Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర మనీషాతో లక్కీని వాళ్ల తల్లి తీసుకెళ్లకుండా ఆపు అని ధీనంగా కోరుతాడు. మనీషా అది నా బాధ్యత అని తెగ బిల్డప్ ఇస్తుంది. దాంతో మిత్ర వెళ్లిపోయిన తర్వాత దేవయాని మనీషాతో నిజంగానే లక్కీని వెళ్లనివ్వవా అని అడుగుతుంది. దానికి మనీషా అంత లేదు లక్కీ వెళ్లిపోతేనే మిత్రని పూర్తిగా నా సొంతం చేసుకోవచ్చని అంటుంది.
మనీషా: ఈ రోజే లక్కీని పార్వతితో పంపించేయాలి అనుకుంటున్నా.
దేవయాని: మని మిత్రకిచ్చిన మాట.
మనీషా: అది గాలి మాట. లక్కీ దూరం అవ్వాలి మిత్ర కృంగిపోవాలి నేను ఓదార్చి దగ్గరవ్వాలి. అదే నా ప్లాన్. ఈ కాలంలో లక్ష్మీలా నిజాయితీగా ఉండకూడదు ఆంటీ నాలా నటించాలి అప్పుడే సక్సెస్ అవుతాం.
ఇక లక్ష్మీ, వివేక్‌లు ట్రైలరింగ్ షాక్ దగ్గరకు వెళ్లి పార్వతి గురించి ఆరా తీస్తారు. సరయు వల్ల అక్కడి వాళ్లు పార్వతి గురించి పాజిటివ్‌గా చెప్తారు. వివేక్ అదే నిజమేమో అంటే దానికి లక్ష్మీ నాటకం ఆడుతుందేమో తను లక్కీ మదర్ కాదని ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్లుందని మనం అది కనిపెట్టాలని అనుకుంటారు. ఇక వాళ్లు వెళ్లిపోగానే షాప్ అతను సరయుకి కాల్ చేసి మీరు చెప్పినట్లే చెప్పానని అంటాడు. ఇక సరయు రాజుతో లక్ష్మీకి మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇవ్వబోతున్నాను అంటుంది.
పార్వతి ఆరుబయట ఉంటే మనీషా, దేవయాని అక్కడికి వెళ్తారు. మిత్ర చూస్తున్నాడని కావాలనే పార్వతితో లక్కీని తీసుకెళ్లొద్దన్నట్లు చెప్తుంది. కావాలనే చేతులెత్తి దండం పెట్టి మా పాపని మాకు ఇచ్చేయండి అంటుంది. దానికి పార్వతి నా పాపని నేను ఎలా ఇస్తాను అని అంటుంది. మనీషా ఓవర్ చేసి పార్వతి చేతులు పట్టేసి ఏడ్చేసి చిన్నగా పార్వతి కాళ్లు పట్టుకున్నట్లు నటించి ఒప్పుకోమని పార్వతికి చెప్తుంది. మిత్ర లక్కీ తల్లిగా ఇక్కడే మీరు ఉండిపోండి అంటాడు. దాంతో పార్వతి సరే అని అంటుంది. నేను ఇక్కడ ఉండలేనని పాపని ఇక్కడే ఉంచి అప్పుడప్పుడు వచ్చి చూస్తానని అంటుంది. మనీషా పార్వతికి థ్యాంక్స్ చెప్తుంది. ఇంతలో సరయు పార్వతికి కాల్ చేసి ఆ డ్రామా పూర్తయిందా ఇప్పుడు నేను చెప్పినట్లు చేయి అని అంటుంది. దాంతో పార్వతి ఫోన్‌లోనే ఏంటంటి ఆవిడ అలా చేసిందా అని కోపంగా మాట్లాడుతుంది.
పార్వతి: మీరు గొప్పింటోలు మర్యాదస్తులు అనుకున్నా మీరు చేసిన పని ఇదా. నన్ను 3 రోజులు ఇక్కడ ఉండమని చెప్పి ఇంతలా అవమానిస్తారా.
మిత్ర: మేమేం చేశామండీ.
పార్వతి: మీరు కాదు సార్ మీ భార్య లక్ష్మీ, మీ తమ్ముడు వివేక్ నా కోసం ఎంక్వైరీ చేస్తున్నారంట. నేను ఉన్న ఇంటి దగ్గరకు పని చేస్తున్న షాప్ దగ్గరకు వెళ్లి ఆరా తీస్తున్నారంట.
మనీషా: సారీ పార్వతి గారు తను ఇలా చేస్తున్నట్లు మాకు తెలీదు.
పార్వతి: మీకు తెలీకుండా ఇంత జరుగుతుందా. మీరు మంచోళ్లని నా పాపని ఇక్కడే ఉంచాలి అనుకున్నా మీరు ఇలాంటి వాళ్లని తెలిశాక ఒక్క క్షణం కూడా ఉండను. ఇప్పుడే నా పాపని తీసుకొని వెళ్లిపోతా.
మనీషా: ఏయ్ ఓవర్ చేయకు లక్ష్మీ వచ్చాక మిగతా ఓవర్ చేద్దువు.
మన కష్టాన్ని లక్ష్మీ వృథా చేసిందని లక్ష్మీ రాగానే అడుగు అని మనీషా మిత్రతో అంటుంది. అందరూ లక్ష్మీ కోసం ఎదురు చూస్తుంటారు. ఇంకా ఎంత సేపు ఎదురు చూడాలని పార్వతి అంటుంది. పార్వతి లక్కీని తీసుకొని రా వెళ్లిపోదాం అని లక్కీని లాగుతుంది. లక్కీ నేను రాను అని ఏడుస్తుంది. జున్ను కూడా లక్కీని తీసుకెళ్లొద్దని అంటాడు. బలవంతంగా తీసుకెళ్తే ఊరుకోనని జున్ను అడ్డుకుంటాడు. అయినా పార్వతి బలవంతంగా పాపని తీసుకెళ్తుంది. లక్కీ రాను రాను అని ఏడుస్తూ మిత్రని హగ్ చేసుకొని నేను వెళ్లను నాన్న అంటుంది. ఇంతలో లక్ష్మీ వచ్చి ఎందుకు పార్వతి గారు చిన్న పిల్లని ఇలా ఇబ్బంది పెడుతున్నారని అంటుంది. మిత్ర కోపంగా ఇంతసేపు ఎక్కడికి వెళ్లావని కోప్పడతాడు.
ఎంక్వైరీలు చేయమని మీకు ఎవరు చేయమన్నారని అడుగుతాడు. మనీషా కూడా లక్ష్మీని తిడుతుంది. తనని బాధ పెట్టడమే లక్ష్మీ పని అని మిత్ర అంటాడు. లక్ష్మీ మొదటి నుంచి తప్పులే చేస్తుందని మిత్ర కోప్పడతాడు. లక్కీని ఇక్కడుంచడానికి మనీషా ఆవిడ కాళ్లు పట్టుకొని బతిమాలితే అంతా తలకిందుల చేసిందని అంటాడు. దాంతో వివేక్, లక్ష్మీలు మనీషాని అనుమానంగా చూస్తారు. లక్కీ వెళ్లిపోతే దానికి కారణం లక్ష్మీనే అని మనీషా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి, లక్ష్మీలకు సంబంధం ఉందని సహస్రతో చెప్పిన అంబిక.. ఆధారాలు చూపించిందా!