Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ తన గర్భాశయం జానుకి దానం చేసిందని దేవయాని ఇంట్లో చెప్తుంది. ఇలా ఎందుకు చేశావని అరవింద లక్ష్మీ మీద కేకలేస్తుంది. తప్పు చేశావని లక్ష్మీని అంటుంది. క్షమించరాని సరిదిద్దుకోలేని తప్పు చేశావని అంటుంది. అందరూ అరవింద మాటలకు షాక్ అవుతారు. పిల్లలు మాకు అవసరం లేదని మిత్ర అంటాడు. అరవింద లక్ష్మీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావ్ అని అంటుంది.
మనీషా మెడలో తాళి కడుతున్నాడేమో అక్క అని దేవయాని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. మిత్ర కూడా ఆశ్చర్యంగా తాళి ఏంటి పిన్ని అని అంటే ఒక్క నిమిషం అని టీవీ వేస్తుంది. అందులో మిత్ర మాజీ లవర్‌ని రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్పి వీడియో చూపిస్తారు. మిత్ర, లక్ష్మీ బిత్తరపోతారు. అరవింద ఆ న్యూస్ ఆపించమని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్తామని చెప్పమని వివేక్‌ని పంపుతుంది. లక్ష్మీ ఏడుస్తుంది.
మిత్ర: నాకే తెలీదు లక్ష్మీ ఇదంతా ఎలా జరిగిందో నాకు నిజంగా తెలీదు. ఇది ఫేక్ న్యూస్.
మనీషా: ఏది ఫేక్ మిత్ర. నువ్వు నా మెడలో కట్టిన ఈ తాళి కూడా ఫేక్ ఏనా.
మిత్ర: నేను నీ మెడలో తాళి కట్టడం ఏంటి మనీషా.
మనీషా: అదే నేను అడుగుతున్నా నా మెడలో తాళి ఎందుకు కట్టావ్. నా మీద మరో ఉద్దేశం లేదు అన్నావ్ నాకు మరో లైఫ్ ఇస్తా అన్నావ్. లక్ష్మీనే నీ భార్య అన్నావ్ మరి ఇదంతా ఏంటి. ఇప్పుడు లక్ష్మీ జీవితాన్ని నా జీవితాన్ని నాశనం చేశావ్.
జయదేవ్: ఎవరు ఎవరి జీవితాం నాశనం చేశారు మనీషా. నువ్వు ఆ సరయుతో చేతులు కలిపి నా కళ్లలో రంగులు పోసి మిత్రకి మత్తు ఇచ్చి తాళి కట్టించుకున్నావ్.
మనీషా: లేదు అంకుల్ ఇంక మిత్ర తాగబోతే నేను ఆపాను. మిత్ర నీకు గుర్తుందా. అక్కడ ఎవరో ఏదో వాగారని మిత్ర తాగి నాకు తాళి కట్టాడు.
వివేక్: అబద్ధం చెప్పకు మనీషా నువ్వు వదినను ఎలా బ్లాక్ మెయిల్ చేశావో నాకు తెలుసు. జాను గురించి నేను దాచిన నిజం మా అమ్మకి చెప్తా అని వదినను బెదిరించి అన్నయ్యని పెళ్లి చేసుకున్నావ్.
జయదేవ్: ఆ రోజు ఇలాగే మిత్రని బయటకు తీసుకెళ్లి జరగని తప్పు జరిగిపోయింది అని చెప్పావ్.
అరవింద: తప్పు జరగడం ఏంటి.
దేవయాని: అక్కా నీకు ఇంకా తెలీదు కదా మిత్ర, మనీషా శారీరకంగా కలిశారు. ఇప్పుడు మనీషా 3 నెలల గర్భవతి. ఏ ఆడపిల్ల అయినా తన శీలం పోయింది అని చెప్తుందా.
జయదేవ్: ఈ మనీషా అసలు ఆడపిల్లే కాదు. ఈ నందన్ వంశాన్ని నాశనం చేయడానికి వచ్చిన దరిద్రం.
అరవింద: ఇంక ఆపుతారా. మనీషా మిత్ర నీతో తప్పు చేశాడా.
మనీషా: చేశాడు.
అరవింద: నువ్వు తల్లివి కాబోతున్నావా.
మనీషా: అవును.
అరవింద: మీ పెళ్లి జరిగిందా.
మనీషా: జరిగింది.
అరవింద: అయితే నువ్వు కూడా నా కోడలివే. మిత్రకు భార్యవే.
అరవింద నిర్ణయంతో అందరూ షాక్ అయిపోతారు. జయదేవ్ ఇదేంటి అని ప్రశ్నిస్తే మనీషా ఇప్పుడు మన కోడలు మిత్ర భార్య అని అంటుంది. మనీషా ఏడుస్తూ అరవింద కాళ్ల మీద పడుతుంది. అరవింద మనీషాని పైకి లేపి ఎవరు అవును అన్నా కాదు అన్నా నువ్వు నా కోడలివి మనీషా అంటుంది. మిత్రతో ఇక నుంచి నీ భార్య అని చెప్తుంది.
లక్ష్మీ: మరి నేను ఎవరు అత్తయ్యా. మీకు ఆయనకు ఈ ఇంటికి నేను ఏమవుతాను.
అరవింద: అది నువ్వు గర్భాశయం దానం చేయక ముందు ఆలోచించాల్సింది లక్ష్మీ. అప్పుడు నువ్వు మమల్ని అడగలేదు. ఇప్పుడు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంతకు మించి ఎవరూ ఏం మాట్లాడకండి. ఇన్నాళ్లు మీరు చేసింది చాలు. ఇక నుంచి నా మాటే అందరూ వినాలి.
మనీషా, దేవయానిలు గదిలోకి వెళ్లి గంతులేస్తారు. లక్ష్మీ పుణ్యమా అని నాకు వారసుడు వస్తాడు నువ్వు కోడలు అయిపోయావు డబుల్ దమాకా అంటుంది. అరవింద ఆంటీ అంత ఈజీగా ఎలా ఒప్పుకుంది అని మనీషా అంటే నువ్వు తల్లి కాబోతున్నావ్ అని ఒప్పుకుందని అంటుంది. నేను తల్లి కాదు అని అక్కకి తెలిస్తే ఎలా అంటే ఆ అబద్ధం నిజం చేయమని దేవయాని అంటుంది. అది అంత ఈజీ కాదని మనీషా అంటుంది. మనీషా ఏం చేయాలా అని తల పట్టుకుంటుంది. లక్ష్మీ బాధ పడుతుంటే మిత్ర వెళ్లి సారీ చెప్తాడు. మీరు ఏం తప్పు చేయలేదని లక్ష్మీ అంటుంది. అమ్మతో నేను మాట్లాడుతాను అని సమస్య పరిష్కరిస్తానని మిత్ర అంటాడు. లక్ష్మీ మనసులో నేను అత్తయ్యతో మాట్లాడి పరిష్కరిస్తాను అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!