Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode యూనియన్ లీడర్‌ బండారం బయట పెట్టి మిత్ర అతన్ని కొడతాడు. జయదేవ్ అతన్ని ఫ్యాక్టరీ నుంచి గెంటేస్తాడు. మిగతా అందరూ జయదేవ్ వాళ్లకి సారీ చెప్తారు. కొడుకు కోడళ్లని జయదేవ్ పొగుడు తాడు. లక్ష్మీని మిత్ర ఎక్కువ పొగిడేయడంతో మిత్ర ఉడికిపోయి ఛైర్మన్తోనే ఎందుకు మీ కోడల్ని ఆపేశారు. సీఎంనో పీఎంనో చేసేయండి అంటాడు. మనం అందరం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మిత్ర, లక్ష్మీ అనుకంటారు. ఇద్దరూ సంతోషంతో చేతులు కలుపుకోవడం మనీషా చూసి రగలిపోతుంది. మనీషా, సరయు కలుస్తారు. మనీషా టపాసులు కాల్చుతుంటే సరయు లక్ష్మీ గెలిస్తే నువ్వు సెలబ్రేట్ చేస్తున్నావ్ ఏంటి అని కోప్పడుతుంది.


సరయు: లక్ష్మీ ఇంటా గెలిచింది రచ్చ గెలిచింది. అటు ఇంట్లో ప్రాబ్లమ్‌ని ఇటు ఫ్యాక్టరీ ప్రాబ్లమ్‌ని పరిష్కరించుకుంటుంది.
మనీషా: అది గెలిచినందుకు కాదు నేను ఓడిపోయినందుకు సెలబ్రేట్ చేస్తున్నాను. నా ఓటమిని సెలబ్రేట్ చేస్తున్నాను. 
సరయు: నీకు పిచ్చా ఎవరైనా ఓడిపోతే సంబరాలు చేసుకుంటారా.
మనీషా: నేను చేసుకుంటాను. ఎందుకు అంటే ప్రతీ సారీ నేను ఆ లక్ష్మీ చేతిలో ఓడిపోతూనే ఉన్నాను. లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిన ఒక్కసారే గెలిచాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓడిపోతూనే ఉన్నాను.
సరయు: ఇక ముందు కూడా ఓడిపోతూనే ఉంటావు. నువ్వు చచ్చే వరకు ఆ లక్ష్మీ నీ మీద గెలుస్తూనే ఉంటుంది. నువ్వు పెద్ద ఎత్తున టపాసులు కొనిపెట్టుకోవడం బెటర్. నీకు ఎప్పటికీ మిత్ర దక్కడు. నువ్వు కొన్న టపాసుల తోనే నీ చితి కాలుతుంది.
మనీషా: సరయు చంపేస్తాను. 
సరయు: నిన్ను నువ్వే చంపుకుంటున్నావ్ నిన్ను నువ్వే ఓడించుకుంటున్నావ్ మిత్ర లక్ష్మీ దగ్గరైపోతున్నారు. నీ ఆలోచనలు ఇలా ఉంటే నువ్వు ఓడిపోవడం ఖాయం. ఏదో విభజించి పాలిస్తా అన్నావ్ అది ఏమైంది. ఆ అస్త్రం నువ్వు వాడింది జాను, లక్ష్మీల మీద మిత్ర, వివేక్‌ల మీద కాదు కదా. నువ్వు విడగొట్టాల్సింది లక్ష్మీ, జానులను కాదు మిత్ర, వివేక్‌లను. వెంటనే ఆస్తి పంపకాలు చేసి మిత్ర, వివేక్‌లు విడిపోయేలా చేయ్. అప్పుడు ఆటోమెటిక్‌గా లక్ష్మీ, జానులు విడిపోతారు. ఆ తర్వాత వివేక్, జానుల వాటాని నష్టపరుచు. వాళ్లు వీధిన పడేలా చేయ్. అదే సమయంలో అన్నదమ్ముల గొడవ అక్కా చెల్లెళ్ల గొడవ కారణంగా మిత్ర, లక్ష్మీల మధ్య విభేదాలు వచ్చేలా చేయ్. వాళ్లు కూడా విడిపోతారు. మిత్ర నీ వాడు అవుతాడు. నువ్వు కోరుకున్నది జరిగి లక్ష్మీపై నువ్వు శాశ్వతంగా గెలుస్తావ్ అప్పుడు చేసుకో దీపావళి.
మనీషా: థ్యాంక్యూ సరయు మంచి ఐడియా ఇచ్చావ్ ఇప్పుడే వెళ్లి నందన్ వంశాన్ని రెండు ముక్కలు చేస్తా. 


మిత్ర లక్ష్మీకి బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్తాడు. అది మనీషా చూస్తుంది. మిత్ర లక్ష్మీకి గులాబి ఇస్తాడు. మనీషా రగిలిపోతుంది. ఆ గులాబిని మిత్ర లక్ష్మీ జడలో పెట్టబోతే మనీషా కోపంతో పూల కుండీ విసిరేస్తుంది. ఇద్దరూ ఏదో పడినట్లుందని బయటకు వెళ్లిపోతారు. వివేక్ జానుతో వదిన తెలివికి అందరూ పిధా అయిపోయారని చెప్తాడు. జాను రగిలిపోతుంది. వీలునామా ద్వారా తనకు మోసం చేసిందని తిట్టుకుంటుంది. తనని నష్టపరిచిందని అంటుంది. నువ్వు మారిపోయావని నువ్వు నువ్వు కాదని నీలో ఏ క్వాలిటీలు చూసి ప్రేమించానో ఇప్పుడు నీలో ఆ క్వాలిటీలు లేవని అంటాడు. కన్నతల్లి లాంటి మీ అక్కని ఇబ్బంది పెడుతున్నావ్ అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: క్షమించమని రాజుని అడిగిన రూప.. కఠినంగా మారిపోయిన రాజు.. మందారానికి ఆబ్దికం!