Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర దగ్గరకు ఫొటో గ్రాఫర్ వచ్చి ఫ్యామిలీ ఫొటో తీయాలని పిలుస్తాడు. మిత్ర వెళ్తాడు. ఇక ఫొటో గ్రాఫర్ లక్ష్మీని కూడా పిలుస్తాడు. తనెందుకని అంటే ఫ్యామిలీ ఫొటో అంటాడు. అరవింద లక్ష్మీని వెళ్లమని చెప్తుంది. లక్ష్మీ వెళ్తుంది కానీ మిత్ర తప్పని పరిస్థితుల్లో ఉంటాడు. అది చూసి మనీషా రగిలిపోతుంది. ప్రెస్ వాళ్లు పిలిచింది నన్నే కానీ నాకు పెళ్లి కాలేదని వెళ్లలేదని కవర్ చేస్తుంది. ఇక పిల్లలు కూడా వస్తారు. మిత్ర జున్ను భుజం మీద చేయి వేస్తాడు. అది చూసి జయదేవ్ ఎమోషనల్ అవుతాడు.
అరవింద: ఇదే అండీ నేను చూడాలి అనుకున్నది.
జయదేవ్: అరవింద అది ఫొటో మాత్రమే కుటుంబం కాదు.
అరవింద: వాళ్లు నలుగురు ఒక కుటుంబమే కదా.
జయదేవ్: ఫొటో కోసం ఒక చోట చేరిన కుటుంబం. ఫొటో అయిపోగానే చెల్లా చెదురు అయిపోతుంది. ఆ నవ్వుల వెనక నిజం ఎంత ఉందో నీకు తెలీదా.
అరవింద: ఆఫొటో నిజం అయితే ఎంత బాగుండండీ.
జయదేవ్: మిత్ర మనసు మారితే తప్పు ఆ నలుగురిని ఒక్క కుటుంబంలా చూడలేం.
మనీషా: అది ఎప్పటికీ జరగనివ్వను ఆంటీ. ఆంటీ, అంకుల్ ఆశల మీద నీళ్లు చల్లబోతున్నాను. ఈ ఫంక్షన్‌లోనే లక్ష్మీ భవిష్యత్ మీద పెద్ద బండరాయి వేయబోతున్నా. ఇక్కడ జరగబోయేది కేక్ కటింగ్ కాదు లక్ష్మీ మనసు ముక్కలు.
జాను తన డ్రస్ మార్చుకొని వస్తానని వెళ్తుంటే వివేక్ అడ్డుగా ఉంటాడు. డ్రస్ మార్చుకుంటా అంటే వివేక్ వద్దని అంటాడు. నువ్వు ఈ డ్రస్‌లోనే ఉండాలని అంటాడు. అందరూ నీ డ్రస్ పొగడాలని అంటాడు. అలా ఎలా సాధ్యం అని వివేక్ అంటే సేమ్ డ్రస్ తీసుకొస్తాడు వివేక్. జాను షాక్ అయిపోతుంది. ఎప్పుడు తెచ్చావ్ అంటే ఇప్పుడే అని అంటాడు. ఎందుకు అని జాను అడిగితే నా ప్రేమ నీ కను చూపు మేర ఉందని నీకు తెలియాలి అని ఇలా చేస్తున్నానని వివేక్ అంటాడు. జాను చాలా ఎమోషనల్ అయి వివేక్‌ని హగ్ చేసుకుంటుంది. వివేక్ చాలా సంతోషిస్తాడు. నిన్ను బాధ పెట్టే పని ఎప్పటికీ చేయని అని వివేక్ అంటాడు. జాను వివేక్ మాటలకు ఐలవ్యూ చెప్తుంది. జాను డ్రస్ మార్చుకోవడానికి గదికి వెళ్తుంది.
