Ennallo Vechina Hrudayam Serial Today Episode గాయత్రీ అనంత్‌తో వీడియో కాల్ మాట్లాడి చివరి సారి మాట్లాడుతున్నా నాకు టైం అయిందని చెప్పి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తుంది. రేపటి నుంచి నాది కాని జీవితంలో నేను బతకాలి అంటాడు. గాయత్రీ ఫోన్ కట్ చేస్తుంది. ఇక గాయత్రీ చేయి కట్ చేసుకుంటుంది. నేను చచ్చిపోయే అంత పిరికి దాని కాదు కానీ అనంత్ లేని జీవితం గడపలేనని అనుకుంటుంది.
ఎన్‌ఆర్ఐ అరవింద్ కుమార్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్తారు. నాటకాలు వేసే వారు అరవింద్ కుమార్ చుట్టూ చేరి అతని తల మీద కొట్టేసి గెటమ్ మార్చి తీసుకెళ్లిపోతారు. ఇక బాల గాయత్రీ కోసం ఇంటికి వెళ్తాడు. మొత్తం వెతుకుతాడు. గాయత్రీ పడుకొని ఉందని అనుకుంటాడు. గాయత్రీని లేపడానికి ప్రయత్నిస్తాడు. అరగంటలో అనంత్ పెళ్లి లే గాయత్రీ అంటాడు. గాయత్రీ చేయి పట్టుకొని చలనం లేకపోవడంతో నాడి చూసి టెన్షన్ పడతాడు.
అనంత్ పెళ్లి పీటల మీద కూర్చొంటాడు. ఊర్వశిని కూడా తీసుకొచ్చి కూర్చొపెడతారు. ఊర్వశి చాలా సంతోషంగా ఉంటుంది. బామ్మ బాల గురించి నాగభూషణం వాళ్లని అడుగుతాడు. ఇక్కడే ఉంటాడులే అని అంటారు. దాంతో పెద్దావిడ వెతికి తీసుకురమ్మని చెప్తుంది. బాల ఇంటికి వెళ్లిపోయాడని చెప్పకుండా వెతికినట్లు మ్యానేజ్ చేద్దామని నాగభూషణం వాసుకితో చెప్తాడు. ఇంతలో త్రిపుర వస్తుంది. త్రిపురని చూసిన వాసుకి, నాగభూషణం షాక్ అయిపోతారు. ఇది చనిపోలేదా అనుకుంటారు. ఇక త్రిపుర అరవింద కుమార్ ముఖం మీద నీళ్లు చల్లి లేపుతుంది. అరవింద కుమార్ త్రిపుర మీద సీరియస్ అయి వెళ్లిపోబోతుంటే త్రిపుర బతిమాలి ఆపి ఫొటోలు చూపిస్తుంది. అరవింద షాక్ అవుతాడు. త్రిపుర అరవింద్‌తో విషయం మొత్తం చెప్తుంది. అరవింద్‌కి సారీ చెప్పి తన చెల్లి జీవితం కాపాడటం కోసం నిజం చెప్పమని బతిమాలుతుంది. తనతో పాటు మండపానికి రమ్మని అందరూ బతిమాలుతారు. దాంతో అరవింద్ సరే అంటాడు.
వాసుకి, భూషణం చూసి మార్ఫింగ్ ఫొటోల్లో ఉన్నఅతను అని వాడు నిజం చెప్తే పెళ్లి ఆగిపోతుంది. రమాప్రభ పెన్ ఇవ్వదు అని టెన్షన్ పడతారు. ఫణికి విషయం చెప్తారు. బాల కోసం మండపంలో అందరూ టెన్షన్ పడతారు. త్రిపుర వాళ్లు మండపం దగ్గరకు వెళ్తుంటే రౌడీలు అడ్డుకుంటారు. వెనక్కి వెళ్లిపోమని బెదిరిస్తారు. దాంతో నాటకాల వాళ్లు వాళ్లని కొడతారు. అరవింద్ కూడా కొట్టి మీదకి వెళ్తాడు. త్రిపురని కొట్టబోతే బాల వచ్చి అడ్డుకుంటాడు. బాలని కూడా కొట్టేస్తారు. అక్కడ సీతా కోక చిలుకల్ని ఊహించుకున్న బాల వాళ్లని చితక్కొడతాడు. అప్పటి వరకు గెంతులేసిన బాల పిన్నిబాబాయ్‌లు పరుగులు తీస్తారు. ఇక త్రిపుర బాలని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. బటర్ ప్లైస్ లేవని చెప్పి కంట్రోల్ చేస్తుంది. పంతులు అనంత్‌కి తాళి ఇచ్చి కట్టమని చెప్తాడు. అనంత్ తాళి పట్టుకొని కన్నీరు పెట్టుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!