టుకోగానే బాల చాలా సంతోషంగా ఫీలవుతాడు. మొత్తానికి ఒక పది సంతకాల తర్వాత బాల తన ఫ్రూప్స్‌లో ఉన్నట్లు సంతకం పెడతాడు. 

మరోవైపు వాసుకి, నాగభూషణం, ఫణిలతో బాల తండ్రి బాలకు బాగానే ఉందని అంటాడు. అనంత్ రాగానే నాగభూషణం బాలకి ఏం ప్రమాదం లేదని చెప్తాడు. ఇక గాయత్రీ రాగానే అనంత్ గాయత్రీకి విషయం చెప్తాడు. గాయత్రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలైందని చెప్పి ఫణి వాళ్లని తీసుకెళ్తుంది. మరోవైపు త్రిపుర బాలతో సంతకం ప్రాక్టీస్ చేయించి బాలని రిజిస్టర్ ఆఫీస్‌ దగ్గర దింపేసి లోపల మీ వాళ్లు ఉన్నారు వెళ్లు అంటుంది. సాయంత్రం భర్త్‌డే పార్టీకి రమ్మని చెప్పి బాల లోపలికి వెళ్తాడు. రిజిస్ట్రేషన్‌ ఫైల్స్ మీద ఫణి సంతకం పెట్టే టైంకి అనంత్ అంటూ బాల ఎంట్రీ ఇస్తాడు. ఫణితో పాటు అతని తల్లిదండ్రులు షాక్ అయిపోతారు.  

ఇక తప్పని పరిస్థితిలో ఫణి అన్నయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించమంటాడు. ఇలా చేశావేంటి అని ఫణిని తల్లిదండ్రులు అడిగితే బుర్ర పోయింది కదా ప్రూప్స్లో ఉన్నట్లు సంతకం పెట్టలేడని ఆస్తి నాకే దక్కుతుందని అంటారు. రిజిస్టర్ ఆఫీస్ అధికారి బాలకృష్ణతో సంతకం పెట్టమని అంటాడు. బాల వెళ్తాడు. గాయత్రీ అనంత్‌తో అందులో ఉన్నట్లు సంతకం పెడతారా అంటే నాకు అదే డైట్ అని అనంత్ అంటాడు. సరిగ్గా సంతకం పెట్టకపోతే రిజిస్టర్ గారు ఒప్పుకోరని గాయత్రీ అంటే అనంత్ అన్నయ్యతో జాగ్రత్తగా సంతకం పెట్టమని అంటాడు. త్రిపుర సంతకం నేర్పించడంతో బాల ఎప్పటిలాగే సంతకం పెడతాడు. అధికారి రెండు సంతకాలు పోల్చి ఓకే అని అంటాడు. ఫణి వాళ్లు షాక్ అయిపోతారు. అనంత్ అన్నని హగ్ చేసుకుంటాడు. 

మరోవైపు త్రిపుర ఇంకా రాలేదని తాతగారు చాలా టెన్షన్ పడతారు. ఇంతలో రత్నమాల, గిరిలు ఇంటికి వస్తారు. త్రిపుర ఇంట్లో లేదని వాళ్లకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని చాలా టెన్షన్ పడతారు. రత్నమాల రాగానే రమాదేవి, ఊర్వశిలు పలకరిస్తారు. పెద్దాయన కంగారుగా రత్నమాల, గిరిలను పలకరిస్తాడు. పెద్దాయనే వాళ్లకి నీరు ఇచ్చి కంగారు పడటంతో రత్నమాలకు అనుమానం వస్తుంది. కొత్తగా ప్రవర్తిస్తున్నావ్ ఏంటి నాన్న మేం అంటే నచ్చని నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావ్ అంటే ఏదో మతలబు ఉందని అనుమానంగా ఉందని అంటుంది.

గిరి తాతని అనుమానంగా చూసి నా తిప్పు ఏది అని అంటాడు. ముస్తాబు అవుతున్నట్లుందని అంటారు. చాలా సేపటి నుంచి గదిలోనే ఉందని రమాప్రభ అనడంతో గిరి వెళ్లి పిలుస్తాడు. డోర్ కొడతాడు. పరధ్యానంలో ఉండి పలకకపోయింటుందని తాత అంటే తాతయ్యని చంకలో పెట్టుకొని నలిపేస్తూ డోర్ తంతాడు. మరోసారి తన్నబోతే త్రిపుర బయటకు వస్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లో గిరి వాళ్లని చూసిన త్రిపుర దొంగ చాటుగా ఇంట్లోకి వచ్చేస్తుంది. త్రిపురని ఎగా దిగా చూసి గిరి త్రిపుర ఇంత టైం అయినా డోర్ తీయలేదు అంటే తల నొప్పి అంటుంది. దాంతో రత్నమాల దిష్టి తీస్తానంటే త్రిపుర వద్దంటుంది. ఇంతలో మెహందీ పెట్టే వాళ్లు వస్తే అందరూ బయటకు వెళ్తారు.

మెహందీ కార్యక్రమం మొదలవుతుంది. మెహందీ ఆర్టిస్ట్ గిరికి కోన్ పెడతానంటే నువ్వు నా చేయి పట్టుకునేది ఏంటి నా తిప్పునే నాకు పెట్టాలని అంటాడు. దాంతో అందరూ త్రిపురను గిరి పక్కన కూర్చొపెట్టి మెహందీ పెట్టమంటారు. రత్నమాల త్రిపురతో మంచి డిజైన్ పెట్టు నా కొడుకు చేయి మెరిసిపోవాలని అంటుంది. త్రిపుర బావ చేతికి మెహందీ పెడుతుంది. రత్నమాల డిజైన్ చూపించమంటే గిరి చూపిస్తాడు. త్రిపుర గిరి చేతి మీద గద్ద డిజైన్ వేస్తుంది. రత్నమాల, రమాదేవిలు త్రిపురని తిడితే గిరి మాత్రం నేను గద్దనే త్రిపుర నా కోడిపిల్ల అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాల కోసం గడప దాటిన త్రిపుర.. ఫణి పేరున రిజిస్ట్రేషన్ ఆపుతుందా!!