మాధవ తన ఫోన్లో రాధ ఫోటో చూసుకుంటూ నీ ఫోన్ నెంబర్ ఎవ్వరికీ తెలియదని నువ్వు  అనుకుంటున్నావ్ కానీ నాకు తెలుసు. ఇది ఆ ఆదిత్య గాడు నీకు ఇచ్చిన ఫోన్ నెంబర్ వాడు నీ స్వీట్ హార్ట్ కదా.. నువ్వు ఎలాగో ఆ పేరుతో ఫీడ్ చేయలేవ్  కదా అందుకే నేను చేశాను. నా దగ్గర నీ నెంబర్ కాదు నువ్వు ఆ ఆదిత్య గాడితో మాట్లాడుతున్న ప్రతి మాట వాడు నీకు ఇచ్చే ధైర్యం అన్నీ వింటూ ఉంటున్నాను. ఎలా అనుకుంటున్నవా తెలిసిన వాళ్ళతో నీ ఫోన్ ట్యాప్ చేస్తున్నాను అని తన కన్నింగ్ ప్లాన్ బయట పెడతాడు. నిన్నునా ఇల్లు దాటకుండా చేయాలంటే ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మాటలు వినగలిగితేనే కదా మీ ఎత్తులకి పై ఎత్తులు వేయగలిగేది. ఇది నీ మీద నాకున్న ప్రేమ కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకోవడం లేదు. అందుకే అది అర్థం అయ్యేలా చేయడానికి ఇలా చేస్తున్న అని క్రూరంగా మాట్లాడతాడు.


ఆదిత్య దేవి మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. నా కూతురు దగ్గర నేను పరాయి వాడిలాగా ఇలా ఎంత కాలం.. నేను తండ్రిగా ఎంత దగ్గర కావాలని ప్రయత్నించిన అది అభిమానం అనుకుంటుంది కానీ నా ప్రేమ అని అర్థం కావడం లేదు. మాధవ తన తండ్రి అని ఆ పసి మనసు అనుకుంటుంది. ఆ నమ్మకాన్ని నేను ఎలా దూరం చేయగలను. నా బిడ్డ కలెక్టర్ కావాలని కలలు  కంటుంది అది జరగాలంటే తనని మంచి స్కూల్ లో చేర్పించాలని అనుకుంటాడు. వెంటనే ఈ విషయం రుక్మిణికి చెప్పాలని అనుకుని ఫోన్ చేస్తాడు.


Also Read: జ్వాల(శౌర్య)కి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు హిమ పరిస్థితేంటి - సౌందర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది!


దేవి కలెక్టర్ కావాలని కోరుకుంటుంది కదా అది జరగాలంటే ఇప్పుడు చదువుతున్న స్కూల్ సరిపోదు అందుకే ఇంకో మంచి స్కూల్ లో చేర్పించాలని అనుకుంటున్నని చెప్తాడు. నీ ఇష్టం అని చెప్తుంది. వాళ్ళిద్దరి మాటలు మాధవ తన ఫోన్లో వింటాడు. నీ బాధ్యత నువ్వు తీసుకుంటే నేనేమైపోవాలి ఆదిత్య అలా జరనివ్వను అని మాధవ ఆలోచిస్తుంటాడు. ఇక ఇంట్లోకి రాగానే దేవి నిన్ను పొద్దునే వేరే చోటుకు తీసుకెళ్తాను రెడీగా  ఉండమని చెప్తాడు. అది విని రాధ మాధవ వైపు కోపంగా చూస్తూ బాగా కష్టపడుతున్నారు సారు నా బిడ్డకి బొమ్మలిచ్చినవ్ చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నావ్ బయట తిప్పుతున్నావ్ నాకే దూరం చేయాలని ప్రయత్నిస్తున్నావ్ కానీ దేవమ్మ ఇక్కడ ఉండేది కొన్ని దినాలే. నువ్వెంత దూరం పెట్టాలని చూసిన అది జరగదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.


రాధ గుడికి వచ్చి దేవుడమ్మకి వాయనం ఇవ్వమని అక్కడ పూజరితో మాట్లాడి వెళ్ళిపోతుంది. ఇక మాధవ దేవిని తీసుకుని కారులో వెళ్తూ రాధ నాదగ్గర ఉండాలంటే దేవి నాదగ్గర ఉండాలి ఆదిత్య దారికి నేను అడ్డు పడుతూనే ఉంటానని మాధవ మనసులో అనుకుంటాడు. దేవిని మాధవ ఒక స్కూల్ దగ్గరకి తీసుకుని వస్తాడు. నువ్వు కలెక్టర్ అవ్వాలని అనుకుంటున్నావ్ కదా ఇది మంచి స్కూల్ ఇక్కడ చదువుకుంటే నీ కోరిక నెరవేరుతుందని అంటాడు. అది విని దేవి మురిసిపోతుంది.


Also read: ముదిరిన టామ్ అండ్ జెర్రీ వార్ - రిషిని రెస్టారెంట్ కి రమ్మన్న వసు, సాక్షితో కలసి వెళ్లి షాకిచ్చిన ఈగో మాస్టర్


పూజారి దేవుడమ్మకి ఫోన్ చేసి పిలుస్తాడు. దేవుడమ్మ వచ్చి పూజరితో మాట్లాడుతుంది. మీరు ఆ రోజు తొమ్మిదో వాయనం ఇవ్వలేకపోయారు కదా అది నేను వేరే వాళ్ళకి ఇచ్చాను. ఆ అమ్మాయి ఈరోజు తిరుగు వాయనం ఇచ్చిందని చెప్తాడు. మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మాయి తిరుగు వాయనం ఇచ్చింది అది ఇవ్వడానికి మిమ్మల్ని రమ్మనాను అని చెప్తాడు. అది విని దేవుడమ్మ ఆశ్చర్యపోతూ ఆనంద పడుతుంది. పూజారి ఆ వాయనాన్ని దేవుడమ్మకి ఇస్తాడు. నా మంచి కోరుకుంటూ నాకు వాయనం ఇచ్చిన ఆ అమ్మాయిది గొప్ప మనసు అని ఎమోషనల్ అవుతుంది. తనకి వాయనం ఇచ్చింది రుక్మిణీ  ఏమో అని  దేవుడమ్మ అనుమానపడుతుంది. సీన్ కట్ చేస్తే దేవి చిన్మయి ఆడుకుంటూ ఉంటారు. అమ్మ ఎందుకో ఈ మద్య మస్త్ పారేషన్ అవుతుందని పిల్లలిద్దరు ఆలోచిస్తారు. అప్పుడే అటుగా రుక్మిణీ వస్తుంది. నాయన గీ పొద్దు పెద్ద స్కూల్కి తీసుకెళ్ళాడని దేవి సంబరంగా చెప్తుంది. ఇందాకేగా పెనిమిటి స్కూల్ గురించి చెప్పాడు అంతలోనే దేవమ్మని మాధవ సారు స్కూల్కి తీసుకుపోవడమెంటని అనుమానిస్తుంది. నువ్వు ఇప్పుడైతే ఆ స్కూల్ కి  వద్దులే నేను చెప్పినప్పుడు పోదుగాని అని రుక్మిణీ అంటుంది. నన్నే కాదు నాయన అక్కని కూడా ఆ స్కూల్ లో చేర్పిస్తా అన్నాడని దేవి చెప్తుంటే రుక్మిణీ ఆలోచనలో పడుతుంది. నేటితో ఎపిసోడ్ ముగుస్తుంది.