మరోవైపు రౌడీలు భాస్కర్ కోసం హాస్పిటల్‌కి వెళ్తారు. భాస్కర్ తప్పించుకొని పారిపోతాడు. డాక్టర్ వెంటనే అర్జున్‌కి కాల్ చేసి ఆ వ్యక్తి కోసం ఇద్దరు రౌడీలు వచ్చారని దాంతో ఆయన పారిపోయారని చెప్తాడు. లక్ష్మీ అర్జున్ దగ్గరకు వచ్చి ఏమైందని అడిగితే అర్జున్ విషయం చెప్తాడు. ఇక రౌడీలు మనీషాకి కాల్ చేసి విషయం చెప్తారు. మనీషా షాకై అవుతుంది. అతను ఇంటికే వస్తాడని రాకుండా కాపలా ఉండమని చెప్తుంది. మనీషా, దేవయానిలు చాలా టెన్షన్ పడతారు. ఇక మనీషా భాస్కర్ వస్తే చంపేస్తానని అంటుంది. జాను సేమ్ డ్రస్‌లో గది నుంచి రావడం దేవయాని చూసి షాక్ అవుతుంది. వివేక్ వచ్చి తల్లి పక్కనే నిల్చొంటాడు.
దేవయాని: అదేంటి ఇప్పుడే కదా దాని డ్రస్ పొగొట్టాను. మళ్లీ సేమ్ డ్రస్‌లో తలతల్లాడుతుంది.
వివేక్: అది కొత్త డ్రసే అమ్మ. నువ్వు తన డ్రస్ పొగొట్టి తనని ఏడిపించాలని చూస్తే నేను తనని సంతోషపెట్టాలని కొత్త డ్రస్ తెచ్చా.
దేవయాని: ఏమంటున్నావ్ రా నేనం చేశాను.
వివేక్: నువ్వు తప్ప తనని ఇంకెవరు బాధ పెట్టేది. నేను తనని ఇష్టపడ్డాను అనే కదా తనని ఇబ్బంది పెడుతున్నావ్.
దేవయాని: అది నా కోడలు అవ్వడం నాకు ఇష్టం లేదు.
వివేక్: అదే ఎందుకు నువ్వు మనీషా కలిసి వదినను ఇబ్బంది పెడుతున్నారు. జాను వదిన చెల్లి అవ్వడమే కదా తను నీకు ఇష్టం లేదు. నాకు ఎలాంటి భార్య కావాలో కూడా నువ్వే నిర్ణయిస్తున్నావ్. అసలు నీకు నేను ఎలా పుట్టానమ్మా ఏం కారణం లేదు కదా కానీ తను నాకు నచ్చడానికి వంద కారణాలు ఉన్నాయమ్మా.
దేవయాని: ఏంట్రా ఆ కారణాలు.
వివేక్: ఒక్క కారణం చాలమ్మా అది నేను పారిపోయి పెళ్లి చేసుకుందామని అంటే మన పెళ్లి మా అక్కకి తెలియకపోయినా పర్లేదు మీ అమ్మకి తెలియాలి మీ అమ్మ ఒప్పుకుంటే చాలు అనింది తెలుసా. నువ్వు అది అర్థం చేసుకోకుండా తనని ఇబ్బంది పెడుతుంటే ఏదో ఒక రోజు జానుకి తెలీకుండా తన మెడలో తాళి కట్టేస్తా.
దేవయాని: నువ్వు దాని మెడలో ఎలా తాళి కడతావో నేను చూస్తా రేపే దాని అంతు చూస్తా. తెగించి నన్నే ఎదురిస్తావా రేపు నువ్వే చూస్తావ్.
వివేక్: అసలు రేపు అమ్మ ఏం చేయబోతుంది.
భాస్కర్ మిత్ర ఇంటికి వస్తాడు. గేటు ముందు రౌడీలను చూసి గేటు దూకి అయినా వెళ్లాలి అనుకుంటాడు. ఇక లోపల కేక్ కటింగ్ దగ్గరకు అందరూ వస్తారు. లక్కీ లక్ష్మీని తీసుకొని కేక్ కటింగ్ దగ్గరకు వెళ్తుంది. భాస్కర్ మెల్లగా అక్కడికి చేరుకుంటాడు. అది చూసి భాస్కర్ లక్ష్మీ, మిత్రలను కలపాలి అని చూస్తే వాళ్లే కలిసిపోయారని సంతోషపడతాడు. లక్ష్మీ, మిత్ర కలిసి పిల్లలతో కేక్ కట్ చేయించి పిల్లలకు కేక్ తినిపిస్తారు. మరోవైపు దేవయాని భాస్కర్‌ని చూస్తుంది. మనీషాకి చూపిస్తుంది. మనీషా కూడా షాక్ అవుతుంది. భాస్కర్ మనీషాని చూసి పారిపోతాడు. మనీషా రౌడీలకు భాస్కర్ గురించి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.