chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: ట్రెజర్‌ హంట్ పోటీల్లో లక్కీ, జున్ను గెలిచారని జాను చెప్తుంది. మిత్ర, అరవిందల చేతుల మీదగా ఇద్దరికీ ప్రైజులు ఇప్పిస్తుంది జాను. అది చూసిన లక్ష్మీ మిత్రనే జున్ను తండ్రి ఈ విధంగా తండ్రీ కొడుకులను కలిపావా అని దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఒక తండ్రిగా జున్నుని మిత్ర పోటీల్లో గెలిపించాడు అని ఇద్దరినీ పక్కపక్కన చూడటం తనకు ఎంతో తృప్తిగా ఉందని లక్ష్మీ అనుకుంటుంది. పిల్లలు ఇద్దరికీ మిత్ర, అరవిందలు సీల్డ్ ఇస్తారు. తర్వాత జాను మిత్రని మాట్లాడమని చెప్తుంది. మిత్ర తండ్రి ప్రేమ గురించి చెప్తాడు. 


లక్కీ: మా నాన్న లేకపోతే నేను లేను. ఆయన ఇచ్చే ప్రోత్సాహంతో నేను గెలుస్తాను. ఈ రెండు ప్రైజ్‌లు నేను మా నాన్నకి ఇస్తాను.
జున్ను: నాకు మాత్రం మా అమ్మే ఇష్టం. నేను గెలిచాను అంటే తనే కారణం. ఈ ప్రపంచంలో అమ్మలే గ్రేట్. అమ్మలే గొప్పవాళ్లు.
మిత్ర: మనసులో.. ఓరేయ్ పిల్ల పిశాచి నేను నాన్న గురించి చెప్తే నువ్వు అమ్మ గురించి చెప్తావా.. నువ్వు మామూలోడివి కాదురా మిరపకాయలా ఘాటుగా ఉన్నాడు. అయినా వీడు అర్జున్‌ గురించి ఒక్క మాటల కూడా పాజిటివ్‌గా మాట్లాడలేదు ఏంటి. వీడికి నేనే అనుకున్నా తన తండ్రి కూడా నచ్చడనుకుంటా.


ఇంటికి వచ్చాక జున్ను డల్‌గా కూర్చొంటాడు. అర్జున్ ఇంటికి రాగానే తల్లి వసుధార జున్నుతో ఉండకుండా ఫంక్షన్ మధ్యలో ఎక్కడికి వెళ్లావని తిడుతుంది. జున్ను దగ్గరకు అర్జున్ వెళ్లి అర్జెంట్ పని ఉందని వెళ్లిపోయాను అని అంటాడు. మీరు, అమ్మ తప్ప అందరూ చప్పట్లు కొట్టారని అమ్మ ఎక్కడికి వెళ్లిందని అడుగుతాడు. ఇక లక్ష్మీ గురించి అర్జున్ వెళ్తాడు. 


