Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ వాళ్లు ఇంటికి వస్తారు. మనీషాని చూసిన దేవయాని ఏమైంది ఇలా ఉంది పిల్లలతో వస్తుంది ఏంటా అనుకుంటుంది. ఇక పిల్లలు రేపు ఆటల పోటీలు ఉన్నాయని అమ్మానాన్నలు వస్తారు మేమే గెలుస్తామని తాతయ్య వాళ్లతో చెప్తారు. లక్ష్మీ పిల్లల్ని ఫ్రెష్ అవమని చెప్తుంది.
లక్ష్మీ: మనీషా నీకు ఇప్పుడు పుల్ల పుల్లగా ఏమైనా తినిపించడం లేదా.మనీషా: ఎందుకు లేదు ఈ చింతకాయో మామిడి కాయో ఉసిరికాయో తినాలి అనిపిస్తుంది.రాజేశ్వరిదేవి: ఉండు ఉండు నీ కోసం పుల్ల పుల్లగా మామిడి కాయ తీసుకొస్తా. అక్కడే ఉన్న జామ కాయ తీసుకొచ్చి పుల్లటి మామిడి కాయ అని ఇస్తుంది.లక్ష్మీ: ఎలా ఉంది మనీషా.మనీషా: పుల్లగా ఉంది. లక్ష్మీ: నిజంగానా పచ్చి జామ కాయ వగరుగా ఉంటుంది కానీ పుల్లగా ఎలా ఉంటుంది మనీషా.రాజేశ్వరిదేవి: అరే తొందర్లో మామిడి కాయ అనుకొని జామకాయ తెచ్చా వయసు అయిపోయింది కదా లక్ష్మీ: కానీ మనీషాకి రుచి తెలీడం లేదు పెద్దమ్మ.మనీషా: నేను కొంచెం కంగారులో ఉన్నాను. చూడు మిత్ర అందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మిత్ర: మనీషాని వదిలేయ్ లక్ష్మీ నువ్వు మీదకి వెళ్లు మనీషా.
మరోవైపు రిపోర్ట్స్ పట్టుకొని వివేక్, జానులు మెడికల్ షాపుకి వస్తారు. వివేక్ రిపోర్ట్స్ ఆమెకి ఇచ్చి ఇవి చూసి చెప్పండి అంటాడు. అందులో జానుకే ప్రాబ్లమ్ ఉంది కానీ నిజం చెప్తే తను తట్టుకోలేదు దయచేసి ప్రాబ్లమ్ నాకు అని ఆ మెడిసిన్ మగవాళ్లు వాడొచ్చని చెప్పిండి ప్లీజ్ అని చెప్తాడు. దాంతో జాను ఫ్రెండ్ వివేక్ చెప్పిందే నిజమని అంటుంది. తర్వాత ఆమెకు సారీ చెప్తాడు. మిత్రకు పిల్లలు అంటే ప్రాణం వాళ్ల కోసం నిన్ను పక్కన పెడతాడు అంటే రేపు తెల్లారి నేను ఏం చేస్తానో మీరు తెలుసుకోలేరని అంటుంది. ప్లాన్ వివరించడంతో దేవయాని సూపర్ అంటుంది. ఇక లక్ష్మీ మిత్ర, మనీషాలకు పెళ్లి అయినట్లు కల కంటుంది. నిద్రలో ఉలిక్కి పడి లేస్తుంది.
మిత్ర దగ్గరకు వెళ్లి నుదిటిపై ముద్దు పెట్టి పడుకోవడానికి వస్తే మిత్ర లక్ష్మీ అని పిలుస్తాడు. ఏమైంది ఇంత తొందరగా లేచావని అంటే పిల్లలకు గేమ్స్ ఉన్నాయి కదా రెడీ అవ్వాలని అంటుంది. కల వచ్చిందా అందుకే భయపడుతున్నావా అని అడుగుతాడు. దాంతో లక్ష్మీ ఏడుస్తుంది. మిత్ర లక్ష్మీ కన్నీరు తుడుచి నవ్విస్తాడు. కచ్చితంగా వస్తారు కదా పిల్లల్ని నిరాశ పరచురు కదా అంటే మిత్ర దానికి లైఫ్‌లో నేను ఓడిపోయాను పిల్లల్ని ఓడిపోనివ్వను అని అంటాడు. లక్ష్మీ మనసులో మీరు తప్పు చేయలేదు మీ గిల్ట్ నుంచి నేను మీకు బయట పడేస్తాను అంటుంది. ఇక పిల్లలు రెడీ అయివస్తే రాజేశ్వరి దేవి దేవుడి దగ్గరకు తీసుకెళ్లి దండం పెట్టుకోమని చెప్తుంది. జాను వివేక్‌లు కూడా స్కూల్‌కి వస్తామని అంటారు. పిల్లల్ని చూస్తే జాను మైండ్ రిలీఫ్ అవుతుంది అంటే పిల్లల్ని చూడటమేనా కనడం ఉందా అంటే కోర్సు వాడుతున్నారు కదా వాళ్లని ఎందుకు సతాయిస్తావని తిడుతుంది.
దేవయాని లక్ష్మీ వాళ్లతో మనీషాని కూడా తీసుకెళ్లండి అంటుంది. దాంతో మిత్ర మనీషాని కూడా తీసుకెళ్దామని అంటాడు. దేవయాని పిలవడానికి వెళ్తాడు. గదిలో మనీషా ఉండదు. దేవయాని వచ్చి మొత్తం వెతికి మనీషా లేదని చెప్తుంది. మనీషాకి మిత్ర కాల్ చేస్తాడు. మనీషా కాల్ కావాలనే లిఫ్ట్ చేయదు. తర్వాత దేవయాని మనీషా బాబాయ్‌కి కాల్ చేస్తుంది. మిత్ర షాక్ అయిపోయాడని అంటుంది. మిత్ర మళ్లీ మళ్లీ కాల్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!