Ennallo Vechina Hrudayam Serial Today Episode బౌద్ధ గురువు బాల నుదిటి మీద చేయి వేసి మంత్రించడంతో దేవా గతం గురువు గారు గుర్తిస్తారు. బాల సమస్యకి పూర్తి పరిష్కారం తమ దగ్గర లేదని కానీ కొన్ని గంటలు మాములు మనిషిని చేయగలం అని అంటారు. సుమారు 12 గంటలు మామూలు మనిషిగా చేయగలం కానీ పూర్తిగా అవ్వాలి అంటే ఆ భగవంతుని దయ అని అంటారు. మీ ప్రయత్నం మీరు చేయండి ఎంత ఖర్చు అయినా పర్లేదు అంటారు. గురువుగారు ఖర్చు ఏం కాదని అంతా తమ ఆశ్రమంలో చేస్తామని చెప్తారు. ఇక అందరూ బాలని తీసుకొని బౌద్దాశ్రమానికి వెళ్తారు.
గురువుగారు బాలకి మోక్ష మార్గాలను సూచిస్తారు. బాల అల్లరి చేస్తుంటే త్రిపుర కంట్రోల్ చేస్తుంది. బాలకి గతం గుర్తొస్తే మనకు భవిష్యత్ ఉండదు అని వాసుకితో నాగభూషణం అంటారు. గురువుగారు బాల చెవి దగ్గర మోక్షం కోసం సౌండ్ చేస్తారు. ఆ శబ్ధం బాలకి వినసంపుగా ఉంటుంది. తర్వాత బాలతో బుద్దుడికి పూజ చేయించి బాలకి ఓ వస్తువు ఇచ్చి ఊదిస్తారు. తర్వాత ఉత్త దేవుణి సందేశం రాయిస్తారు. బాల దాని మీద కుదురుగా రాస్తాడు. చివరి గట్టం అని ఓ చెట్టు కింద కూర్చొపెడతారు. ఆ చెట్టు చాలా పవిత్రమైన రావి చెట్టు అని ఆ చెట్టు కిందే సిద్దార్థుడికి జ్ఞానం వచ్చి బుద్ధుడిగా మారాడని బాల కూడా బాలకృష్ణుగా మారుతాడని బాలని బుద్దుడి మీద ధ్యాస పెట్టమని తన శిష్యులతో వీణ, ఫ్లూట్ అన్నీ వాయించమని అంటారు. ఆ సౌండ్‌కి బాలకి తన పూర్వ వైభవం గుర్తొస్తుంది.
బాల మీద సాంబ్రాణి వేస్తారు. ఆ పాజిటివిటీకి బాలకి గతం గుర్తొస్తుంది. మామూలు మనిషిగా మారుతాడు. అందరినీ చూసి మనం ఇక్కడ ఉన్నామేంటి అని అడుగుతాడు. అందరూ సంతోష పడతారు. ఇక బాలకృష్ణ తల్లిని బామ్మని పట్టుకొని నాకు ఈ బట్టలు వేశారేంటి నాకు ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని అడుగుతాడు. ఇక బాల త్రిపురని చూసి నువ్వు త్రిపుర కదా నీకు ఆ రోజు నేను ఓ పెన్ ఇచ్చాను కదా అది నాకు వెంటనే కావాలి అని అడుగుతాడు. దానికి త్రిపుర ఆ పెన్ మా ఇంటిలోనే ఉందని అంటుంది. వెంటనే వెళ్దామని అంటాడు. ఫణీ కారు కీస్ అడిగి త్రిపురని తీసుకొని వెళ్తాడు. గురువుగారు త్రిపురతో బాల ఎలాంటి పరిస్థితిలో మానసిక ఒత్తిడికి గురు కాకూడదు అని ఓ ఇసుక ఉన్న బొమ్మ ఇచ్చి ఈ ఇసుక మీద నుంచి కింద పడితే చిన్న పిల్లాడిలా మారిపోతాడని అంటారు.
త్రిపురని బాల పిలవడంతో వెళ్తుంది. బాలకిఆ సాక్ష్యం దొరికితే మనకు భవిష్యత్ ఉండదు అని ఎలా అయినా ఆపు అని నాగభూషణం ఫణీతో చెప్తారు. ఇక రమాప్రభ ఆ పెన్ దేవుడి దగ్గర పెట్టుకొని ఆ పెన్తో తన కూతురిని ఆ ఇంటికి కోడలినే కాదు యువరాణిని చేస్తానని అంటుంది. ఆ పెన్‌ని తీసుకొని గుడికి బయల్దేరుతారు. వెళ్తూ వెళ్తూ రమాప్రభ ఆ ఫొటో ఎవరి కంట పడకూడదు అని త్రిపుర తండ్రి ఫొటో వెనక పెట్టేస్తుంది. ఇక త్రిపుర, బాల కారులో వెళ్తుంటారు. ఆ పెన్ ఉంటే మా తాతయ్యని చంపిన వాళ్ల అంతు చూసే వాడిని అంటాడు. ఆ పెన్ ఎట్టి పరిస్థితిలో నాకు ఇవాళ కావాలి అంటాడు. ఇక నాగభూషణం రమాప్రభకి పెన్ గురించి చెప్పాలని ఫోన్ చేస్తే రమాప్రభ ఫోన్ ఇంట్లో వదిలేసి గుడికి వెళ్లిపోయింటుంది. త్రిపుర, బాల ఇంటికి వస్తారు. లోపలికి వెళ్లి త్రిపుర పెన్ కోసం వెతుకుతుంది. పెన్ కనిపించకపోవడంతో బాలకి విషయం చెప్తుంది. త్రిపుర, బాల ఇద్దరూ వెతుకుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!