Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప కావేరిని హోమానికి పిలుస్తుంది. శ్రీధర్ చూసి దీప నా పెళ్లానికి బొట్టు పిలుస్తుందేంటని అనుకుంటాడు. ఇద్దరూ చూడకుండా దాక్కుంటాడు. తర్వాత కావేరి దగ్గరకు వెళ్లి ఇంటికి ఎవరో వచ్చారు అని అంటాడు. నాకు కావాల్సిన వాళ్లు అని అంటుంది. వరస ఏంటి ఎవరు అంటే దానికి నా కూతురి మొగుడి పెద్దత్త గారి మనవరాలి తండ్రికి బాగా కావాల్సిన  వాళ్లు అని అంటుంది. శ్రీధర్ రగిలిపోతూ వచ్చింది దీప అని చెప్పొచ్చు కదా అనుకుంటాడు.


మరోవైపు జ్యోత్స్న తన ఫ్యామిలీ వాళ్ల పేర్లు, స్వప్న, కాశీ, కావేరి పేర్లు రాసుకొని కూర్చొంటుంది. పారిజాతం వచ్చి ఏంటి ఇలా రాశావని అడుగుతుంది. దాంతో జ్యోత్స్న శౌర్య ఆపరేషన్‌కి డబ్బు ఇచ్చింది ఎవరో అని ఆలోచిస్తుంది. ఒక్కోకరి పేరు కొట్టేస్తుంది. ఎవరూ డబ్బు ఇచ్చారా అనుకుంటుంది. కాశీ, స్వప్నకు అంత సీన్ లేదు అంటుంది. కావేరి ఇచ్చుంటుందా అని పారిజాతం అంటుంది. కావేరి కూడా ఇవ్వదని అంటుంది. కానీ శ్రీధర్ మామే ఇచ్చుంటాడని చాలా సార్లు డబ్బు ఇస్తానని కార్తీక్ వెంట పడ్డాడని ఈ సారి కూడా ఇవ్వొచ్చని అంటుంది. 


మరోవైపు కార్తీక్ సరుకులు తీసుకొస్తే అనసూయ వాటిని సర్దుతుంది. ఇంతలో దీప వచ్చి పిలుపులు అయిపోయావని చెప్తుంది. ఈ చోటుకి నువ్వు కొత్త కదా ఎవరూ ఏం అనలేదు కదా అంటే దీప తాతయ్య మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇక కార్తీక్ అన్నీ చూసుకోమని తర్వాత చెప్తే నేను పరుగులు పెట్టలేను అని అంటాడు. కార్తీక్ బాబుకి దీప అంటే చాలా ప్రేమ అని అనసూయ అంటే శౌర్య వచ్చి నా తల్లిదండ్రులకు దిష్టి పెట్టొద్దని అంటుంది. ఇక ఇద్దరికీ దిష్టి తీస్తానని అంటే దీప సాయంత్రం తీయమని అంటుంది. కాంచన వీధిలో వాళ్లు సొంత వాళ్లు అయ్యారు కానీ సొంత వాళ్లు పరాయి వాళ్లు అయిపోయారు అంటుంది. దాంతో దీప బాధ పడొద్దమ్మా కావాల్సిన వాళ్లు అంతా వస్తారు అని చెప్తుంది.


మరోవైపు శౌర్య ఆరోగ్యం విషయం తన దగ్గర దాచినందుకు స్వప్న కాశీతో గొడవ పడుతుంది. దాంతో కాశీ మీ అన్నయ్య చెప్పొద్దన్నాడని తాతయ్య వాళ్లు కూడా సాయం చేయలేదని దీప అక్క అంటే జ్యోత్స్న అక్కకి పడదు కాబట్టి సాయం చేయకుండా అడ్డుకుందని చెప్తాడు. జ్యోత్స్న పేరు విన్న దాసు లేచి నిజం చెప్పాలి అని బయటకు వస్తాడు. కాశీ తండ్రిని పట్టుకోగానే వదలరా నిజం చెప్పాలి, వారసురాలు, అది మంచిది కాదు, అన్నయ్యకి చెప్పాలి అంటే ఏంటి ఏం చెప్పాలి అని కాశీ ప్రశ్నిస్తే ఓ బొమ్మ కింద పడటంతో దాసు మళ్లీ అన్నీ మర్చిపోతాడు. నన్ను ఎందుకు అడుగుతున్నావ్ అని అన్నీ మర్చిపోతాడు. దాంతో స్వప్న మామని తీసుకెళ్లి పడుకోపెడుతుంది. కాశీ భార్యతో ఎవరో నాన్నని కొట్టారని వారసురాలు నిజం చెప్పాలి అంటున్నారని అంటాడు. దాంతో స్వప్న సౌండ్ రాకముందు ఒకలా వచ్చిన తర్వాత ఒకలా ఉంటున్నారని అంటుంది. డాక్టర్‌కి కాల్ చేసి అడిగితే తలలో నరాలు కొన్ని ప్రాబ్లమ్ అని కంప్లీట్‌గా కోలుకునే వరకు ఏం అనొద్దని రిలాక్స్‌గా వదిలేయమంటుంది. 


శ్రీధర్ ఇంట్లోనే మందు తాగే సెటప్ చేసుకుంటాడు. ఇంతలో జ్యోత్స్న కాల్ చేసి నీ కొడుకు మీరు ఒకటైపోయారు కదా మామయ్య. దీప నీ కోడలు అయిపోయింది అని సాయం గురించి చెప్తుంది. నేనే చేయలేదు అని శ్రీధర్ అంటాడు. కావేరికి అంత సీన్ లేదని శ్రీధర్ చెప్తాడు. పూజ గురించి చెప్తే మీ ఇంటికి దీప వచ్చిందా అంటుంది జ్యోత్స్న. ఇక శ్రీధర్ కావేరి మీద అనుమాన పడతాడు. పూజ సామాను సంగతేంటో చూద్దమని గదిలోకి వెళ్లి సూట్ కేస్ చూస్తాడు. అందులో పూజ సామాను లేవు నగలు  లేవు అనుకుంటాడు. ఇక తన ఫ్రెండ్‌కి కాల్ చేస్తే కావేరి ఫిక్స్‌డ్ డిపాజిట్లు డ్రా చేసిందని తెలిసి షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: సత్యభామ సీరియల్: ఫస్ట్‌ నైట్ ఆటల్లో సత్యకి అవమానం.. చివరి నిమిషంలో మెలిక.. సంజయ్ ఆశలు అడియాసలేనా!