అర్జున్: లక్ష్మీ జున్ను ఫ్రైజ్ తీసుకున్నప్పుడు నువ్వు అక్కడే ఉండాలి కదా ఊరంతా ఉన్నారు కానీ మీరే లేరు అని జున్ను బాధ పడుతున్నాడు. నువ్వు జనాలు ఉన్న దగ్గరకు రావు. ఎవరికీ నీ గురించి చెప్పొద్దు అని అంటావు. ఎవరికైనా జీవితంలో సమస్యలు ఉంటాయి కానీ నువ్వు జీవితమే సమస్య అనేలా ప్రవర్తిస్తావు. అసలు నువ్వు ఏంటో నాకు అర్థం కావు. నీ జీవితం అందరి జీవితంలా ఉండకపోవచ్చు. అందరి గతాల కన్నా భిన్నంగా ఉండొచ్చు. కానీ సంతోషంగా ఉంటే సరే లేదు బాధగా ఉండేది అయితే కచ్చితంగా ఆ బాధని తుడిచేది అయి ఉండాలి. 
లక్ష్మీ: ఆ పైవాడు నా  జీవితం కోసం ఓ మార్గం వేశాడు. అందులో ప్రయాణిస్తున్నాను అంతే.
అర్జున్: లేదు లక్ష్మీ ఇలాంటి మాటలు చెప్పి తప్పించుకోకు. నిన్ను గౌరవించి నీ గతం గురించి అడగడం లేదు. కానీ ఇప్పుడు తప్పడం లేదు. అసలు నువ్వు ఎవరు. నీ గతం ఏంటి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. ఎందుకు ఇలా అజ్ఞాతంలో బతుకుతున్నావు. చూడు లక్ష్మీ నువ్వు నీ గతం ఏదైనా సరే ఎవరితో ముడి పడి ఉన్నా నాకు పర్లేదు. నువ్వు సంతోషంగా ఉండటం నాకు కావాలి. నీ సమస్యకు ఓ పరిష్కారం దొరకడం కావాలి. నేను ఇంతలా అడుగుతున్నందుకు అయినా నువ్వు ఎవరో చెప్పు లక్ష్మీ.
లక్ష్మీ: చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేను కచ్చితంగా చెప్తాను.
వసుధార: అర్జున్ లక్ష్మీ గురించి నాకు ఇప్పటికీ అర్థం కాదురా. తన గురించి ఎవరికీ చెప్పదు. ఏమై ఉంటుంది. 
అర్జున్: తన జీవితం జ్ఞాపకాలు మొత్తం ఈ వైజాగ్‌తోనే ముడి పడి ఉన్నాయి. తనకు సంబంధించిన మొత్తం ఈ ఊరిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు తనని గౌరవించి తన గతం నేను పట్టించుకోలేదు. ఇప్పటికీ నేను పట్టించుకోకపోతే తనతో మనకు ఏర్పడిన బంధానికి అర్థం ఉండదు. ఇకపై లక్ష్మీ గతం గురించి ఆరా తీస్తా తెలుసుకుంటాను. తన జీవితంలో పడుతున్న సమస్యలు తెలుసుకొని సరైన పరిష్కారం కనిపెట్టాలి.


మరోవైపు లక్కీ తన తండ్రికి పబ్లిసిటీ చేయాలని చెప్తుంది. అరవింద వచ్చి నా కొడుకు సాయం చేయడం వల్ల నీకు ప్రైజ్ వచ్చిందని అంటుంది. దానికి లక్కీ హలో అరవింద మాలిని గారు క్రెడిట్ మా నాన్నకి కూడా ఇస్తాను లెండీ అని థ్యాంక్యూ చెప్తుంది. ఇక జున్ను ప్రైజ్ తీసుకున్నప్పుడు వాళ్ల అమ్మలేదు అని జున్ను ఫీలయ్యాడు అని లక్కీ చెప్తే మిత్ర ఆమెను తిడతాడు. మిత్ర లక్కీతో జున్ను వాళ్ల అమ్మ ఎలా ఉంటుందని అడుగుతాడు. దానికి లక్కీ జున్ను వాళ్ల అమ్మని చూపిస్తాను అని ఫోన్ తీసుకొని వస్తుంది. జున్ను వాళ్ల ఇంటి దగ్గర తీసిన వీడియో చూపిస్తుండగా ఇంతలో మనీషా వస్తుంది. వీడియోలో లక్ష్మీని చూసే టైంకి మిత్రని మనీషా తీసుకెళ్లిపోతుంది. అరవిందని లక్కీ వీడియో చూడమని అంటే మనీషా గురించి ఆలోచిస్తూ అరవింద తర్వాత చూస్తా అనేస్తుంది.  మనీషా మిత్రలో ఈ ఇంట్లో నేను ఎవరిని అని అడుగుతుంది. క్లాప్స్ కొడుతూ కరెక్ట్ ప్రశ్న అడిగావ్ అని దేవయాని అక్కడికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్ - గుడ్‌న్యూస్ చెప్పిన శోభ.. నడిరోడ్డుపై ఇదేం పాడు పనిరా.. కార్తీక్, దీపలను అలా చూసి తిట్టుకున్న అనసూయ!