Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 8th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషా ఇక ఇక్కడే ఉంటుంది.. ఈ ఇంటి మనిషి.. నిజం తెలిసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషాని ఇంటికి తీసుకొచ్చిన మిత్ర ఇక నుంచి మనీషా ఈ ఇంటి మనిషి అని అందరికీ చెప్పడంతో అందరూ షాక్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర బయటకు మనీషా మిత్రతో ఇక ఎప్పటికీ కనిపించ దూరం వెళ్లిపోతా అని చెప్పి వెళ్తుంది. ఇంతలో మిత్రని తన ఫ్రెండ్స్ అందరూ కలిసి మనీషా జీవితం నాశనం చేసేశావని అంటారు. తనకే గుర్తు లేదని మిత్ర అంటాడు. తాగను తాగను అని తాగేసి మనీషాని లాక్కెళ్లి పాడు చేశావని అంటారు. మిత్ర షాక్ అయిపోతాడు. తన జీవితం నాశనం చేసి తనని వదిలేశావు ఇప్పుడు తను అమెరికా వెళ్లదు సూసైడ్ చేసుకోవాలని వెళ్తుందని చెప్తారు. మనీషాని బతికించు చేసిన తప్పుని ప్రాయశ్చిత్తం చేసుకో అని అందరూ మిత్ర మీద ఒత్తిడి తీసుకొస్తారు.
మిత్ర: మనీషా ఆగు నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు ఇక్కడే ఉండు.
మనీషా: ఇక్కడే అంటే ఎక్కడ మిత్ర. ఉండటానికి నాకు ఇళ్లు కూడా లేదుగా.
మిత్ర: మా ఇంటికి రా.
మనీషా: ఏం ముఖం పెట్టుకొని మీ ఇంటికి రావాలి. ఇంట్లో అందరూ ఇంకెన్ని రోజులు ఉంటావ్ అని ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఏం జవాబు ఇవ్వాలి.
మిత్ర: నువ్వు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మనీషా. నేను సమాధానం చెప్తాను. మనీషా నేను ఇప్పుడు నీ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించడం లేదు. నిజానికి నాకు ఏం చెప్పాలో కూడా తెలీదు. ముందు నువ్వు నాతోరా.
పెళ్లి రోజు కావడంతో లక్ష్మీ అందంగా రెడీ అయి కిందకి వస్తుంది. అందరూ చూసి మురిసిపోతారు. పెళ్లి కూతురిలా ఉన్నావని పొగిడేస్తారు. లక్ష్మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తే మిత్ర వస్తే ఇద్దరూ కలిసి తీసుకుంటారని అంటారు జయదేవ్. దేవయాని మనసులో ఆశీర్వాదం తీసుకోబోయేది మిత్ర, మనీషాలు అని అనుకుంటుంది. అందరూ లక్ష్మీకి శుభాకాంక్షలు చెప్తారు. ఇంతలో మిత్ర డల్‌గా ఇంటికి వస్తాడు. పిల్లలు తండ్రి దగ్గరకు వెళ్లి అమ్మ ఎంత అందంగా రెడీ అయింది చూడు అని అంటారు. మిత్ర ఏం మాట్లాడడు.
లక్ష్మీ: మీ ఫ్రెండ్స్ బలవంతంగా తాగిస్తే మీరు మాత్రం ఏం చేస్తారు లెండీ ఇక ఆ విషయం మర్చిపోండి. త్వరగా రెడీ అయి రండి గుడికి వెళ్దాం.
వివేక్: మీ పెళ్లి రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయబోతున్నాం అన్నయ్యా.
జయదేవ్: ఏంటి మిత్ర ఏం ఆలోచిస్తున్నావ్. ఈ రోజు నువ్వు లక్ష్మీ హ్యాపీగా ఉండాలి.
మిత్ర: నాతో పాటు ఈ ఇంటికి ఇంకొకరు కూడా వచ్చారు.
లక్ష్మీ: ఎవరండీ.
మిత్ర: మనీషా. (మనీషా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయిపోతారు)
రాజేశ్వరిదేవి: ఇది మళ్లీ ఎందుకు వచ్చిందిరా అమెరికా వెళ్తా అని చెప్పింది కదా.
మిత్ర: మనీషా ఎక్కడికి వెళ్లదు. ఇక్కడే ఉంటుంది. మనీషా పరాయిది కాదు. అతిథి కూడా కాదు. ఇకపై తను మన సొంత మనిషి. (అందరూ బిత్తరపోతారు) మనీషా నీ రూంలోకి నువ్వు వెళ్లు.
మనీషా: లక్ష్మీ దగ్గరకు వెళ్లి అంత ఈజీగా వెళ్లిపోతా అనుకున్నావా నీ పెళ్లి రోజు ట్విస్ట్ ఇస్తా అన్నా కదా అదే ఇది. రాత్రి మిత్ర ఒక్కడే గెస్ట్ హౌస్‌లో లేడు. తనతో పాటు నేను కూడా ఉన్నాను. మేం ఇద్దరం ఒకే గదిలో నైట్ అంతా ఉన్నాం. భార్యభర్తల్లా. నైట్ నేను మిత్ర ఒక్కటయ్యాం. మిత్ర నా సొంతం అయ్యాడు. ఇక మిత్ర భార్యని నేనే. నిన్ను అతి త్వరలో ఇంటి నుంచి గెంటేస్తాడు. గెట్ రెడీ.
లక్ష్మీ మనీషా మాటలకు బిత్తరపోతుంది. మిత్ర గదిలో బాధ పడుతూ ఉంటే లక్ష్మీ వెళ్తుంది. లక్ష్మీని చూసి మిత్ర ముఖం దాచేసుకుంటాడు. లక్ష్మీ మాట్లాడాలి అని చూస్తే మిత్ర ఒంటరిగా వదిలేయమని అంటాడు. ఏం జరిగిందో చెప్పమని అంటే మిత్ర చెప్పాలని లేదని నాకు గిల్టీగా ఉందని చెప్తాడు. నాతో చెప్పండి ఏం కాదు అని లక్ష్మీ సర్ది చెప్తుంది. దాంతో మిత్ర నేను తప్పు చేశాను లక్ష్మీ అని అంటాడు. మీరు తప్పు చేశారు అంటే నేను ఎప్పటికీ నమ్మను అని లక్ష్మీ అంటుంది. దాంతో తాగిన మైకంలో ఏం జరిగిందో తెలీదు అంటాడు. ఇక మరోవైపు మనీషా దేవయానితో మత్తులో పడుకున్న మిత్ర లేచి చూసే సరికి నేను డ్రామా మొదలు పెట్టానని అంటుంది. లక్ష్మీ తలచుకుంటే జరగని తప్పుని జరగలేదని నిరూపిస్తుందని దేవయాని అంటుంది. లక్ష్మీ కూడా మిత్రతో నిజం నిరూపిస్తానని అంటుంది. మీ మంచితనాన్ని మనీషా అడ్డుపెట్టుకుందని లక్ష్మీ అంటే దానికి మిత్ర మనీషా నా ఫ్రెండ్ పైగా ఆడపిల్ల ఇలాంటి నింద వేసుకుంటుందా అని ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.