Ennallo Vechina Hrudayam Serial Today Episode అనంత్, గాయత్రీలు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని కుడి కాలు పెట్టి లోపలికి వస్తారు. యశోద గాయత్రీతో ఇంట్లో దీపం పెట్టిస్తుంది. తర్వాత వచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. వాసుకి, నాగభూషణంల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. వాసుకి గాయత్రిని దగ్గరకు తీసుకొచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.
వాసుకి: మీ అక్కా చెల్లెళ్లు భలే ప్లాన్ చేశారు. మీ అక్క మా బాలని వల వేసి కేర్ టేకర్‌గా ఇంటికి వచ్చింది. నువ్వేమో ఏకంగా మా అనంత్‌ని బుట్టలో వేసుకొని ఇంటి కోడలిగా వచ్చావ్. అయినా మీ అక్క ఒక అబ్బాయికి కేర్ టేకర్‌గా ఎలా వచ్చిందే. కొంచెం అయినా సిగ్గు ఉందా. సిగ్గు ఉంటే ఇలాంటి పనులకు ఎందుకు వచ్చేది. పెద్దింటికి కోడలిగా వచ్చావ్ నువ్వు మీ అక్కలా క్యారెక్టర్ లేని పనులు చేయకుండా బుద్ధిగా ఉండు. అనగానే గాయత్రీ లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. బాల: వావ్ వాటే షాట్ గాయత్రీ మంచి పని చేశావ్.యశోద: గాయత్రీ అంత కోపం ఎందుకు అమ్మా వాసుకి నీకు అత్తయ్య అవుతుంది. ఒక మాట అంటే కాస్త సౌమ్యంగా చెప్పొచ్చు కదా.బామ్మ: ఏమైంది గాయత్రీ. ఎందుకు వాసుకిని అలా కొట్టావ్.గాయత్రీ: ఈవిడ నా గురించి మా అక్క గురించి చాలా తప్పుగా మాట్లాడింది.నాగభూషణం: ఏం మాట్లాడితే మాత్రం అలా కొట్టేస్తావా నేను నా భార్యని ఇప్పటి వరకు కొట్టలేదు. గాయత్రీ: నా దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను ఇలాగే రియాక్ట్ అవుతా.త్రిపుర: గాయత్రీ ఆగవే.వాసుకి: అత్తయ్య నన్ను మీ ముందు కొట్టినా ఏం అనరేంటిగాయత్రీ: మిమల్ని కొట్టిందే కాదు మీరు అన్న మాటలు చెప్పండి.వాసుకి: నేనేం అన్నాను. బామ్మ: గాయత్రీ పెద్దవాళ్ల మీద చేయి చేసుకోవడం తప్పు. త్రిపుర: మీ మీద గాయత్రీ చేయి చేసుకోవడం చాలా తప్పు దాని తరఫున నేను సారీ అడుగుతున్నా. త్రిపుర కాళ్లు పట్టుకుంటానని అంటుంది.
గాయత్రీ మీరు నిజం మాట్లాడండి అని అంటుంది. ఇక అనంత్ గాయత్రీని ఆపుతాడు. అందరూ చేయి చేసుకోవడం తప్పు అని బామ్మ అంటారు. దాంతో అనంత్ గాయత్రీని తీసుకొని వెళ్లిపోతాడు. వాసుకి అందరితో ఈ పిల్లతో అందుకే పెళ్లి వద్దని అన్నాను విన్నారా పోను పోను ఇంకెన్ని చూడాలో అంటుంది. ఇక త్రిపుర, బాల ఐస్‌క్రీమ్ బండి దగ్గరకు వెళ్తారు. నాగు నాలుగు ఐస్‌క్రీమ్‌లు కావాలని కొనివ్వని బాల సుందరితో చెప్పి తనకు నచ్చిన ఐస్‌క్రీమ్‌లు కొనుక్కుంటాడు. త్రిపురకు కూడా ఒక ఐస్ క్రీమ్ ఇస్తాడు. ఎప్పుడూ నాకు ఐస్‌క్రీమ్ తినొద్దు అంటావ్ కదా ఇప్పుడు ఎందుకు ఇచ్చావ్ అంటే బాలగారు మీరే మా చెల్లిని కాపాడారు వాళ్ల పెళ్లి చేశారని అంటుంది. బాల ఐస్‌క్రీమ్స్ తింటాడు.
