Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర వాళ్ల కంపెనీ కంటే సరయు వాళ్లు ఒక్క రూపాయి తక్కువ కోట్ చేసిందని చెప్తారు. దాంతో మిత్ర డిసప్పాయింట్ అయి బయటకు వచ్చేస్తాడు. వెనకాలే లక్ష్మీ, వివేక్ వస్తారు. కొటేషన్ వేయడం రాదని మిత్ర లక్ష్మీని తిడతాడు. కంపెనీ పరువు పోయిందని ఛైర్మన్‌గా మొదటి టెండరే వేస్ట్ చేశావని అంటాడు. 


మనీషా: కంగ్రాట్స్ సరయు.
సరయు: నీకు కూడా నువ్వు కొటేషన్ సెట్ చేయడం వల్లే కదా టెండర్ మనకు వచ్చింది. 
మనీషా: టెండర్ గురించి పక్కన పెట్టు బయట మిత్ర లక్ష్మీని తిట్టు తిట్టకుండా తిడుతుంటాడు.
మిత్ర: నీకు టెండర్ వేయడం చేతకాకపోతే చేతకానట్లు ఉండాలి. 
లక్ష్మీ: తన కంటే తక్కువ కొటేషన్ చేసివాళ్లు ఉంటారు కదా. మిత్ర: ఉంటే టెండర్ వాళ్లకి వెళ్తుంది కదా మనకు కాదు కదా.
వివేక్: ఇంకా అయిపోలేదు కదా అన్నయ్య లోపలికి వెళ్లి చూద్దాం
మిత్ర: లోపల జరిగేది అవమానమే. 
సరయు: ఏంటి బాగా అప్సెస్ అయ్యావ్.
లక్ష్మీ: టెండర్ నీకే వస్తుందని అప్పుడే ఫిక్స్  అయిపోయావా.  
సరయు: ఆల్మోస్ట్ నాదే ఇప్పుడు అనౌన్స్ చేస్తారు అంతే


ఇప్పటి వరకు సరయుదే టెండర్ అని చివరి నిమిషంలో వచ్చిన టెండర్ చూసి ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్లకే ఇస్తామని అంటారు. ఇక ఇంతలో ఆ టెండర్‌ని సరయు కంటే కేవలం 5 రూపాయలు తక్కువగా అర్జున్ కోట్ చేస్తాడు.  సరయు మనీషా బిత్తర పోతారు. అర్జున్ వచ్చి మిత్ర కంపెనీ కోసం తానే తన కంపెనీ తరఫున కోట్ చేశానని చెప్తాడు. దాంతో టెండర్‌ అర్జున్ దక్కించుకొని మిత్ర వాళ్లకు టెండర్ ఇమ్మంటాడు. ఛైర్మన్ లక్ష్మీ ఆ టెండర్ దక్కించుకుంటుంది. లక్ష్మీ అర్జున్‌కి థ్యాంక్స్ చెప్తుంది. దాంతో అర్జున్ లక్ష్మీ ముందు చూపుతో ఇలా చేయించిందని చెప్తాడు. తర్వాత లక్ష్మీ మనీషా దగ్గరకు వెళ్లి చెంప పగలగొడుతుంది. మనీషా ప్లాన్ అప్పుడే తెలిసిపోయిందని అందుకే జాగ్రత్త పడ్డానని చెప్తుంది.  


లక్ష్మీ: మిత్ర గారి కంపెనీకి నష్టం తేవాలని చూస్తావా.
మనీషా: లవర్ చేతులు కలిపి భర్తని ద్రోహం చేసిన నిన్ను ఏమనాలి.. (మనీషా అలా అనగానే అర్జున్ వచ్చి మనీషా చెంప పగలగొడతాడు) 
అర్జున్: నువ్వు తప్పుగా మాట్లాడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. లక్ష్మీ నాకు లవర్ కాదు బెస్ట్ ఫ్రెండ్. లక్ష్మీ పరాయి స్త్రీ భర్తని కోరుకునే మహిళ కాదు. ఒక మంచి స్నేహితుడిగా లక్ష్మీకి అండగా ఉంటాను. నీ లాంటి ఎంత మంది వచ్చానా మిత్ర, లక్ష్మీలను విడదీయలేవు.
లక్ష్మీ: విన్నావు కదా నేను మంచి వాళ్లతో స్నేహం చేశా నువ్వు చెడ్డ వాళ్లతో స్నేహం చేశావ్. నన్ను మిత్ర గారి నుంచి దూరం చేయడం నీ తరం కాదు ఏనాటికైనా నువ్వే మిత్ర గారికి దూరం అవుతావు. 


భాస్కర్‌ స్కూల్‌లో లక్కీ, జున్నులను కలుస్తాడు. లక్కీ తల్లిదండ్రులు కూడా మిత్ర, లక్ష్మీ అని భాస్కర్‌ పిల్లలతో చెప్పబోయి మిత్రని చూసి వెళ్లిపోతాడు. మిత్ర, లక్ష్మీలకు పిల్లలు భాస్కర్ గురించి చెప్తారు. లక్ష్మీ ఆయన వచ్చారా అని అడిగితే మిత్ర నీకు తెలుసా అని అడుగుతాడు. దాంతో లక్ష్మీ కవర్ చేస్తుంది. పిల్లలు లక్ష్మీ అందరూ కలిసి వెళ్లడంతో భాస్కర్ అందరూ కలిసే ఉన్నారనుకొని సంతోషపడతాడు. మరోవైపు వివేక్ జానుకి కాల్ చేస్తాడు. జాను దేవయాని ముందు కావాలనే వివేక్‌తో శ్రీవారు మావారు అనుకొని అత్తని ఏడిపించాలని మాట్లాడుతుంది. వివేక్ కూడా జాను మై డార్లింగ్ అని మాట్లాడితే దేవయాని కోపంతో ఉండిపోతుంది. జాను కావాలనే మీ అమ్మ కంటే నేనే ఎక్కువ ఇష్టమా అని అడుగుతుంది.. జాను, వివేక్‌లు ప్రేమగా రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. జాను వివేక్‌కి తన తల్లి ఉన్న విషయం చెప్పదు. బంగారం, వజ్రాలు కావాలా అని అడుగుతుంది. మరోవైపు సరయు, మనీషాలు కలుసుకొని అర్జున్‌ని తిట్టుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: కథ ఇప్పుడు నా చేతిలో ఉందని మామకి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన సత్య.. మైత్రి కోసం టెన్షన్ పడుతున్న హర్ష!