Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 18th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీకి రాజేశ్వరి దేవి జానుకి జరిగిన అవమానం గురించి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషాతో పాటు మిత్ర దిల్లీ వెళ్తానని లక్ష్మీతో చెప్తాడు. అవసరం లేదని మనీషా తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటుదని అంటుంది. ఇంతలో మనీషా వచ్చి నేను ఒంటరిగా వెళ్తాను మిత్ర నాకు తోడుగా ఎవరు వద్దు.. నేను ఏ తప్పు చేయలేదు.. ఒకవేళ నాకు తెలీకుండా ఏదైనా తప్పు జరిగితే జైలులో ఉంటానని నా గురించి వర్రీ అవ్వొద్దని మిత్రతో చెప్పి పంపేస్తుంది.
మనీషా: లక్ష్మీ షాక్ అయ్యావా.. ఐటీ ఎంక్వైరీ చూసి భయపడతా అనుకున్నావా. నేను ఇలా మాట్లాడుతా అని ఊహించవు కదూ. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఇంకెలా ఉంటానో ఇంకేం చేస్తానో నువ్వు అస్సలు ఊహించలేను. నిజానికి నువ్వు పొద్దున్న ఇచ్చిన షాక్‌కి నా మైండ్ బ్లాంక్ అయింది. తర్వాత ఆలోచిస్తే నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. రెడీగా ఉండు రేపు ట్రిగర్ నొక్కబోతున్నా.
రాజేశ్వరిదేవి: దాంతో జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీ.
లక్ష్మీ: అదే నేను అనుకుంటున్నా పెద్దమ్మా. రేపు అసలు అదేం చేస్తుంది.
రాజేశ్వరిదేవి: నాకు తెలిసి అది ఇంట్లో ఉండటానికి ఏదో పెద్ద ఎత్తే వేసుకుంటుంది. అది తెలుసుకొని చిత్తు చేయాలి.
జాను ఇంకా నెల తప్పలేదని దేవయాని అన్న మాటలు తలచుకొని జాను బాధ పడుతుంది. వివేక్ భోజనానికి పిలిస్తే రాను అంటుంది. టెస్ట్‌లు చేసుకుందామని వివేక్ అంటాడు. నాలో లోపం ఉందని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు కదా అందుకే వద్దని అంటున్నావా అంటే ప్రాబ్లమ్ మీలో ఉందని ఎందుకు అనుకోవడం నాలో ఉండొచ్చు కదా అంటే ఎవరిలో ప్రాబ్లమ్ ఉన్నా మందులు వాడితో సెట్ అయిపోతుందని అంటాడు. వివేక్ చెప్పడంతో జాను ఒప్పుకుంటుంది.
ఉదయం లక్ష్మీ పూజ చేస్తుంది. దీపాలు వెలిగిస్తుంది. రాజేశ్వరి దేవి పిలవడంతో లక్ష్మీ అటు తిరిగి చూస్తుంది. దాంతో దీపాలు పడిపోతాయి. అది చూసిన రాజేశ్వరి దేవి కీడు జరగబోతుంది. ఏదో అపశకునంలా ఉందని మిత్రని తీసుకెళ్లి గుడికి వెళ్లమని చెప్తుంది. ఇక జానుని తీసుకొని వివేక్ హాస్పిటల్‌కి వెళ్తున్నాడని దేవయాని జానుని అవమానించిన విషయం చెప్తుంది. అక్కా చెల్లెళ్లు ఇద్దరికీ ఒకే సారి కష్టాలు వచ్చాయని అంటుంది. మనీషా మిత్ర దగ్గరకు వెళ్లి ఈవినింగ్ దిల్లీ వెళ్తున్నాను అని అంటుంది. టెన్షన్‌గా ఉందా అని మిత్ర అడిగితే మనసులో నువ్వు ఉండగా టెన్షన్ ఎందుకు అంటుంది. ఇక మిత్రతో నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా మిత్ర నువ్వు నన్ను తప్పు చేశానని అంటే నేను తట్టుకోలేనని నువ్వు నమ్మితే ఎక్కడికైనా వెళ్తానని నువ్వు నమ్మకపోతే ప్రాణాలతో ఉండను అని అంటుంది. దాంతో మిత్ర నేను నిన్ను నమ్ముతున్నానని అంటాడు. దాంతో మనీషా మిత్రని హగ్ చేసుకుంటుంది. లక్ష్మీ అది చూస్తుంది. లక్ష్మీ చూస్తుండగానే నా ప్రాణం నీదే మిత్ర.. అని కళ్లు ఎగరేస్తుంది. లక్ష్మీ నువ్వు ఎప్పుడు వచ్చావ్ అని ఏం తెలియనట్లు అడుగుతుంది.
మనీషా వెళ్లిపోయిన తర్వాత మిత్ర వివరణ ఇవ్వడానికి ప్రయత్నించడంతో లక్ష్మీ ఏం వివరణ అవసరం లేదని అంటుంది. గుడికి వెళ్దామని చెప్పి మిత్రని తీసుకెళ్తుంది. ఇంతలో సంతోష్ అని వివేక్ క్లాస్మేట్ వస్తాడు. వివేక్ సంతోష్‌ని హగ్ చేసుకుంటాడు. తనకు పెళ్లి ఫిక్స్ అయిందని సంతోష్ చెప్తాడు. కాలేజ్‌లో ఉన్నప్పుడే ఒకమ్మాయిని లవ్ చేశావు కదా అంటే ఆ అమ్మాయిని లవ్ చేశా ఫిజికల్‌గా అనుకోకుండా జరిగిపోయింది అందుకే ఇద్దరం అనుకొని విడిపోయాం ఇప్పుడు ఈమెను పెళ్లి చేసుకున్నా అంటాడు. అలా ఎలా ఆమెను వదిలేస్తావ్ అని మనీషా అడిగితే సంతోష్ కాబోయే భార్య వర్ష అనుకోకుండా జరిగిన వాటిని వదిలేసి ముందుకు వెళ్లాలని జరిగింది మర్చిపోవాలని అంటుంది. ఈ వంకతో రాజేశ్వరిదేవి మనీషాకి క్లాస్ ఇస్తుంది. మిత్ర, లక్ష్మీ గుడికి వెళ్తారు. వివేక్, జాహ్నవిలు హాస్పిటల్కి వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. భర్తకి అండగా దీప.. సమస్యల ఊబిలో జ్యోత్స్న!