ఫోన్ విషయంలో ఆదిత్యను సత్య నిలదీస్తుంది. వాచ్‌మెన్‌కు ఇస్తానన్న ఫోన్ వేరెవరికో ఎందుకు ఇచ్చావని అడుగుతుంది. ఫోన్ మన ఆఫీస్‌ దగ్గర వాచ్‌మెన్‌కి అని కవర్ చేస్తాడు. ఇంటి దగ్గర వాచ్‌మెన్‌కు ఫోన్ కావాలంటే నిన్నో... అమ్మనో అడుగుతాడు కానీ.. నన్నెందుకు అడుగుతాడని ప్రశ్నిస్తాడు. అనుమానంతో నాపై ఎంక్వయిరీ చేస్తున్నావా అని అని డౌట్ పడతాడు. లేదని అతని ఏం చేశాడా అన్న అనుమానంతో అడిగేనే తప్ప నీపై అనుమానంతో కాదంటుంది. అమెరికా వెళ్లేందుకు అన్ని రెడీగా ఉన్నాయని చెబుతుంది. 31వ తేదీనే ప్రయాణమని చెబుతుంది సత్య. రుక్మిణి, దేవిని ఇంటికి తీసుకురావడానికి తనకు ఇంకా 15రోజులే టైం ఉందని అనుకుంటాడు ఆదిత్య. పదిహేను రోజుల్లో ఏదో ఒకటి చేసి ఇద్దర్నీ ఇంటికి తీసుకురావలనుకుంటాడు. 


స్కూల్‌లో ప్రోగ్రామ్‌ ఉందని... అక్కడ మాట్లాడాలని.. దానికి సంబంధించిన విషయం ఆఫీసర్‌ సార్‌ వద్దకు వెళ్లి కనుక్కుంటానని చెబుతుంది. ఇంతలో రుక్ముణీ వచ్చి రెడీ అయ్యావా అని దేవిని అడుగుతుంది. మెట్లపై ఉన్న మాధవ్ ఇదంతా వింటుంటాడు. ఏ జన్మలో ఏ బంధమో కానీ... ఆఫీసర్‌ సార్ కూడా దేవితో చాలా దగ్గరగా ఉంటాడు అని మాధవ్ తండ్రి అంటాడు. అన్నీ దేవుడికి తెలుస్తాయని.. అందుకే దగ్గర చేయడానికి చూస్తుంటాడని అంటుంది రుక్మిణి. ఆ మాటవిన్న మాధవ్ కోపంతో రగిలిపోతాడు. కానీ ఏమీ అనలేని పరిస్థితిలో ఉంటాడు. రుక్ముణీ, దేవి ఇద్దరూ కలిసి ఆఫీసర్ వద్దకు వెళ్తారు. 


ఇక్కడ ఆదిత్య కూడా దేవి, రుక్ముణి కలవడానికి మంచి ఉత్సాహంతో రెడీ అవుతుంటాడు. తన బిడ్డతో రోజంతా ఆనందంగా గడపవచ్చని అనుకుంటూ బయల్దేరతాడు. ఫొటో చూసి మురిసిపోతాడు. నువ్వు శాశ్వతంగా నా వద్దకు వచ్చేస్తే అంతకు మించిన ఆనందం జీవితంలో ఏమీ లేదనుకుంటాడు. 


ఇంతలో సత్య వస్తుంది... ఏంటీ- ఆదిత్య ఇంత హడావుడిగా ఎక్కడికి అని అడుగుతుంది. ఆఫీస్‌కు వెళ్లాలని చెప్తాడు. ఇంటికి రావచ్చు కదా... ఆఫీస్‌కు ఎందుకు అని అడుగుతుంది సత్య. కలెక్టర్స్‌ ఏం చేస్తారు... అనే అంశంపై స్కూల్‌లో ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారట అందుకే ఆఫీస్‌కు వస్తుందని చెప్తాడు. దేవి అనే పేరు చెబితే చాలు అన్ని మర్చిపోతావని అంటుంది సత్య. అవును.. దేవి చాలా దగ్గరగా అనిపిస్తుంది అంటాడు ఆదిత్య. ఆమె అక్కకు పుట్టిందని ప్రేమ చూపించినా... మాధవ్‌ గురించి తెలిసి కూడా ఇలా చేయడం బాగాలేదంటుంది సత్య. ఆమెపై హక్కు మనకు రాదని చెప్పి కోపంగా వెళ్లిపోతుంది. 


మాధవ్‌కు రుక్ముణికి పెళ్లి కాలేదని తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావని... నిజంగా మాధవ్‌కు హక్కులేదని తెలిస్తే నువ్వే బిడ్డను దగ్గరకు చేర్చుకుంటావని అనుకొని ఆఫీస్‌కు వెళ్లిపోతాడు. 


ఆఫీస్‌కు దేవి వస్తుంది. పాప నుంచి ఆనందంతో మురిసిపోతాడు. బిస్కెట్స్ తినడానికి రాలేదని... కలెక్టర్ సాబ్ ఏం చేస్తాడో తెలుసుకోవడానికి వచ్చనంటుంది. కాసేపటి తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. దేవినే ఆదిత్యతు తినిపిస్తుంది. 


సత్య వద్దకు బాషా, కమల వచ్చి ఆదిత్య గురించి చెబుతుంది. ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లినా బాషాను తీసుకెళ్లేవాడని ఇప్పుడు తీసుకెళ్లడం లేదని అంటారు. ఏదో మార్పు వచ్చిందంటారు. కానీ సత్య మాత్రం అలాంటిదేమీ లేదని అంటారు. 


కారులో పిల్లలతో స్కూల్‌కి వెళ్తున్న మాధవ్‌.. తనను రాకుండా ఎంత ట్రై చేసినా కుదర్లేదని రుక్ముణి వైపు చూస్తూ అనుకుంటాడు. ఇకపై ఎక్కడికైనా తను లేకుండా దేవి వెళ్లదని అలా ఆమెను ట్రైన్ చేశానంటాడు. ఇంతలో కారు స్కూల్‌ వద్దకు వస్తుంది. అక్కడ రుక్ముణి తల్లి వెయిట్ చేస్తుంది. ఆమె వద్దకు పిల్లలు పరుగెత్తుకొని వెళ్తారు. కానీ కారులో మాధవ్ దిగడాన్ని చూసి ఆమె తల్లి షాక్ తింటుంది.