Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ బయట ఉంటే అక్కడికి మనీషా వస్తుంది. ఇప్పటి వరకు అన్నీ బాగా ప్లాన్ చేశావని సూపర్ అని వెటకారంగా లక్ష్మీని మనీషా అంటుంది. సంయుక్తలా బాగా నటించావ్ అని, లక్కీ, జున్నులకు పెళ్లి ఫొటో చూపించి నా పెళ్లి ఆపావని ఇప్పుడు లక్ష్మీగా జున్నుని తీసుకొని ఇంటికి వచ్చావని అంటుంది.
మనీషా: మిత్రకు జేఎమ్మార్ ప్రాజెక్ట్‌ని ఎరగా వేయడం ఇప్పుడు జున్ను కోసమని శాంతి పూజ చేయించాలి అనుకోవడం అన్నీ విన్నాను. బాగా ప్లాన్ చేశావు. ఇలా అన్ని రకాలుగా నన్ను రెచ్చగొట్టి మిత్రకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నావ్ కదా. కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావ్ మిత్రకు నువ్వు దగ్గర అయితే మీ అత్తయ్య జైలుకి వెళ్తుంది. ఆ వీడియో ఇంకా నా దగ్గరే ఉంది అని మర్చిపోయావా లక్ష్మీ. నేను అది బయట పెడితే ఇన్నాళ్లు నువ్వు ఎవరి కోసం అజ్ఞాతం చేశావో వాళ్లు కారాగారం వెళ్తారని చిన్న లాజిక్ మర్చిపోయావా.
లక్ష్మీ: నాకు ఓ లాజిక్ ఉంది. అత్తయ్య గారిని జైలుకి పంపిస్తే నువ్వు మిత్ర గారికి దూరం అవుతావు కదా. కన్న తల్లిని జైలుకి పంపితే ఏ కొడుకు అయినా ఊరుకుంటాడా. నిన్ను అసహ్యించుకుంటారని నాకు తెలుసు ఆ లాజిక్ తోనే నువ్వు ఇన్ని రోజులు ఆ వీడియో బయట పెట్టలేదు.
మనీషా: ఒకవేళ నేను ఆ వీడియో బయట పెడితే ఏం చేస్తావ్. తల్లిని జైలుకి పంపితే ఏ కొడుకు ఊరుకోడు కానీ తల్లి తప్పు చేసిందని తెలిస్తే మిత్ర లాంటి కొడుకు ఒప్పుకోడు.
లక్ష్మీ: అత్తయ్య ఏ తప్పు చేయలేదు.
మనీషా: ఆ విషయం నాకు నీకు తెలుసు. మిత్రకు తెలీదు కదా. ఈలోపు నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేస్తా.
లక్ష్మీ: నీ దగ్గర ఆ వీడియో తీసుకొని మిత్ర తోనే నిన్ను గెంటేలా చేస్తా.
జానుని వివేక్ గదిలోకి తీసుకొస్తాడు. అన్నయ్య జేఎమ్మార్ ప్రాజెక్ట్ ఒకే చేశాడని ఇకపై ఇంటిలోనూ ఆఫీస్‌లోనూ రొమాన్స్ చేసుకోవచ్చని అంటాడు. మీ అమ్మకి తెలీకుండా మనం పెళ్లి చేసుకోవద్దని లేదంటే తర్వాత ఆమెతో పడలేను అని జాను అంటుంది. వివేక్ జాను చేతులు పట్టుకొని నీ కోసం మా అమ్మని కూడా ఎదురిస్తాను అని అంటాడు. నిశ్చితార్థం అయితే రొమాన్స్ చేసుకొవచ్చా అని జాను చేతికి రింగ్ తొడిగేస్తాడు. జాను వివేక్ మీద కోప్పడుతుంది. మీ అమ్మ రింగ్ చూస్తే ఇద్దరికీ ఉంటుందని అనుకుంటుంది. ఇంతలో దేవయాని జానుని పిలిచి గదిలోకి వస్తుంది. దేవయాని వచ్చేసరికి వివేక్ దాక్కుంటాడు. జాను దేవయాని రింగ్ చూడకుండా కవర్ చేసుకుంటుంది. ఇక ఇయర్ ఫోన్స్ తీసుకున్నావని ఇవ్వమని అడుగుతుంది. వాటిని తీసుకుంటూ జాను చేతికి ఉన్న రింగ్ చూస్తుంది. అది వివేక్‌దని అనుకుంటుంది. జానుని పిలిచి అడిగేలోపు జాను రింగ్ తీసేస్తుంది. ఇక దేవయాని వెళ్లిపోగానే జాను రింగ్ తనకు వద్దని నువ్వే తీసుకో అని మళ్లీ ఆ రింగ్ వివేక్ చేతికి తొడిగేస్తుంది. దానికి వివేక్ మన నిశ్చితార్థం అయిపోయిందని పెళ్లి మాత్రమే ఉందని అంటాడు.
లక్కీ, జున్నులు స్కూల్ నుంచి వస్తారు. ప్రోగ్రస్ కార్డ్ ఇచ్చారని సంతకం పెట్టమని అంటుంది లక్కీ. జున్ను మాత్రం చూడు కానీ సంతకం నాన్నతో పెట్టించుకుంటానని అంటాడు. లక్కీ మాత్రం అమ్మతో పెట్టించుకుంటానని అంటుంది. ఇద్దరినీ మిత్ర దగ్గరకు పంపిస్తుంది. జున్ను మిత్రని చాలా ఇష్టపడతున్నాడని అరవింద అంటే జున్ను మిత్రకు దూరం అయితే బరించలేడని చెప్తూ లక్ష్మీ ఏడుస్తుంది. మిత్ర దగ్గరకు లక్కీ కార్డు తీసుకెళ్లి చూపిస్తుంది. ఏ గ్రేడ్ వచ్చినందుకు మిత్ర లక్కీని పొగుడుతాడు. అమ్మతో సంతకం పెట్టించుకుంటాను అని లక్కీ అంటే మనీషా వచ్చి నా సంతకమే కదా పెడతారా అని అంటుంది. లక్కీ నువ్వు మా అమ్మవి కాదు అని మనీషాతో అంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.