Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర ఇంట్లోకి మీడియా వస్తుంది. లక్ష్మీ ఛైర్మన్ అయిన తర్వాత మరిది వివేక్ చెల్లి జానులకు లక్ష్మీ అన్యాయం చేసిందని అంటారు. అదే విషయం జానుకి అడుగుతారు. దాంతో జాను తన అక్క తనకు అన్యాయం చేసిందని మీడియాతో చెప్తుంది. ఊరిలో పొలం రాకుండా చేసిందని ఇంట్లో, కంపెనీలో గుర్తింపు లేకుండా చేసిందని అందుకే న్యాయ పోరాటం చేస్తున్నాం అని చెప్తుంది.
వివేక్: అబద్ధం మాకు ఏ అన్యాయం జరగలేదు తను చెప్పింది నిజం కాదు.
దేవయాని: కాదు నిజం. కొన్ని సంవత్సరాలుగా మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. అప్పట్లో నేను మా ఆయన ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు నా కొడుకు కోడలు అవమాన పడుతున్నారు.
లక్ష్మీ: ఎందుకు చిన్నత్తయ్యా గారు అలా మాట్లాడుతున్నారు. మీకు ఏం అన్యాయం జరిగింది. ఎందుకు మీడియా ముందు మన పరువు తీస్తున్నారు. కాస్త ఆలోచించి మాట్లాడండి.
జాను: మీరు మా గురించి ఆలోచించరు కానీ మేం మీ కోసం ఆలోచించాలా. మీరు మా గురించి ఆలోచిస్తే పరిస్థితి ఇంత దూరం వచ్చేదా.
వివేక్: నువ్వు మాట్లాడకు జాను.
జాను: చూడండి వీళ్లు మాకు చిన్న చూపు చూస్తున్నారు. మాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు అందుకే మేం ఆస్తి పంచుకోవాలని నిర్ణయించుకున్నాం.
దేవయాని: ఇన్నాళ్లు మాకు జరిగిన అన్యాయం నాలుగు గోడల మధ్య ఉండిపోయింది ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది.
మనీషా మనిషి అయిన మీడియా వ్యక్తి లక్ష్మీ వల్లే నందన్ వంశ పరువు పోయిందని చెప్తాడు. భార్యని వెనకేసుకొచ్చి తమ్ముడిని వదిలేశారని మిత్రని ప్రశ్నిస్తారు. ఇక జయదేవ్‌ని మీడియా చుట్టు ముడితే జయదేవ్ గుండె పోటుతో కుప్పకూలిపోతారు. దాంతో మనీషా నవ్వుతూ పెద్ద తలకాయ్ పోయిందని గెంతులేస్తుంది. చూస్తే ఇదంతా మనీషా కల. దేవయాని మనీషాని తట్టి లేపి నిల్చొని కలలు కంటున్నావా అని అడుగుతుంది. ఆ కలే నిజం అవుతుందని మనీషా చెప్తుంది. ఇక నిజంగానే మీడియా మిత్ర ఇంటికి వస్తారు. జయదేవ్ చూసి కంగారు పడితే మిత్ర అడ్డుకోవడానికి బయటకు వెళ్తాడు. మీడియా వాళ్లని ఎందుకు వచ్చారని అంటే దేవయాని, మనీషాలు ఆస్తి పంపకాలు కోసం గొడవ పడతారని అనుకుంటే లక్ష్మీకి బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు వచ్చినట్లు మీడియా చెప్తుంది. మిత్ర చాలా సంతోషిస్తాడు. మనీషా, దేవయాని షాక్ అయిపోతారు. మిత్ర టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తారు. జాను కూడా రగిలిపోతుంది. ఇక మనీషా బయటకు వెళ్లి సతీష్ అనే మీడియా వ్యక్తితో గొడవ పడుతుంది.
లక్ష్మీని నిలదీయకుండా ఏం చేస్తున్నావ్ అని అంటుంది. నిన్న ఒకలా ఈ రోజు ఒకలా ఎలా మాట్లాడుతున్నావ్ అని సతీష్‌ని అంటే ఆయన లక్ష్మీ మంచి తనానికి జ్ఞానోదయం అయిందని చెప్తాడు. సీన్ కట్ చేస్తే లక్ష్మీ బయట ఉంటే ఇద్దరు పిల్లలు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తారు. అన్నయ్య ఎంత చెప్పినా తమ్ముడు వినకుండా పరుగెడతాడు. ఇంతలో ఒక వ్యాన్ గుద్దేయ బోతే లక్ష్మీ కాపాడుతుంది. చిన్న బాబు చేతికి గాయం అవ్వడంతో లక్ష్మీ తన చీర కొంగు కట్టి ఐస్ క్రీమ్ తినిపిస్తుంది. ఆ పిల్లలు సతీష్ పిల్లలే. సతీష్ లక్ష్మీకి థ్యాంక్స్ చెప్తాడు. గొడవల గురించి అడుగుతాడు. దానికి లక్ష్మీ కుటుంబం అంతా తన బలం అని తన ఫ్యామిలీ కోసం చాలా గొప్పగా చెప్తుంది. దాంతో సతీష్ లక్ష్మీ గారు గొప్పవారని తనకు వ్యతిరేకంగా చెప్పను అని అంటాడు. ఇంట్లో మరిది, భర్త, మామ లక్ష్మీని పొగుడుతుంటే ఆడవాళ్లు రగిలిపోతారు. ఇంతలో లక్ష్మీ గుడి నుంచి ఇంటికి వస్తుంది. మీడియా లక్ష్మీ చుట్టు ముడితే లక్ష్మీ ఏం మాట్లాడకుండా లోపలికి వస్తుంది. ముగ్గురు మగాళ్లు లక్ష్మీకి కంగ్రాట్స్ చెప్తారు.
లక్ష్మీ: అవార్డు గురించి నాకు నిన్న నైటే తెలుసుండీ. మన కుటుంబం మొత్తం కలిసే ఉందని అందరూ అనుకుంటున్నారు. ఫ్యామిలీ మొత్తం ఐక్యంగా విజయాలు సాధిస్తున్నామని అనుకుంటున్నారు. మనం అందరికీ అదర్శం కావాలి అని నాకు ఆ అవార్డు ఇచ్చారు. కానీ నిజానికి మన ఇంట్లో జరుగుతుంది వేరు. మనం ఒకటిగా లేమండి ముక్కలు అవ్వాలి అనుకుంటున్నాం. ఇలాంటి సమయంలో అలాంటి అవార్డు రావడం నాకు ఎలాంటి సంతోషం లేదు. అందుకే నేను ఆ అవార్డు తీసుకోకూడదు అనుకుంటున్నా.
వివేక్: వదిన అది ఎంత పెద్ద అవార్డు కోట్ల మందిలో అది మీకు వచ్చింది. అది తీసుకోబోయే మొదటి మహిళ మీరు దాన్ని వద్దు అంటున్నారా.
లక్ష్మీ: నా కుటుంబం నన్ను గుర్తించనప్పుడు బయట వాళ్లు గుర్తిస్తే ఏం లాభం.
మిత్ర: లక్ష్మీ నీ మనసు ఎంత గాయపడిందో నాకు తెలుసు కానీ ఇంత పెద్ద అవార్డు వద్దు అంటావా.
లక్ష్మీ: నా కుటుంబమే నాకు ఆస్తి నా కుటుంబమే నాకు అవార్డు అంతకు మించి ఏం వద్దు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: అద్దంలో త్రినేత్రి ఆత్మ.. మనవరాలు చనిపోయిందని గుండె పగిలేలా ఏడుస్తున్న బామ్మ!