ఊర్వశి పిచ్చిదానిలా ఇంట్లో అన్నీ విసిరేసి పగలగొడుతూ గోల గోల చేస్తుంది. ఇంతలో వాసుకి వాళ్లు అక్కడికి వస్తారు. ఊర్వశి మా ఇంటి కోడలు అవుతుందని అనుకున్నాం కానీ త్రిపుర నీ పెళ్లి నాశనం చేసిందని అంటారు. గాయత్రీ, త్రిపురని సర్వనాశనం చేయాలని ఊర్వశి అంటుంది. వాళ్లని అస్సలు వదలను అని రమాప్రభ అంటుంది. ఇక ఫణి వాళ్లు కెమెరా పెన్ ఇవ్వమని రమాప్రభని అడుగుతారు. ఊర్వశి పెళ్లి అవ్వలేదు కదా మరి పెన్ ఇస్తానని అంటుంది. మేం చాలా సాయం చేశాం కదా మాట మార్చితే ఎలా అంటుంది. గాయత్రీ సంతోషంగా కాపురం చేయకుండా, త్రిపుర కేర్ టేకర్‌గా మానేలా చేస్తే పెన్ ఇస్తానని అంటుంది. రమాప్రభ ఆ పెన్‌లో ఏముందో చూసి వాళ్లని ఓ ఆట ఆడుకోవాలి అనుకుంటుంది.
గాయత్రీ జరిగిన గొడవ తలచుకొని బాధ పడుతుంది. అనంత్ జ్యూస్ తీసుకొని వస్తే గాయత్రీ తీసుకోదు. అసలు ఆవిడ ఏం అనిందో తెలుసుకోకుండా నా నోరు మూయించారని అంటుంది. నువ్వు అంత రియాక్ట్ అయితే మా పిన్ని ఏం అనుంటుందో తెలుసు కానీ వాళ్లకి వాళ్ల లాగే సమాధానం చెప్పాలని అంటాడు. గొడవలు అయితే ఎంత పెద్ద కుటుంబం అయినా విడిపోతారని అంటాడు. ఇంతలో బామ్మ, యశోద వచ్చి కార్యం అయిన వరకు నువ్వు గాయత్రీని ఒంటరిగా కలవొద్దురా అంటారు. ఊర్వశి చేయి ఎలా ఉందని గాయత్రీని అడుగుతుంది. ఇక వాసుకి వచ్చి మీ కోడలిని బాగా సపోర్ట్ చేస్తున్నారు మమల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని అంటుంది. అనంత్ గాయత్రీ చేయి పట్టుకోవడం చూసి అప్పుడే పెళ్లానికి దాసుడువి అయిపోయావా అని అనంత్‌ని అంటారు.
బామ్మ అనంత్‌ని పంపేసి వాసుకి వాళ్లని తీసుకెళ్లిపోతుంది. యశోద గాయత్రీని కూర్చొపెట్టి జ్యూస్ తాగమని చెప్పి గాయత్రీ చేతి గాయానికి కట్టు కట్టి ప్రతీ ఆడపిల్ల పుట్టింట్లో ఎలా ఉన్నా అక్కడి వాళ్లు సర్దుకుపోతారు కానీ మెట్టినింట్లో మనల్ని తొక్కేయాలి అని చూస్తారు మనం ఓర్పుతో వాళ్లని గెలవాలి అని చెప్తుంది. యశోద మాటలకు గాయత్రీ కన్నీరు పెట్టుకుంటుంది. మా ఇంటి మహాలక్ష్మీవి నువ్వు కన్నీరు పెట్టుకోవద్దని యశోద చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: కోనేటిలో పడిపోయిన ఉష.. చూపుల్లోనే అదిరిపోయే ఎమోషన్స్..!!