Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, మిత్ర ఒకరికి తెలీకుండా ఒకరు లక్కీ తల్లి గురించి ఎంక్వైరీ చేస్తారు. మున్నార్లోని హాస్పిటల్‌కి కాల్ చేసి డిటైల్స్ అడుగుతారు. ఇక నర్స్ లక్ష్మీ చెప్పిన వివరాలతో లక్కీ తల్లి ఎవరో తెలుసుకుంటుంది. లక్ష్మీకి కాల్ చేయడానికి నర్స్ సిద్ధమవుతుంది. ఇక మిత్ర చెప్పిన మేనేజర్ కూడా నర్స్‌ని కలిసి వివరాలు చెప్తే తన గురించి ఎంత మంది అడుగుతారని అంటుంది.
ఎవరైనా అడిగారా అంటే లక్ష్మీ అనే ఆవిడ అడిగారని ఆ రోజు కేవలం లక్ష్మీకే డెలివరీ అయ్యిందని చెప్తుంది. ఇక మేనేజర్ మిత్రకి ఆ విషయం చెప్పాలి అని ఫోన్ తీస్తే ఫోన్ కలవదు. ఇక నర్స్ లక్ష్మీకి కాల్ చేసి ఆ రోజు ఇద్దరికి డెలివరీ అయిందని ఒకరు మీరు ఇంకొకరు పార్వతీ అని అబద్ధం చెప్తుంది. లక్ష్మీ పార్వతి ఎవరని అనుకుంటుంది. పార్వతి గురించి వివరాలు తెలీవని మీరు చెప్పిన ఆడపిల్ల పుట్టింది ఆవిడకే అని చెప్తుంది. ఇక మిత్రకు కూడా పార్వతి లక్కీ తల్లి అని మేనేజర్ చెప్తాడు. ఇద్దరి మాటలు దేవయాని వింటుంది.
మిత్ర: అంటే లక్కీ తల్లి పేరు పార్వతి అన్నమాట. ఆవిడ లక్కీని వెతుకుతుంది కానీ ఆవిడ వివరాలు హాస్పిటల్‌లో చెప్పలేదు. ఆవిడ గురించి తెలుసుకోవడం ఎలా.
దేవయాని: మనీషా పార్వతి ఎవరు కొత్తగా వచ్చింది.
మనీషా: తను రాలేదు నేనే ఎంటర్ చేశాను. ఎలా అంటే అని ఫ్లాష్ బ్యాక్‌లో మిత్ర చెప్పిన మ్యానేజర్‌కి ఫోన్ చేసి అతని అకౌంట్‌లో 5 లక్షలు వేసి మిత్ర అడిగిన సమాచారం మార్చి లక్కీ తల్లి పార్వతి అనేలా చెప్పమని తన ప్లాన్ చెప్తుంది. మనీషాకి మేనేజర్ లొంగిపోతాడు. మేనేజర్ నర్స్‌కి లక్ష ఇచ్చి లక్ష్మీకి అబద్ధం చెప్పిస్తాడు.
దేవయాని: అంటే ఆ పార్వతి ఇక్కడికి వస్తుందా
మనీషా: అవును పార్వతి ఇక్కడికే వస్తుంది నా కూతురు అని లక్కీని తీసుకెళ్లిపోతుంది. మిత్ర పాప లేకపోతే బతకడు కానీ మిత్రని నేను బతికించుకుంటా. లక్కీకి లక్ష్మీకి ఏం సంబంధం లేదని తెలిశాక మిత్ర లక్కీకి దూరం అయ్యాక ఇదంతా లక్ష్మీ వల్లే అని చెప్పి లక్ష్మీని, జున్నుని ఇంటి నుంచి గెంటించేస్తా.
జున్ను దగ్గరకు ఆంజనేయస్వామి వస్తాడు. లక్కీకి బాలేనప్పుడు రాలేదని నీ మీద అలిగాను అని జున్ను అంటాడు. ఇక లక్కీ దగ్గరకు వెళ్లి నిన్ను పట్టించుకోలేదు కదా హనుమాన్‌తో మాట్లాడొద్దు అని అంటాడు. లక్కీ కూడా బుంగమూతి పెడుతుంది. ఇక హనుమాన్ జున్నుతో మొక్కు తీర్చమని చెప్పి వెళ్లిపోతాడు. ఇక మిత్ర, లక్ష్మీలకు కూడా లక్కీకి తగ్గితే మొక్కు తీర్చుకుంటామని ఎవరికి వాళ్లు మొక్కుకున్న మొక్కులు తీర్చాలని అనుకుంటారు. లక్ష్మీ మిత్రని పిలవాలి అనుకుంటుంది ఇక మిత్ర లక్ష్మీని పిలవాలి అంటే ఏదోలా ఉందని అనుకుంటాడు.
లక్ష్మీ మిత్రకి జానుతో అడగమని అంటుంది. ఇక మిత్ర వివేక్‌తో మొక్కు గురించి లక్ష్మీని అడమని అంటాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకుంటారు. జాను బావగారితో ఓ విషయం చెప్పాలని అంటే వివేక్ వదినతో ఒక విషయం చెప్పాలి అంటాడు. ఇంతలో లక్కీ, జున్నులు ఆపి మేం మీతో ఒక విషయం చెప్పాలి అని అందరం గుడికి వెళ్లాలని అంటారు. ఇక వివేక్ అన్నయ్య కూడా అదే కోరుకున్నారని అంటే జాను వాళ్లతో అక్క కూడా అదే మొక్కుకుంది అంటుంది. నీ కోసమే మీ అమ్మానాన్న, జున్ను మొక్కుకున్నారని వివేక్ అంటాడు.
రాత్రి పడుకోవడానికి వెళ్తూ మిత్ర, లక్ష్మీలు ఒకర్ని ఒకరు గుద్దుకుంటారు. ఇద్దరూ పార్వతి లక్కీ తల్లి అని మాట్లాడుకుంటారు. ఇక మిత్ర ఆవిడ ఇక్కడికి రాకపోతే బాగున్ను అంటాడు. ఎందుకు అంటే లక్కీ లేకుండా నేను ఉండలేను అని మిత్ర అంటాడు. ఇక లక్కీ పక్కన లక్ష్మీ పడుకోవడానికి వెళ్తుంటే మిత్ర వద్దని జున్ను నన్ను పడుకోనివ్వడం లేదని కబుర్లు చెప్తున్నాడని అంటాడు. ఇక లక్ష్మీ లక్కీ దగ్గరకు వెళ్తే మిత్ర వెనకాలే వెళ్లి నువ్వు వాడు మా దగ్గరే సెట్ అయ్యేలా ఉన్నారని అంటే లక్కీ ఐడియా బాగుంది అంటుంది. మిత్ర వద్దు అంటే తండ్రిని జున్ను దగ్గరకు వెళ్లమంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.