Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 5th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఫ్రెండ్స్ ముందే లక్ష్మీకి ప్రపోజ్ చేసి హగ్ చేసుకున్న మిత్ర.. కుళ్లుకున్న మనీషా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode పార్టీలో మనీషా ముందే మిత్ర లక్ష్మీని పొగడటం మనీషా రగిలిపోయి ఎలా అయినా లక్ష్మీ అంతు చూస్తానని ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర, లక్ష్మీ, మనీషాలు బయల్దేరితే ఇంతలో వాళ్ల ఫ్రెండ్స్ సిరి, అంజు ఇంటికి వస్తారు. మిత్ర వాళ్లకి తన భార్యని పరిచయం చేసి తను కూడా ఫంక్షన్‌కి వస్తుందని చెప్తాడు. దాంతో అంజు, సిరిలు ఫ్రెండ్స్ మాత్రమే అనుకున్నాం కదా ఇప్పుడు ఫ్యామిలీలు వద్దునుకున్నాం కదా మిగతా ఎవరూ రారు అని అంటారు. లక్ష్మీ రాను పర్లేదు మీరు వెళ్లండి అనేస్తుంది. జాను, వివేక్‌లు వెళ్లమని చెప్తారు.
ఇక మిత్ర మనీషాని వెళ్లమని తనకి ఫొటోస్ పెట్టమని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. మిత్ర తాను రాను అని లక్ష్మీ నా భార్య తను లేకుండా నేను రాను అంటాడు. అందరూ షాక్ అవుతారు. రాజేశ్వరిదేవి లక్ష్మీతో లక్ష్మీ గెలిచేశావే నీ భర్తని గెలిచేశావే మీ మధ్యలోకి ఎవరూ రారు అని అంటుంది. ఇక మనీషా సైగ చేయడంతో అంజలి, సిరి మాట మార్చేస్తారు. క్లాప్స్ కొట్టి మనీషా మాతో బెట్ కట్టిందని లక్ష్మీ మీద మీకు చాలా ప్రేమ ఉందని అందుకే ఇలా ఫ్రాంక్ చేశామని అంటుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మిత్ర మనీషాని వాళ్లతో వెళ్లమని తాను లక్ష్మీ మరో కారులో వస్తామని అంటాడు.
లక్ష్మీ ఇదంతా ఏదో స్కెచ్‌లా ఉందని అనుకుంటుంది. మనీషా తన ఫ్రెండ్స్‌కి కాల్ చేసి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి కదా అంటుంది. ఇక అందరూ ఫంక్షన్ దగ్గరకు చేరుకుంటారు. అంజు లక్ష్మీ దగ్గరకు వెళ్లి మీ చీరకు ఏదో అంటుకుంది అని లక్ష్మీని వెనకుండిపోయేలా చేస్తుంది. దాంతో మనీషా మిత్ర చేయి పట్టుకొని వెళ్తుంది. అందరూ మిత్ర, మీనీషా మీద ఫ్లవర్స్ వేసి కంగ్రాట్స్ మిత్ర మిసెస్ మనీషా అని మీ జంట సూపర్ అని తెగ పొగిడేస్తారు. మిత్ర తన చేతిలో మనీషా చేయి తీసి తాను మనీషా పెళ్లి చేసుకోలేదని చెప్పి లక్ష్మీని పిలిచి తన భార్య అని పరిచయం చేస్తాడు.
అందరూ నువ్వు మనీషా పెళ్లి చేసుకోకపోతే ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకేసారి వచ్చారు. రిలేషన్‌లో ఉన్నారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. మనీషా తనకు ఫ్రెండ్ మాత్రమే అని భార్యతో తప్ప ఇంకెవరితో రిలేషన్స్ లేవని మిత్ర చెప్తాడు. అందరూ మిత్రకు సారీ చెప్పి లోపలికి తీసుకెళ్తారు. మనీషా తన ఫ్రెండ్స్ ప్లాన్ అదుర్స్ కదా అంటే వాళ్లు మనీషాని పొగిడేస్తారు. ఫంక్షన్లో అందరూ సరదాగా ఉంటే లక్ష్మీ ఓ చోట డల్‌గా ఉంటుంది. అది చూసిన మిత్ర మైక్ తీసుకొని మాట్లాడుతాడు. తాను కూడా అందరిలాగే గ్రాడ్యూయేట్ అయ్యానని తండ్రి అయ్యానని తన భార్య వల్ల మంచి మనిషి అయ్యానని అంటాడు. కాలేజ్‌లో మంచి వాడినైన నాకు తర్వాత ఆటుపోట్లో నా భార్య నన్ను మళ్లీ మంచి వాడిలా మార్చిందని లక్ష్మీని పొగిడి తన దగ్గరకు పిలుస్తాడు.
మనీషా రగిలిపోతాడు. మనీషా నేను ప్రేమించుకున్నా పెళ్లి చేసుకోలేకపోయాం అని లక్ష్మీ అనుకోకుండా తన జీవితంలోకి వచ్చి గర్వపడేలా చేసిందని అంటాడు. అందరి ముందు లక్ష్మీకి థ్యాంక్స్ చెప్పి లవ్‌యూ చెప్పి హగ్ చేసుకుంటాడు. లక్ష్మీ ఎమోషనల్ అయిపోతుంది. మనీషా రగిలిపోతుంది. మనీషా ఫ్రెండ్స్ మనీషాని వెటకారం చేస్తారు. అమెరికా వెళ్లిపో అని అంటారు. ఇంతలో రవి అని ఒక వ్యక్తికి అంజు కాల్ చేసి డ్రగ్స్ తీసుకు వచ్చావా అని అడుగుతుంది. తీసుకొచ్చామని చెప్తాడు రవి. ఇంట్లో రాజేశ్వరి దేవి వంగి బామ్ తీసుకుంటే జాను వచ్చి నేను చేస్తా కదా మీరు ఎందుకు అని రాజేశ్వరి దేవి కాళ్లకి బామ్ రాస్తుంది. దేవయాని రావడం చూసిన రాజేశ్వరి బామ్ దేవయానికి ఇచ్చి కాలికి బామ్ రాయమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలకి ప్రమాదం.. ప్రాణాలకు తెగించి కాపాడిన త్రిపుర.. గాయత్రీ మీద నింద!