బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతున్న 'జబర్దస్త్' నుంచి టాప్ కమెడియన్స్ అంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. అందులో సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను ఇలా చాలా మంది ఉన్నారు. యాంకర్ అనసూయ కూడా ఈ షో నుంచి బయటకు వచ్చేసింది. ఈమె యాంకర్ గా హోస్ట్ చేసిన లాస్ట్ షో కొన్ని రోజుల్లో టెలికాస్ట్ కానుంది. ఈ షోకి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇదిలా ఉండగా.. ఈ షో నుంచి వెళ్లిపోయిన గెటప్ శ్రీను ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు. ఇందులో గెటప్ శ్రీను కనిపించారు. తన ఫ్రెండ్ ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ చేస్తోన్న సమయంలో స్టేజ్ పైకి వెనుక నుంచి వచ్చి.. సడెన్ గా సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన ఫ్రెండ్ ని చూసిన ఆటో రామ్ ప్రసాద్ తెగ సంతోషపడ్డారు. 


వెంటనే స్కిట్ ఆపేసి శ్రీనుని హత్తుకున్నారు. 'మేడమ్ శ్రీను వచ్చాడు.. స్కిట్ చేద్దామనుకుంటున్నాం.. మీరు కాస్త టైం ఇవ్వండి' అని ఆటో రామ్ ప్రసాద్.. ఇంద్రజని అడిగారు. 'ముందు ఈ స్కిట్ ప్యాకప్ చేసి.. వెళ్లి మా శ్రీను తీసుకొచ్చేయండి' అంటూ చాలా ఎగ్జైటెడ్ గా చెప్పారు ఇంద్రజ. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. మరి గెటప్ శ్రీను నిజంగానే షోలోకి రీఎంట్రీ ఇచ్చారా..?లేక కేవలం ఒక్క షో వరకేనా..? అనేది చూడాలి!


Also Read : 'కలర్ ఫోటో' ఎందుకంత స్పెషల్? నేషనల్ అవార్డు కంటెంట్ క్రియేటర్లకు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది?


Also Read : తొలి ఛాన్స్ నుంచి 'ఆకాశమే నీ హద్దురా' వరకూ - సూర్య నేషనల్ అవార్డ్ కుటుంబానికి అంకితం