స్టేజ్‌పై మాట్లాడిన చిన్మయి.. అమ్మను పొగుడుతుంది. దానికి అంతా చప్పట్లతో అభినందనలు చెప్తారు. స్టేజ్‌పై నుంచి వచ్చి తల్లిని కౌగిలించుకుంటుంది. బాగా మాట్లాడినవాళ్లలో దేవి, చిన్మయి బాగా మాట్లాడారని స్కూల్‌కి వచ్చిన గెస్ట్ చెప్తారు. ఇద్దరికి కూడా బహుమతి ఇవ్వాలని సూచిస్తారు. వాళ్లను ఇంతలా తీర్చి దిద్దిన తల్లి కూడా బహుమతి అందుకోవడానికి రావాలని ఆదిత్య చెప్తాడు. మాధవ్ కూడా వాళ్లతోపాటే వెళ్తాడు. బహుమతిని ఆదిత్య చేతుల మీదుగా ఇద్దరు పిల్లలు అందుకుంటారు. తర్వాత నేను మాట్లాడాలి అంటాడు మాధవ్. దేవి మైక్ తీసుకొచ్చి ఇస్తుంది. పిల్లలు ఇద్దరికీ ఫస్ట్ ఫ్రైజ్ రావడం ఆనందంగా ఉందంటాడు. తన బిడ్డలు ఇంతలా ప్రయోజనకరంగా మారారు అంటే... తన భార్య రాధ కారణమంటాడు. ఇలాంటి భార్యను ఇచ్చినందుకు దేవుడికి థాంక్స్ అంటాడు. దీన్ని విన్న ఆదిత్య, రుక్ముణి కోపంతో రగిలిపోతారు.
ఇంటికి వచ్చాక దేవి చేసిన ప్రసంగం గురించే చెప్తుంటాడు ఆదిత్య. అంతా ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. దేవీ జపం చేస్తున్న ఆదిత్యను నిలదీయడం మొదలు పెడతారు ఫ్యామిలీ మెంబర్స్. అసలు ఆనందపడాల్సిన ఆ తల్లిదండ్రుల ప్లేస్ నువ్వు ఆనందపడటమేంటని అడుగుతారు. కూతురు ప్రయోజకురాలు అయిందన్న ఆనందంతో కన్నతండ్రి మాట్లాడుున్నట్టే ఉందని అంటారు. తెలియని వాళ్లు చూస్తే అదే అనుకుంటారని వార్నింగ్ ఇస్తారు. అనుకుంటే మన బిడ్డ అవుతుందా అని నిట్టూరుస్తారు. ఎంత బాగా చూసుకున్నా.. చివరకు ఆ దేవి మాధవ్ బిడ్డే అవుతుందని అంటారు. పిల్లలు పుట్టే వరకు ఆ ప్రేమను దాచుకోమంటారు. దీంతో ఆదిత్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మాధవ్ ఇంట్లో రాధపై డిస్కషన్ జరుగుతుంది. ఇన్నాళ్లూ రాధ ఎక్కడ వెళ్లిపోతుందో అన్న టెన్షన్ ఇన్నాళ్లు ఉండేదని ఇప్పుడు ఆ భయం లేదంటాడు మాధవ్. ఎప్పుడు ఆ ఆమ్మాయి వెళ్లిపోతుందో అని తాము భయపడ్డామని మాధవ్ పేరెంట్స్ కూడా అంటారు. ఇకపై అలాంటి భయం లేదని రాధ ఎక్కడికీ వెళ్లబోదని భరోసా ఇస్తాడు మాధవ్. రాధ ఇంటి నుంచి వెళ్తే మహలక్షి వెళ్లిపోయినట్టే అంటారు పేరెంట్స్. అలాంటిదేమీ జరగదని అంటాడు మాధవ్.
ఇంతలో రాధ వచ్చి ఇప్పుడు తనకు చాలా ధైర్యం వచ్చిందంటుంది. తన బిడ్డ కలెక్టర్ అవ్వాలని కోరిక ఉండేదని... ఇప్పుడు అవుతుందని నమ్మకం వచ్చిందంటుంది. నా భర్త కలెక్టరే... బిడ్డ కూడా కలెక్టరే అంటుంది. ఆశ నమ్మకమైనప్పుడు ఆ ఆనందం మస్తు ఉంటుందని అంటారు. ఇక నాకు దిగులు లేదంటుంది. నేను దూరమైనా చిన్మయిని ఎలా చూసుకోవాలో అలానే చూసుకుంటానంటుంది.
దేవి గురించి ఆదిత్య గొప్పగా చెప్పడం... రుక్మిణీ వాళ్ల అమ్మను దేవి అమ్మమ్మా అని పిలవడంతో కమల, బాషాకు అనుమానం వస్తుంది. గతంలో అవ్వా అని పిలిచేదని ఇప్పుడెందుకు అమ్మమ్మా అని పిలుస్తుందని అనుకుంటారు. ఆదిత్య కూడా ఆనందంగా ఉన్నాడెందుకని ఆలోచిస్తారు.
దేవి, చిన్మయిని పడుకోపెట్టుకొని వాళ్ల స్పీచ్ గుర్తు చేసుకుంటుంది రుక్మిణి. ఇంతలో పిల్లలు లేచి ఏమైందని... ఎందుకు నిద్రపోలేదని ప్రశ్నిస్తారు. స్కూల్‌లో జరిగిన విషయాలు మాట్లాడుకుంటారు. ఆదిత్య సారు కూడా చాలా అనంద పడ్డారని చిన్మయి చెబుతుంది.
బిడ్డ అలా మాట్లాడితే తండ్రికి సంబరంగా లేకుండా ఎలా ఉంటుందని అంటుంది రుక్ముణి. ఆ మాట విన్న చిన్మయి, దేవి షాక్ తింటారు. తండ్రా అని చిన్మయి, దేవి ప్రశ్నిస్తారు. వెంటనే తేరుకొని తండ్రి లెక్కనే చూసుకుంటున్నాడు అంటుంది. అవును నిజంగానే తమను బిడ్డల లెక్కన చూస్తున్నాడని అంటుంది దేవి. ఆయన మీ నాన్న అని చెప్పే రోజు ఎప్పుడు వస్తుందో అనుకుంటుంది.